పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపిస్తుండగా, పవన్ కళ్యాణ్ హిందీని వ్యతిరేకించేవారు తమ సినిమాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తారని ప్రశ్నించారు. డీఎంకే నేతలు కూడా స్పందిస్తూ హిందీని బలవంతం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మరోసారి ఈ అంశంపై ట్వీట్ చేశారు.హిందీ భాషా గురించి కొనసాగుతున్న వివాదం గురించి తెలిసిందే. తమపై హిందీని బలవంతంగా కేంద్రం రుద్దుతుందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది. అలాంటిదేం లేదని కేంద్ర …
Read More »Blog Layout
మీకు – నాకు మధ్య పరదాలు లేవు.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
తమది ప్రజా ప్రభుత్వమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జరుగుతున్న “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా తణుకులోని ఎన్టీఆర్ పార్క్ లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చంద్రబాు నాయుడు చెత్త ఊడ్చారు. అనంతరం కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలు, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడిన ఆయన.. ప్రజలు ఏమి చెప్పినా వినే ప్రభుత్వం తమదన్నారు. గత ప్రభుత్వంలో మాదిరి, మీకు నాకు మధ్య పరదాలు లేవంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ …
Read More »అది వ్యతిరేకించడం కాదు..! పవన్‌కు ఎవరైనా చెప్పండి ప్లీజ్..! జనసేనానికి ప్రకాశ్ రాజ్ కౌంటర్
జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. తమిళనాడులో హిందీ వ్యతిరేకతను ఆయన ప్రస్తావించగా, తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయకూడదని, అన్ని భాషలకు ప్రాధాన్యత ఉండాలని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు డీఎంకే నేతలు, ప్రకాష్ రాజ్ వంటి వారు కౌంటర్ ఇచ్చారు.జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దేశంలోని అన్ని భాషలు అవసరం అని, హిందీని వద్దంటున్న తమిళనాడు వాళ్లు వాళ్ల సినిమాలను …
Read More »డేంజర్ బెల్.. ప్రమాదకర స్థాయికి యూవీ ఇండెక్స్.. ఆ సమయాల్లో బయటకు రావొద్దు..
భానుడి భగభగలు చూసి మే నెల వచ్చిందా అని చూస్తే… క్యాలెండర్ ఇంకా మార్చి కూడా దాటలేదు. అప్పుడే భాస్కరుడు బెంబేలెత్తిస్తున్నాడు. బయటకొచ్చారా… మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు. ఇప్పుడే ఏమైంది.. UV రేస్‌తో ముందుంది మరింత మంట అంటున్నాడు. అసలీ UV కిరణాల కథేంటి..? తెలుగు రాష్ట్రాలపై వాటి ప్రభావం ఎలా ఉండబోతోంది…?వేసవి కాలం హడలెత్తిస్తోంది.. ఈసారి ఫిబ్రవరి నుంచే ఫుల్ ఫైర్ మీదున్నాడు భానుడు. ఉదయం తొమ్మిది గంటల నుంచే దంచికొడుతున్నాడు. సాయంత్రమైనా భూమి సెగలు.. పొగలు కక్కుతుందంటే …
Read More »జుట్టు బాగా రాలిపోతుందా..? కేశసౌందర్యం కోసం ఈ లడ్డు తప్పకుండా తినండి
దీనినే బయోటిన్, విటమిన్ B7 లేదా కొన్నిసార్లు విటమిన్ H అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో కరిగే విటమిన్, ఇది B-కాంప్లెక్స్ సమూహానికి చెందినది. కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల జీవక్రియతో సహా శరీరంలోని వివిధ జీవక్రియ ప్రక్రియలలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. చర్మం, జుట్టు, గోళ్ల ఆరోగ్యానికి బయోటిన్ అవసరం. అయితే, జుట్టు పెరుగుదల, శరీరంలో బయోటిన్ కొరతను తీర్చేందుకు ఈ లడ్డు తప్పకుండా తినండి.ప్రస్తుతం చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. నేటి ఆధునిక జీవనశైలి, ఆహారపు …
Read More »తెలంగాణలో డీలిమిటేషన్ సెగలు.. కాంగ్రెస్ వ్యూహంపై బీఆర్ఎస్, బీజేపీ రియాక్షన్ ఇదే..p
డీలిమిటేషన్ అంశం.. తమిళనాడులోనే కాదు.. తెలంగాణలోనూ సెగలు పుట్టిస్తుంది. అఖిలపక్షంలో చర్చిద్దామని.. కాంగ్రెస్ అంటుంది. తమిళ రాజకీయ ట్రాప్‌లో పడ్డారని.. కమలం పార్టీ కస్సుబుస్సులాడుతున్న వేళ.. అసలు అఖిలపక్షం జరిగేదెప్పుడు.. వెళ్లేది ఎవరు?. బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి..? డీలిమిటేషన్‌పై దక్షిణాది జంగ్ సైరన్ మోగిస్తున్న వేళ.. తెలంగాణకు కూడా ఈ సెగలు తాకాయి. డీలిమిటేషన్ పై అఖిలపక్షం నిర్వహిస్తామని అధికార కాంగ్రెస్ అంటుంది. 22న స్టాలిన్ భేటీ కంటే ముందే తెలంగాణలో అఖిలపక్ష భేటీ ఉంటుందన్నారు సీఎం రేవంత్. కానీ.. మీటింగ్ ఎప్పుడు ఉంటుందో …
Read More »NTR Trust Merit Scholarship Test 2025కు దరఖాస్తులు ఆహ్వానం.. మరో పది రోజుల్లోనే పరీక్ష!
యూపీఎసస్సీ యేటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షకు లక్షలాది మంది విద్యార్ధులు పోటీ పడుతుంటారు. నిరుపేద విద్యార్ధులు కోచింగ్ తీసుకునే స్థోమతలేని వారి కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అద్భుత అవకాశం అందిస్తోంది. అదేంటంటే.. ఈ ట్రస్ట్ అనుబంధ సంస్థ అయిన ఎక్సెల్ సివిల్స్ అకాడమీ.. యూపీఎస్సీ మెరిట్ స్కాలర్‌షిప్ 2025 పరీక్ష ద్వారా..ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనుబంధ సంస్థ అయిన ఎక్సెల్ సివిల్స్ అకాడమీ.. యూపీఎస్సీ మెరిట్ స్కాలర్‌షిప్ 2025 పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు ఎక్సెల్ సివిల్స్ అకాడమీ డైరెక్టర్ …
Read More »తెలంగాణకు మరో యునెస్కో గుర్తింపు..! నారాయణపేట ముడమాల్ నిలువురాళ్లకు ఆ జాబితాలో చోటు..
ప్రపంచ వారసత్వ ప్రదేశం ట్యాగ్ కోసం ప్రతిపాదనను ఇప్పటికే భారత పురావస్తు సర్వేకు పంపారు. ముడుమాల్ లో ఉన్న ఈ నిలువురాళ్లు ఆదిమ మానవుల ఖగోళ పరిజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశోధకులు చెబుతున్నారు. శిలాయుగంలోనే వాతావరణ మార్పులు, రుతువులు, కాలాలను గుర్తించడానికి ఆదిమ మానవులు ఏర్పాటు చేసుకున్నట్టు చారిత్రక పరిశోధకులు పేర్కొంటున్నారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని నారాయణపేటలోని ముడుమల్ గ్రామంలోని 3,000 సంవత్సరాల పురాతన మెగాలిథిక్ మెన్‌హిర్స్ స్థలాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం భారతదేశం నుండి తాత్కాలిక జాబితాలో చేర్చింది. భవిష్యత్తులో దేశాలు …
Read More »రాజధాని అమరావతికి 300 బస్సులు ఏర్పాటు చేసిన టీటీడీ! ఎందుకంటే..?
వెంకటపాలెంలో జరుగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవానికి 27,000 మంది భక్తులు హాజరు కానున్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు విస్తృత ఏర్పాట్లను వెల్లడించారు. 300 బస్సులను ఏర్పాటు చేశారు. పూల అలంకరణ, భక్తి సంగీత కార్యక్రమాలు, ప్రసాదాల పంపిణీతో కళ్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. విద్యుత్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.వెంకటపాలెంలో శనివారం సాయంత్రం జరుగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని 27,000 మంది భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు వెల్లడించారు. శుక్రవారం ఆలయం ముందు ఉన్న క్యాంపు కార్యాలయంలో టీటీడీ అధికారులు, జిల్లా అధికారులతో ఆయన …
Read More »ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్ బోర్డు
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే హాల్ టికెట్లు రావడంతో.. రంగుల పేపర్లపై వాటిని డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు వస్తున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించారు. ఇలా రంగుల పేపర్లతో పరీక్ష కేంద్రానికి తీసుకువచ్చే హాల్‌టికెట్లను అనుమతించబోమని తాజాగా ఇంటర్ బోర్డు హెచ్చిరించింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. పరీక్షలకు వారం ముందు విద్యార్ధుల మొబైల్ నంబర్లకు …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal