సీఎం చంద్రబాబును ఆ ఒక్క విషయంలో స్వాగతిస్తున్నాం: వైఎస్ షర్మిల

ఏపీ కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు గాలికి కొట్టుకుపోయాయని మండిపడ్డారు. వాటి స్థానంలో కొత్తగా సిక్స్ పాలసీలు వచ్చాయని ఎద్దేవా చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇటీవల జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో సూపర్ సిక్స్‌లో ఒక్క సిక్స్ అయినా అమలు చేస్తారని అనుకున్నామని చెప్పారు. మహిళలకు శుభవార్త చెబుతారనుకుంటే.. మెుండి చేయి చూపారని ఫైరయ్యారు. ‘రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగాలు రావాలి. 30 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తాం అన్నారు. 20 లక్షల …

Read More »

మిస్ ఇండియా 2024గా నిఖితా పోర్వాల్.. ఇంతకీ ఆమె ఎవరంటే?

Nikita Porwal: ఈ ఏడాది మిస్‌ ఇండియా కిరీటం మధ్యప్రదేశ్‌కు చెందిన నిఖితా పోర్వాల్‌ దక్కించుకున్నారు. ముంబైలోని ఫేమస్ స్టూడియోస్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో అన్ని రాష్ట్రాలకు చెందిన అందాల తారలు పోటీ పడగా.. చివరికి నిఖితా పోర్వాల్‌నే విజయం వరించింది. మిస్ ఇండియాగా నిలిచిన నిఖాతా పోర్వాల్.. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో భారత్‌ తరఫున బరిలోకి దిగనున్నారు. మిస్ ఇండియా టైటిల్ గెలిచిన తర్వాత నిఖితా పోర్వాల్.. సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక గత ఏడాది మిస్ ఇండియాగా నిలిచిన నందిని గుప్తా.. …

Read More »

టీచర్‌గా మారిన జిల్లా కలెక్టర్.. స్టూడెంట్స్‌కు పాఠాలు చెప్పి మాటా ముచ్చట్లు

ఆయనో జిల్లా కలెక్టర్.. పాలనా సంబంధిత పనులతో చాలా బిజీగా ఉంటారు. అయితే ఓ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్.. అక్కడి విద్యార్థులకు పాఠాలు బోధించారు. చాలా ఓపికగా మ్యాథ్స్ పాఠాలు చెప్పారు. ఏకంగా జిల్లా కలెక్టరే పాఠాలు చెబుతుంటే ఆ విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పాఠాలు చెప్పడమే కాదు అవి ఎంతవరకు విద్యార్థులకు అర్థమయ్యేయో అనే విషయం ఆ విద్యార్థులను ప్రశ్నలు అడిగి మరీ తెలుసుకున్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.. జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం …

Read More »

భారత్ 46 ఆలౌట్.. సొంత గడ్డపై అత్యల్ప స్కోరు.. కివీస్ పేసర్ల ధాటికి విలవిల్లాడిన బ్యాటర్లు..!

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత జట్టు కుప్పకూలింది. పేకమేడను తలపిస్తూ.. భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. మొత్తంగా కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. దీంతో భారత్.. కేవలం 31.2 ఓవర్లలోనే 46 పరుగులకు కుప్పకూలింది. భారత జట్టుకు సొంత గడ్డ మీద టెస్టుల్లో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ఓవరాల్‌గా టీమిండియాకు టెస్టుల్లో ఇది మూడో అత్యల్ప స్కోరు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి …

Read More »

Reliance : రిలయన్స్‌ జియో సంచలనం.. కేవలం రూ.1099 ధరకే.. JioBharat V3 V4 ఫోన్లు.. స్మార్ట్‌ఫోన్లకు ఏమాత్రం తీసిపోని ఫీచర్లు!

JioBharat V3 V4 phones launch: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) మరో రెండు కొత్త 4జీ ఫోన్లను లాంచ్ చేసింది. మొబైల్ కాంగ్రెస్ 2024లో జియో భారత్ వీ3, వీ4 పేరిట వీటిని భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. సరసమైన ధరకు 4 జీ కనెక్టివిటీని అందించే ఈ రెండు ఫోన్లను రిలయన్స్ జియో లాంచ్ చేసింది. రూ.1,099 ప్రారంభ ధరతో జియోభారత్ V3, V4 మోడళ్లను విడుదల చేసింది. భారత్‌లో 2జీ నెట్ వర్క్‌పై ఉన్న కోట్లాది మంది …

Read More »

ఒకేసారి 3 శుభవార్తలు చెప్పిన ప్రముఖ టెక్ సంస్థ.. అంచనాల్ని మించి లాభాలు.. ఉద్యోగులకు పండగే!

L and T Technology Services: ప్రముఖ ఇంజినీరింగ్ సేవల సంస్థ ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ (LTTS) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి గానూ ఫలితాల్ని ప్రకటించింది. అక్టోబర్ 16న ఫలితాల్ని వెల్లడించగా.. నికర లాభం అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 1.3 శాతం మేర పెరిగి రూ. 319.60 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఈ సమయంలో లాభం రూ. 315.4 కోట్లుగా ఉండేది. ఇక సంస్థ కార్యకలాపాల ఆదాయం రెండో త్రైమాసికంలో …

Read More »

టీడీపీని వీడి వైసీపీలో చేరిన కీలక నేత.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

ఆంధ్రప్రదేశ్‌‌‌లో సార్వత్రిక ఎన్నికలు వైఎస్సార్‌సీపీని కోలుకోలేని దెబ్బతీశాయి. ఆ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది.. ఫలితాల తర్వాత వరుసగా నేతలు పార్టీని వీడుతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పేశారు.. జిల్లాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే మొన్నటి వరకు వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరిన నేతల్ని చూశాం.. కానీ ఈయన మాత్రం కాస్త వెరైటీ. అధికారంలో ఉన్న టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరి షాకిచ్చారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు …

Read More »

హైడ్రా కూల్చివేతలపై మరో కీలక నిర్ణయం.. బాధితులకు పరిహారం..!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. గత 2-3 నెలల వ్యవధిలో వందలాది ఇండ్లను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. కాగా, ఈ హైడ్రా కూల్చివేతలపై విమర్శలు వస్తున్నాయి. పేదల ఇండ్లను మాత్రమే నేలమట్టం చేస్తున్నారని.. పైసా పైసా కూడబెట్టి కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూల్చేయటం సరైంది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. బిల్డర్లు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన మోసానికి పేదలు నష్టపోతున్నారని.. అసలు అది చెరువుల …

Read More »

ఏపీలో మందుబాబులకు శుభవార్త.. లిక్కర్ ధరలపై భారీ ఊరట, పండగ చేస్కోండి

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం షాపులు మొదలయ్యాయి.. బుధవారం నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. కొత్త షాపుల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా షాపుల్లో బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి వచ్చింది. మందుబాబులో బ్రాండెడ్ లిక్కర్ కొనుగోలు చేయడం కనిపించింది. బుధవారం ఉదయం నుంచే మందుబాబులు కొత్త షాపుల దగ్గర బారులు తీరారు. మంగళవారం అర్ధరాత్రి వరకు ప్రభుత్వ షాపుల్లోని పాత సరుకును అధికారులు లెక్క చూసి డిపోలకు పంపించారు. బుధవారం ఉదయం నుంచి కొత్త స్టాక్‌ను ప్రైవేటు షాపులకు తరలించారు. అన్ని షాపులకు …

Read More »

వరదలతో చెన్నై అతలాకుతలం.. ‘హైడ్రా’పై చర్చ

చెన్నై నగరాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. తమిళనాడు రాజధానితో పాటు దాని పరిసర జిల్లాల్లో రెండు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వరదలు పెద్ద ఎత్తున పోటెత్తడంతో నగరవాసులు నరకం అనుభవిస్తున్నారు. 300 ప్రాంతాలు నీట మునిగాయి. సబ్‌వేలల్లో 3 అడుగుల మేర నీరు చేరింది. కొంత మంది నడుము లోతు నీళ్లలో వెళ్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెన్నై వరదలు తమిళనాడు వాళ్లకే …

Read More »

ఏపీలో కొత్త పింఛన్‌ల కోసం దరఖాస్తు చేసుకోండి.. ఆ నెల నుంచే డబ్బులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు మంజూరుకు సంబంధించి కసరత్తు చేస్తోంది. జనవరిలో కొత్త పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది.. జనవరిలో జన్మభూమి-2 కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఆ సభల్లో కొత్త లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు అందించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ హయాంలో అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులు వచ్చాయి. కొంతమంది తప్పుడు డాక్యుమెంట్లతో పింఛన్లు పొందినట్లు విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా దివ్యాంగుల కేటగిరీలో కొన్ని వేల మంది …

Read More »

Jammu Kashmir: 20 సార్లు చావు నుంచి బయటపడి.. జమ్మూ కాశ్మీర్‌లో ఏకైక మహిళా మంత్రిగా సకీనా ఈటూ

Jammu Kashmir: ఎట్టకేలకు జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడింది. ఇటీవల జరిగిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ – నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఘన విజయం సాధించగా.. తాజాగా ముఖ్యమంత్రిగా ఎన్‌సీ నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం సహా నలుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వీరిలో ఏకైక మహిళా మంత్రిగా సకీనా ఈటూ ప్రమాణం చేశారు. రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన సకీనా ఈటూ.. తండ్రి, సోదరుడు కూడా రాజకీయాల్లో ఉండేవారు. ఆమె …

Read More »

ఐఏఎస్‌లకు హైకోర్టులో చుక్కెదురు.. ఏపీలో రిపోర్టు చేయాల్సిందే, రిలీవ్ చేయనున్న తెలంగాణ

కేంద్రం ఇటీవల బదిలీ చేసిన ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టులోనూ ఊరట దక్కలేదు. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ ఏడుగురు ఐఏఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ అధికారులు రొనాల్డ్ రాస్, వాకాటి కరుణ, ఆమ్రపాలి కాటా, వాణీప్రసాద్, హరి కిరణ్, శివశంకర్, సృజన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. క్యాట్ ఆదేశాలను సమర్థించింది. డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని స్పష్టం …

Read More »

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ దారి మూసేసిన టీటీడీ

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. తిరుమల, తిరుపతికి భారీ వర్ష సూచన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా గురువారం శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని మూసివేయాలని నిర్ణయించింది. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో టీటీడీ ఈవో శ్యామలరావు.. బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విపత్తును ఎలా ఎదుర్కొనాలనే దానిపై పలు సూచనలు చేశారు. టీటీడీ సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలన్న ఈవో.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని …

Read More »

Rs 10 Coin: రూ.10 కాయిన్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్.. దిగ్గజ బ్యాంకుల కీలక నిర్ణయం!

Rs 10 Coin: ప్రస్తుతం మార్కెట్‌లో రూ.10 కాయిన్లు తీసుకోవడం లేదు. ఏదైనా కొనుగోలు చేసి 10 రూపాయల నాణెం ఇస్తే చెల్లడం లేదని తీసుకోవడం లేదు. ఈ అనుభవం మీకు కూడా ఎదురయ్యే ఉంటుంది. కొందరి వద్ద పదు సంఖ్యలో నాణేలు జమ అయ్యాయని చెబుతున్నారు. ఎవరూ తీసుకోకపోవడంతో నష్టపోవాల్సిందేనా అని బాధపడుతున్న వారూ ఉన్నారు. అయితే, అలాంటి వారదరికీ ఇది శుభవార్త అని చెప్పాలి. రూ.10 నాణేల చెల్లుబాటుపై ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ …

Read More »