బిగ్ బాస్ ఆఫర్‌ని తిరస్కరించా.. క్లారిటీ ఇచ్చిన ‘గుప్పెడంత మనసు’ జగతి

సోషల్ మీడియా షేక్ చేసే ఫొటోలతో ‘హాట్’ టాపిక్ అవుతోంది గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతి మేడమ్ అలియాస్ జ్యోతిరాయ్. ఈమె అసలు పేరు జయశ్రీ రాయ్ కాగా.. ఇటీవల సుకుపుర్వాజ్ అనే దర్శకుడితో రిలేషన్‌లో ఉండటంతో అతని పేరుని తన పేరు చివరన పెట్టుకుని జ్యోతిపుర్వాజ్‌గా మారింది. ఈ పేర్ల మార్పు.. ఈమె ఎఫైర్ల సంగతి పక్కనపెడితే.. గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషికి తల్లిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్ర చేసిన జ్యోతిరాయ్.. సోషల్ మీడియాలో మాత్రం కుర్రాళ్ల గుండెల్ని గునపాలు దింపేసేట్టుగా ఫొటోలు వదులుతుంటుంది.

39 ఏళ్ల వయసులోనూ నైన్‌టీస్ పోరీలా అందాలను ఆరబోస్తూ.. ఇన్‌స్టాగ్రామ్ హీటెక్కించడమే పనిగా పెట్టుకున్న ఈ బ్యూటీ ఆంటీకి బిగ్ బాస్ ఆఫర్ వచ్చేసింది. బిగ్ బాస్ ఆఫర్ అంటే.. డబ్బుకి డబ్బు పేరుకి పేరు ఎలా వస్తుందో… ఉన్న పేరు కూడా ఊడిపోయే ప్రమాదం ఉండనే ఉంది. అయితే కర్ర విరక్కుండా.. పాము చావకుండా అన్నట్టుగా.. తనకి వచ్చిన బిగ్ బాస్ ఆఫర్‌ని రిజెక్ట్ చేసింది జ్యోతి రాయ్.

తెలుగుతో పాటు.. కన్నడలోనూ బిగ్ బాస్ సీజన్ 11 త్వరలో ప్రారంభం కాబోతుంది. తెలుగు కంటే ముందే కన్నడలో బిగ్ బాస్‌కి ఆదరణ ఉండటంతో.. అక్కడ 10 సీజన్లు కంప్లీట్ చేసి.. 11 సీజన్‌కి రెడీ అయ్యారు. కాగా.. కన్నడ (Bigg Boss Kannada Season 11) బిగ్ బాస్‌లో జ్యోతిరాయ్‌కి అవకాశం వచ్చింది. అయితే కన్నడలో చాలామంది బిగ్ బాస్ ఆఫర్ కోసం ఎదురుచూస్తుండగా.. వాళ్లందర్నీ కాదని జగతి మేడమ్‌కి అవకాశం ఇచ్చారు. అయితే జగతి మేడమ్ మాత్రం.. బిగ్ బాస్‌కి వెళ్లడం లేదని స్పష్ఠం చేస్తూ కారణాలను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ‌లో షేర్ చేసింది.


‘‘కన్నడ బిగ్ బాస్ 11లో నేను పోటీ చేసే అవకాశం ఉందా లేదా అని చాలా మంది అడుగుతున్నారు. బిగ్ బాస్ టీమ్ నుండి నాకు ఆఫర్ వచ్చింది. నేను దాన్ని గౌరవంగా తిరస్కరించాను. గతంలో అంగీకరించిన ప్రాజెక్ట్స్‌కి సంబంధించి బిజీ షెడ్యూల్ వల్ల నేను ఈ నిర్ణయం తీసుకున్నారు. నాకు బిగ్ బాస్‌లో అవకాశం ఇచ్చినందుకు టీం వాళ్లకి ధన్యవాదాలు. నా అభిమానుల మద్దతు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుతున్నాను’ అంటూ పోస్ట్ పెట్టింది జ్యోతిరాయ్.

కాగా.. కన్నడలో 20పైగా సీరియల్స్‌లో నటించి మెప్పించిన జ్యోతిరాయ్.. అనేక సినిమాల్లోనూ నటించింది. 20 ఏళ్ల వయసులో పద్మనాభ అనే నెట్ వర్కింగ్ ఇంజనీర్‌ను పెళ్లాడిన ఈమెకు.. ఒక బాబు కూడా ఉన్నారు. పెళ్లైన తరువాత భార్యని సినిమాల్లో ఎంకరేజ్ చేశాడు పద్మనాభ. అయితే ఆ భర్త ఏమయ్యాడో.. తన పిల్లలు ఏమయ్యారో ఏమో కానీ.. ఇప్పుడు మాత్రం యువ దర్శకుడు సుకుపుర్వాజ్ అలియాస్ సురేష్ కుమార్‌తో రిలేషన్‌ కంటిన్యూ చేస్తుంది జ్యోతిరాయ్. ప్రజెంట్ కన్నడ ఛాన్స్ మిస్ అయినా తెలుగు బిగ్ బాస్‌లో జ్యోతిరాయ్‌కి తలుపులు తెరిచే ఉంటాయి. ఆమె వెళ్లాలని ప్రయత్నించాలే కానీ.. తెలుగు వాళ్లని పక్కని నెట్టి మరీ.. పక్క ఇండస్ట్రీ వాళ్లకి అవకాశం ఇస్తుంటారు మన తెలుగోళ్లు. కాబట్టి.. ఈ సీజన్‌కి కాకపోయినా.. వచ్చేసీజన్ అయినా జ్యోతిరాయ్ బిగ్ బాస్ హౌస్‌లో కనిపించడం ఖాయమే.

About amaravatinews

Check Also

మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే ప్రభుత్వం సీరియస్‌: రేవంత్ రెడ్డి

గంటలుగా కొనసాగుతున్న సీఎం, సినీ పరిశ్రమ పెద్దల భేటీ . బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *