హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం (అక్టోబర్ 20న) రాత్రి.. హైదరాబాద్ నుంచి బయలుదేరిన బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కు.. అకస్మాత్తుగా ఓ వ్యక్తి అడ్డుగా వచ్చాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో.. వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టాయి. ఇలా.. కాన్వాయ్‌లోని 3 వాహనాలు ఒక్కదానికొకటి వరుసగా ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో బండారు దత్తాత్రేయకు ఎలాంటి ప్రమాదం కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు గానూ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్తున్న సమయంలో.. ప్రధాన రహదారిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మూడు వాహనాలు పాక్షికంగా ధ్వంసం కాగా.. వాహనాల్లో ఉన్న వ్యక్తులకు ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
https://photogallery.navbharattimes.indiatimes.com/dmp_orion.cms?msid=114402907&sec=hyderabad&secmsid=79628161&wapCode=telugu&apikey=teluguweb5e97054033e061&rvMsid=97084506&isXpVdo=tlg_xp&isAmp=false
అయితే.. ఏటా జరిపినట్టుగానే ఈసారి దసరా పండుగకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అట్టహాసంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే.. ప్రస్తుతం దత్తాత్రేయ.. గవర్నర్‌గా ఉండటంతో.. ఈ కార్యక్రమ బాధ్యతలను ఆయన తనయ విజయలక్ష్మి చూసుకుంటున్నారు. అయితే.. ఈసారి నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బండారు దత్తాత్రేయ.. తిరిగి ఈరోజే వెళ్తున్న క్రమంలోనే.. ఈ ప్రమాదం సంభవించింది.
Advertisement