ఆర్మీ చాపర్ నుంచి జారిపడిన హెలికాప్టర్.. లైవ్ వీడియో వైరల్

ఆర్మీ చాపర్ నుంచి హెలికాప్టర్ జారి పడిపోయిన ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపంతో దెబ్బతిన్న హెలికాప్టర్‌ను అక్కడి నుంచి మరో చోటుకు తరలించేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. ఆ దెబ్బతిన్న హెలికాప్టర్‌ను ఆర్మీ చాపర్‌కు తీగల సహాయంతో కట్టి తీసుకువస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్మీ చాపర్‌కు కట్టిన తీగలు ఒక్కసారిగా తెగిపోవడంతో కింద ఉన్న హెలికాప్టర్ పట్టుకోల్పోయి.. పడిపోయింది. ఆ హెలికాప్టర్ కొండల్లో పడిపోతున్న దృశ్యాలను దూరంగా ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతికూల వాతావరణం కారణంగా కేదార్‌నాథ్‌ యాత్రను కూడా ఇప్పటికే అధికారులు నిలిపివేశారు. ఈ క్రమంలోనే యాత్రికులు కేదార్‌నాథ్‌ వెళ్లేందుకు హెలికాప్టర్‌ సేవలు కూడా ప్రారంభించారు. అయితే కొన్ని రోజుల క్రితం ఈ యాత్రికులను తరలించే క్రెస్టల్ హెలికాప్టర్.. కేదార్‌నాథ్‌లో భక్తులను దించి.. తిరిగి వెళ్తుండగా.. సాంకేతిక లోపంతో కూలిపోయింది. దీంతో అది కాస్తా దెబ్బతిన్నది.

About amaravatinews

Check Also

దేశంలో అత్యంత పొడవైన రైల్వే నెట్‌ వర్క్ ఈ రాష్ట్రానిదే..! భారతీయ రైల్వేలో రారాజు.. ఎన్ని వేల కిలో మీటర్లంటే..

ఇక్కడ 150 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల ఐదు ప్రాచీన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అవి బ్రిటిష్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *