Blog Layout

జనావాసంలో చిరుత హల్ చల్.. రైతుకి తీవ్ర గాయం.. అటవీ శాఖ నిర్లక్షంపై మండిపాటు..

అడవుల్లో నుంచి జనావాసంలోకి వచ్చిన చిరుత పులి హల్చల్ చేసింది. చిరుతను బంధించేందుకు రైతులు పడిన కష్టమంతా అంతా కాదు. చివరకు ఓ రైతుపై చిరుత పంజా విసిరింది. తీవ్ర గాయం కావడంతో రైతులంతా ఏకమై చిరుతను వలలో బంధించారు. ఇదంతా గమనిస్తున్న రైతులు అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.కర్నూలు జిల్లా కోసిగి తిమ్మప్ప, బసవన్న కొండల్లో చిరుతలు గత కొంతకాలంగా సంచరిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం బసవన్న కొండ వెనుక ఉన్న ఎర్ర వంకలో చిరుత పులి కనిపించింది. అనారోగ్య సమస్యతో …

Read More »

ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న టైమింగ్..

డిజిటల్ చెల్లింపుల రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ, భారతదేశంలో దైనందిన జీవితంలో ఒక భాగంగా మారింది. నగదు రహిత లావాదేవీలను సులభతరం చేస్తూ, కోట్లాది మంది ప్రజల ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేసింది. ఇప్పుడు యూపీఐ వినియోగదారులకు మరో శుభవార్త. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న తాజా నిర్ణయంతో, జూన్ 16 నుంచి యూపీఐ లావాదేవీలు మరింత వేగంగా, సమర్థవంతంగా జరగనున్నాయి. ఈ మార్పులు ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా లావాదేవీలు జరిపే వారికి …

Read More »

నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం.. చరిత్ర, ప్రాముఖ్యత, ఈ ఏడాది రక్తదాతల దినోత్సవం థీమ్ ఏమిటంటే..

రక్తదానం చేయండి.. ప్రాణదాత కండి ఈ నినాదం గురించి అందరికీ తెలిసిందే. రక్తదానాన్ని గొప్ప దానంగా భావిస్తారు. ఒక యూనిట్ రక్తంముగ్గురు జీవితాలను కాపాడుతుంది. ఇలా రక్తం దానం చేయడం వలన ప్రాణం కాపాడడమే కాదు.. ఆరోగ్యానికి కూడా లాభం. అత్యవసర పరిస్థితుల్లో సరైన సమయంలో రక్తం అందుబాటులో లేకపోతే.. అది రోగి జీవితానికి ప్రాణాంతకం కావచ్చు. ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీ ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.ప్రస్తుతం అన్ని దానాల్లో కెల్లా రక్తదానం గొప్ప దానంగా పరిగణించబడుతుంది. శరీరంలో తగినంత రక్తం …

Read More »

పొరపాటున కూడా ఈ 10 ఆహారాలను పచ్చిగా తినకండి.. ప్రమాదమే..!

కొన్ని పచ్చి ఆహారాలు శరీరానికి హానికరం. వీటిని పచ్చిగా తీసుకుంటే ప్రమాదమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటిలో బ్యాక్టీరియా, టాక్సిన్స్ ఉంటాయి. ఇవి శరీరానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనం వాటిని తీసుకునేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం.. పచ్చి లేదా పూర్తిగా ఉడకని గుడ్లు శరీరానికి హాని కలిగిస్తాయి. వాటిలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉండవచ్చు. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది. విరేచనాలు, వాంతులు, జ్వరం వంటి సమస్యలు ఉండవచ్చు. బటన్ పుట్టగొడుగుల వంటి కొన్ని పుట్టగొడుగులను పచ్చిగా …

Read More »

డబ్ల్యూటీసీ విజేతగా సౌతాఫ్రికా.. మార్క్రామ్ కీలక ఇన్సింగ్స్‌తో 27 ఏళ్ల కల సాకారం

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్‌లో ఆస్ట్రేలియా అందించిన 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సౌతాఫ్రికా, ఎట్టకేలకు ఐసీసీ ట్రోఫీల్లో బ్యాడ్ లక్ ముద్రను చెరిపేసుకుంది. ఈ విజయానికి హీరోగా ఐడెన్ మార్క్రామ్ (136) నిలిచాడు. సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా (66)తో కలిసి 147 పరుగుల కీలక భాగస్వామ్యంతో 27 ఏళ్లను సుగమం చేశాడు. దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. శనివారం సౌతాఫ్రికా జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించింది. దక్షిణాఫ్రికా జట్టు క్రికెట్ ఏ ఫార్మాట్‌లోనైనా మొదటిసారి …

Read More »

దూకుడుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్

తెలంగాణలో స్థిరాస్తి రంగం మళ్లీ ఊపందుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండున్నర నెలల్లో రాష్ట్రంలో స్థిరాస్తి లావాదేవీలతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గణనీయంగా పెరిగింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుతం 17.72 శాతం వృద్ధి నమోదైంది. దీనితో ఈ రంగం పుంజుకుంటోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతేడాది పోలిస్తే గణనీయమైన వృద్ధి 2023, 2024లో జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికల ప్రభావంతో స్థిరాస్తి రంగం కొంత మందగించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇళ్ల స్థలాలు, అపార్ట్‌మెంట్‌లు, ప్లాట్ల కొనుగోలు, …

Read More »

రోడ్డు ప్రమాదంలో నా తండ్రిని కోల్పోయా.. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు.. విమాన ప్రమాదంపై కమిటీ

విమాన ప్రమాదం, దర్యాప్తు పురోగతి వివరాలను కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు మీడియాకు వెల్లడించారు. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం అందరినీ షాక్‌కి గురి చేసిందని కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. టేకాఫ్‌ అయిన కొద్ది సెకన్లలో ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదానికి ముందు పైలట్‌ మేడే కాల్‌ చేశారని తెలిపారు.అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం 241 మంది ప్రాణాలను బలితీసుకుంది. అయితే.. ఈ విమాన ప్రమాదంపై విమానయాన శాఖ వివరణ ఇచ్చింది. విమాన ప్రమాదం, దర్యాప్తు పురోగతి వివరాలను కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు మీడియాకు …

Read More »

మరోసారి ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే?

ఆధార్ కార్డు వినియోగదారులకు యూఐడీఏఐ సంస్థ గుడ్‌ న్యూస్ చెప్పింది. ఉచితంగా ఆధార్ కార్డులో వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు ఇప్పటి వరకు ఉన్న గడువును మళ్లీ పొడిగించింది. అయితే ఇప్పటి వరకు ఉన్న గడువు నేటితో (జూన్ 14) ముగియనుండగా దానిని మరో సంవత్సరం పాటు పొడగిస్తూ యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2026 జూన్ 14వ వరకు అదార్ ఉచిత అప్‌డేట్‌ గడువును పొడిగిస్తున్నట్లు యూఐడీఏఐ సంస్థ తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా ప్రకటన జారీ చేసింది ఈ ప్రకటనకు సంబంధించిన …

Read More »

ఇదిగోండి వాన కబురు.. ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ వర్షసూచన

రాబోయే మూడు రోజులలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్.. రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు సూచనలు ఉన్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-50 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.ఉత్తర అంతర్గత కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం 5.8 కి.మీ ఎత్తులో నైరుతి దిశగా విస్తరించింది. పశ్చిమ మధ్య అరేబియా సముద్రం …

Read More »

రైతులకు రేవంత్ సర్కార్‌ గుడ్‌న్యూస్.. ఎన్నికలకు ముందే “రైతు భరోసా” నిధుల విడుదల!

తెలంగాణంలో రైతు భరోసా నిధులు చెల్లింపులకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. వానాకాలం సాగు ప్రారంభానికి ముందు రైతులకు పెట్టుబడి సాయంగా ‘రైతు భరోసా’ నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆర్థిక వనరుల సమీకరణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం, వచ్చే 10 నుంచి 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలన్న ఆలోచనలో ఉంది.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రభుత్వ పథకాలలో రైతు భరోసా కూడా ఒకటి. ఈ పథకాన్ని …

Read More »