అల్లూరి జిల్లా: వాగు ఒడ్డున బంగారు వర్ణంలో హనుమాన్ విగ్రహం.. చూసేందుకు జనం క్యూ, ప్రత్యేక పూజలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో వాగులో హనుమాన్ విగ్రహం కొట్టుకువచ్చింది. రాజవొమ్మంగి మండలం జడ్డంగి దగ్గర మడేరు వాగులో ఆంజనేయ స్వామి విగ్రహం వరదకు కొట్టుకొచ్చి ఒడ్డుకు చేరింది. వాగు నీటి నుంచి ఒడ్డుకు చేరి ఇసుక దిబ్బల్లో నిలబడి ఉన్న స్వామి విగ్రహాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. హనుమంతుడి విగ్రహం బంగారు వర్ణంలో మెరిసిపోయింది.. విగ్రహాన్ని ఇసుక నుంచి బయటకు తీసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి జడ్డంగి రామాలయంలో ఉంచారు. హనుమాన్ విగ్రహాన్ని మంచి ముహూర్తం చూసి ప్రతిష్ఠిస్తామని గ్రామ పెద్దలు తెలియజేశారు. హనుమంతుడి విగ్రహం వాగులో కొట్టుకొచ్చిందని తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చూసేందుకు భారీగా తరలివచ్చారు. నదులు, వాగుల్లో విగ్రహాలు వరదల సమయంలో కొట్టుకొచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎక్కడన్నా ఆలయాల్లోని విగ్రహం ఇలా వరదలో కొట్టుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు. మొత్తం మీద హనుమంతుడి విగ్రహం అంశం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చర్చనీయాంశం అయ్యింది.

మారేడుమిల్లిలోని పర్యటక ప్రదేశాల్లో కనీస సదుపాయాలు లేకుండా పోతున్నాయని పర్యాటకులు చెబుతున్నారు. మారేడుమిల్లి, వాలమూరు, టైగర్‌క్యాంపు ప్రాంతాలతో పాటు, గుడిస కొండను పర్యటకంగా కమ్యూనిటీ బేస్డ్‌ ఎకో-టూరిజంలో భాగంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతానికి ప్రతి రోజూ వేలాది సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ఆయా ప్రదేశాల్లో పర్యాటకులకు కనీస సదుపాయాలు లేవంటున్నారు. కొన్నిప్రాంతాల్లో కనీసం రహదారి కూడా లేకపోవడంతో తరచూ వాహనాలు ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు. కొండపై కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేదని.. పాములేరు వాగులో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

About amaravatinews

Check Also

విజయనగరం ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు.. ఈసీ సంచలన ప్రకటన

MLC Election: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు అయింది. ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *