భారీ వర్షాల వేళ విజయవాడకు అమావాస్య గండం.. బిక్కుబిక్కుమంటున్న జనం

రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలను వణికిస్తున్నాయి. గత 2, 3 రోజుల నుంచి కురుస్తున్న ఏకధాటి వర్షానికి నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక జలాశయాలు, ప్రాజెక్టులు నిండిపోవడంతో.. గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇక తెలంగాణలోని ఖమ్మం, హైదరాబాద్.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు.. ప్రళయాన్ని తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మనిషి మునిగే లోతులో వరదనీరు చేరింది. సహాయం కోసం వరద బాధితులు.. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం అమావాస్య కావడంతో.. బెజవాడ వాసుల్లో భయం నెలకొంది. అమావాస్య వేళ.. సముద్రం పోటు మీద ఉండటంతో.. వరద మరింత పెరుగుతుందని వారు తీవ్ర భయాందోళనలో మునిగిపోయారు.

అమావాస్య కావడంతో ప్రస్తుతం సముద్రం పోటు మీద ఉంది. సముద్రం పోటు మీద ఉంటే పై నుంచి వచ్చే వరద నీటిని సముద్రం అంత త్వరగా తీసుకోలేదు. పైన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద నీటిని మొత్తం సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇక పోటు మీద ఉన్న సముద్రం ఆ జలాలన్నింటినీ తనలో వేగంగా కలుపుకోలేకపోతే వరద ప్రభావిత ప్రాంతాల్లోకి మరింత వర్షం నీరు వచ్చే చేసే అవకాశాలు ఉంటాయి. దీంతో అవన్నీ మరింత వరదలో మునిగిపోతాయి. ఇప్పుడు ఇదే భయం విజయవాడ వాసులకు మొదలైంది. ఇక ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటం.. దిగువన సముద్రం పోటు మీద ఉండటంతో ఏం ఆపద ఎటు నుంచి వస్తుందోనని బెజవాడ వాసులు భయంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారు. ఇక సోమవారం రాత్రి 12 గంటలు దాటిన తర్వాతే.. అమావాస్య గడియలు ముగస్తాయని.. అప్పుడే సముద్రం సాధారణ స్థితికి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఎగువ నుంచి వచ్చే వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

About amaravatinews

Check Also

ఈ సారి భారతరత్న దక్కేది ఎవరికి? రేసులో ముందున్న ఆ ఇద్దరు..!

రిపబ్లిక్ డే వేళ భారతరత్న ఈ సారి ఎవరికి ఇవ్వబోతున్నారన్న చర్చ మొదలయ్యింది. గత ఏడాది భారతరత్న చరిత్రలోనే అత్యధికంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *