Blog Layout

PMO, పార్లమెంట్ హౌస్‌లో ఏర్పాటు చేయబోతున్న వేద గడియారం.. దీని ప్రత్యేకమేంటంటే

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఆధునిక వేద గడియారాలు తయారవుతున్నాయి. ఇవి హిందీ, ఇంగ్లీషులో మాత్రమే కాకుండా 189 భాషలలో సమయాన్ని తెలియజేస్తాయి. ప్రస్తుతం, విక్రమాదిత్య పరిశోధన కేంద్రంలో ఒక వేద గడియారం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యాప్ కూడా లాంచ్ కానుంది. ప్రారంభంలో, ఈ గడియారాన్ని ప్రధానమంత్రి కార్యాలయం, కొత్త పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేస్తారు.గత సంవత్సరం ఫిబ్రవరి 29న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విక్రమాదిత్య వేద గడియారాన్ని ప్రారంభించారు. విక్రమాదిత్య వేద గడియారం ప్రపంచంలోనే మొట్టమొదటి గడియారం. ఇది భారతీయ సమయ …

Read More »

జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు

ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సోదరుడు, జనసేన నేత నాగబాబు పేరు ఖరారైంది. ఆయన పేరును జనసేన అధినేత పవన్‌ ఫైనల్ చేశారు. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు త్వరలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.  ఏపీలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానానికి అభ్యర్థి ఖరారయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన సోదరుడు నాగబాబు పేరును జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు. ప్రస్తుతం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబుకు దక్కే పదవిపై కొంతకాలంగా అనేక …

Read More »

తీగలాగితే డొంక కదులుతోంది.. ఇకపై ఆటలు సాగవంటున్న సైబర్ పోలీసులు!

సైబర్ క్రైమ్.. ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే. టెక్నాలజీ పెరుగుతున్నట్లుగానే సైబర్ కేటుగాళ్లు సైతం అదే స్థాయిలో రెచ్చిపోతున్నారు. ఈ మోసాలకు చెక్‌ పెట్టేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు..తెలంగాణ పోలీసులు. దీంతో కలుగులో దాక్కున్న సైబర్‌ కేటుగాళ్లు..పట్టుబడుతున్నారు.సైబర్‌ కేటుగాళ్లపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు.. తెలంగాణ పోలీసులు. ఆన్‌లైన్‌ ఫ్రాడ్స్‌పై ఓవైపు ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే..మరోవైపు నేరాలకు పాల్పడుతున్నవారిని ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టిన పోలీసులు..గత రెండు నెలల వ్యవధిలో 161 మంది సైబర్ నేరగాళ్లను …

Read More »

ఎమ్మెల్యేకు తప్పని న్యూడ్ కాల్ బెదిరింపులు.. సైబర్ నేరగాళ్లతో వీరేశం పరేషాన్!

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథా ఎంచుకుంటున్నారు. కొంగొత్త మార్గాల్లో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో రకాల మోసాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సైబర్ నేరగాళ్ల అమాయకులనే కాదు ప్రజా ప్రతినిధులను కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యేపై అశ్లీల వీడియో కాల్స్‌తో సైబర్ నేరగాళ్లు ఎటాక్ చేశారు. నల్లగొండ జిల్లా నక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సెల్‌ఫోన్‌లోకి చొరబడి సైబర్ ఎటాక్ చేశారు. ఎమ్మెల్యే వేముల వీరేశం సోషల్ మీడియా అకౌంట్‌లో నుండి ఫోటోలను సేకరించిన సైబర్ క్రిమినల్స్.. …

Read More »

నిరుద్యోగులకు శుభవార్త.. ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు వయోపరిమితి పెంచిన కూటమి సర్కార్!

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) సహా ఇతర నియామక సంస్థల ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ యూనిఫామ్ పోస్టులకు గరిష్ట వయోపరిమితిని రెండు సంవత్సరాలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇది ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమలు అవుతుందని స్పష్టం చేసింది. APPSC, ఇతర నియామక సంస్థల ద్వారా రాబోయే నియామకాల్లోని అన్ని సర్వీసులలోని..రాష్ట్ర నిరుద్యోగులకు కూటమి సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆయా కేటగిరీలో నిరుద్యోగుల వయోపరిమితిని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రస్తుతం ఉన్న …

Read More »

ఫిర్యాదులు, కేసులతో పోసాని ఉక్కిరిబిక్కిరి

రిమాండ్ ఖైదీ అంటే 14రోజుల పాటు జైల్లో ఉంటారు. కానీ విచిత్రంగా నటుడు పోసాని కృష్ణమురళి మాత్రం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. పైగా పోసాని.. ముందు మాకే కావాలంటూ పోలీసులు క్యూ కడుతున్న పరిస్థితి. ఇంతకీ ఆయన ఎందుకు వాంటెడ్‌గా మారారు?ఓ వైపు ఫిర్యాదులు… ఇంకోవైపు కేసులు.. పోసాని కృష్ణమురళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి రోజుకో జైలు అన్నట్టుగా మారిపోయింది. అనుచిత వ్యాఖ్యల కేసులో నరసరావుపేట పీఎస్‌లో నమోదైన కేసులో పోసాని గుంటూరు జైల్లో ఉన్నారు. అయితే కర్నూలు జిల్లా …

Read More »

ఏపీ అసెంబ్లీలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కీలక రూలింగ్‌

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదా అంశంపై కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి హైకోర్టుకు కూడా వెళ్లారని స్పీకర్ తెలిపారు. ఇందులో సభాపతిని, శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చారని పేర్కొన్నారు. లోక్‌సభలో టీడీపీ నేత ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారనేది అవాస్తమన్నారు. తప్పుడు ప్రచారానికి తెరదించేందుకు రూలింగ్ ఇస్తున్నట్లు చెప్పారు.ఏపీ అసెంబ్లీలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కీలక రూలింగ్‌ ఇచ్చారు. బెదిరింపులు, అభియోగాలతో జగన్‌ తనకు లేఖ రాశారన్నారు.‌  ప్రతిపక్ష …

Read More »

కాళేశ్వరం కడితే మేం అభ్యంతరం తెలిపామా..? తెలంగాణ ఫిర్యాదుపై స్పందించిన సీఎం చంద్రబాబు

తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. కృష్ణానది, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుందంటూ తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు తాము అభ్యంతరం తెలిపలేదని.. వృధా నీటిని ఉపయోగించుకుంటున్నామని వివరించారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య జల వివాదం తారాస్థాయికి చేరింది.. కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతోందంటూ తెలంగాణ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును చేపట్టడంపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి …

Read More »

నాగబాబు కోసం పవన్ కల్యాణ్ సరికొత్త గేమ్ ఫ్లాన్.. మంత్రి పదవికి బదులు ఎంపీ పదవి..!

రాజ్యసభ వచ్చేలోపు కేబినెట్ హోదా ఉండే కార్పొరేషన్ పదవిని నాగబాబుకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రం మొత్తం తిరుగుతూ, పర్యావరణానికి అనుకూలంగా ఉండే పదవిని నాగబాబుకు ఇవ్వమని ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ కళ్యాణ్ కోరినట్టు సమాచారం. త్వరలో ఈ విషయంలో స్పష్టత రానుంది.మెగా బ్రదర్ నాగబాబుకు ముఖ్యమైన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరిక మేరకు ఆయన్ను ఎమ్మెల్సీని చేసి కేబినెట్‌లోకి తీసుకోవాలని భావించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల్లో ఒక స్థానం …

Read More »

ఇదే అభివృద్ధి బడ్జెట్ అంటోన్న కూటమి ప్రభుత్వం.. వైసీపీ రియాక్షన్ ఏంటంటే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేస్తూ 3.22లక్షల కోట్లతో అద్భుత బడ్జెట్ ప్రవేశపెట్టామంది కూటమి ప్రభుత్వం. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశామంది. అయితే బడ్జెట్‌పై వైసీపీ విమర్శలు గుప్పించింది. ఆత్మస్తుతి, పరనింద తప్ప బడ్జెట్‌ అంతగొప్పగా లేదంటూ సెటైర్లు వేసింది. దీంతో ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి..ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశ పెట్టారు. రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. …

Read More »