Blog Layout

 చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి.. ప్రభుత్వం ఏం చేస్తోందన్న కేటీఆర్‌

చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఘటనలో 22 మందిపై కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు..17 మంది నిందితులను గుర్తించారు. ప్రధాన నిందితుడు రాఘవరెడ్డిని ఇప్పటికే రిమాండ్‌కు తరలించిన పోలీసులు. పరారీలో ఉన్న నిందితుల కోసం నాలుగు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు..రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌పై దాడి ఘటన కలకలం రేపుతోంది. రామరాజ్యం అనే ర్యాడికల్ సంస్థకు చెందిన 20 మంది దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు. రామరాజ్య …

Read More »

డైరెక్టర్ ఆర్జీవీకి మరో తలనొప్పి.. ఈసారి రంగంలోకి సీఐడీ.. విచారణకు హాజరయ్యేనా…

2019లో రామ్‌గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో ఓ సినిమా తీశారు. ఆ మూవీపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేయడంతో ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనే పేరుతో సినిమాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను యూట్యూబ్‌లో మాత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరిట విడుదల చేశారని గుంటూరు జిల్లాకు మంగళగిరి సమీపంలోని ఆత్మకూర్‌కు చెందిన వంశీకృష్ణ బండారు సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.తన వ్యాఖ్యలతో ఎప్పుడు సంచలనం సృష్టించే సినీ దర్శకుడు రామ్ గోపాల్ …

Read More »

తెలంగాణలో తొలి జీబీఎస్‌ మరణం.. సిద్దిపేట జిల్లాకు చెందిన 25 ఏళ్ల వివాహిత మృతి

ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు జీబీఎస్‌. ఇది ఒక నరాల వ్యాధి. ఈ వ్యాధిని మొదటగా మహారాష్ట్రలో గుర్తించారు. ఈ వ్యాధితో తెలంగాణలో తొలి మరణం నమోదు అయింది. కరోనాలా ఇది అంటువ్యాధి కాదు. ఆందోళన చెందాల్సిన పనిలేదు కానీ అప్రమత్తంగా వుండాలి. డాక్టర్లు చెప్పినట్టుగా వైరస్‌ లక్షణాలు కన్పిస్తే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలి.తెలంగాణలో తొలి జీబీఎస్‌ మరణం నమోదు అయింది. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన 25 ఏళ్ల మహిళ..ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. ఆమెకు ఐదేళ్లలోపు ఇద్దరు కుమారులు …

Read More »

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంలో నేడు విచారణ

పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ దూకుడుగా ముందుకెళ్తోంది. వారిపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో… అసెంబ్లీ కార్యదర్శి 10 మంది ఎమ్మెల్యేలకు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. కాగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంలో నేడు విచారణ జరగనుంది.బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ(సోమవారం) విచారణ జరగనుంది. పోచారం శ్రీనివా‌స్‌రెడ్డి, ఎం.సంజయ్‌ …

Read More »

జనసేన నేత కిరణ్ రాయల్‌పై ఆరోపణల నేపథ్యంలో… పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు…

జనసేన తిరుపతి ఇన్‌ఛార్జ్‌ కిరణ్ రాయల్ ఎపిసోడ్‌ ఇప్పుడు పార్టీలో చర్చనీయ అంశంగా మారింది. ప్రస్తుతానికి కిరణ్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అధిష్టానం ఆదేశించింది. మరోవైపు ఆయన తిరుపతి అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన ఫోన్ డేటాను తస్కరించి తనపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.తనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి తిరుపతి అడిషనల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు జనసేన నేత కిరణ్ రాయల్. వైసీపీ నేతలు ఆడవారిని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల …

Read More »

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. నలుగురు అరెస్ట్..?

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ సిట్ నలుగురు నెయ్యి సరఫరాదారులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సిట్ అదుపులో ఉన్న వీరిని సోమవారం కోర్టులో హాజరుపరిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. AR డయిరీ ఏండీ రాజశేఖరన్‌తో పాటు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన డయిరీ నిర్వాహకులను సిట్ అదుపులోకి ఉన్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కల్తీ నెయ్యి కేసులో నలుగురు …

Read More »

ఢిల్లీలో బీజేపీ విజయం చరిత్రాత్మకం.. ప్రతిపక్షహోదా కావాలంటే 10శాతం సీట్లు దక్కాల్సిందే

ఢిల్లీలో బీజేపీ గెలుపు చరిత్రాత్మకమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దేశ ప్రజలందరూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆమోదించారని.. తాజాగా ఢిల్లీ ప్రజలు కూడా మోదీ నాయకత్వాన్ని బలపరిచారని చెప్పారు. ప్యాలెస్‌ల విషయంలోనూ ఏపీ, ఢిల్లీకి పోలికలు ఉన్నాయని.. రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నా.. ఢిల్లీలో శీష్ మహల్‌ కట్టుకున్నా.. వాటిలోకి అడుగుపెట్టలేకపోయారన్నారు.కొందరు నాయకుల సంక్షేమం ముసుగులో రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు ఏపీ సీఎం చంద్రబాబు… ఏపీ, ఢిల్లీకి ఈ అంశంలో పలు పోలికలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బీజేపీ విజయం …

Read More »

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 82% బాధితులు మైనర్లే.. బడుగు వర్గాలకు రక్షణేది?

బడుగు బలహీన వర్గాల క్షేమం కోసం ఎన్నో చట్టాలను మనదేశంలో తీసుకుని వచ్చారు. ఎస్సీ, ఎస్టీల కోసం 1989వ సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టంలో కులం పేరుతో దూషించిన ఏదైనా కారణాలతో వీరిపై అఘాయిత్యాలకు పాల్పడిన కఠినమైనటువంటి శిక్షలతో పాటుగా ఆ కేసు తీవ్రతను బట్టి జీవిత ఖైదీ కూడా అమలయ్యేలా ఈ చట్టంలో ఉంది. అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. 2023 లో 1877 కేసులు నమోదు …

Read More »

మెడికల్ కాలేజీలపై యూజీసీ కన్నెర్ర.. ఏకంగా 18 కాలేజీలకు షోకాజ్‌ నోటీసులు జారీ

నిబంధనలు పాటించని మెడికల్‌ కాలేజీలపై యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) కన్నెర్ర చేసింది. తెలుగు రాష్ట్రాలతో సహా దాదాపు 18 మెడికల్‌ కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ జాబితాలో ఆంధ్రపదేశ్‌లో మూడు మెడికల్ కాలేజీలు ఉండగా.. తెలంగాణ నుంచి ఎంతో చారిత్రక రికార్డు ఉన్న ఉస్మానియా మెడికల్‌ కాలేజీ ఉండటం గమనార్హం..యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) పలు వైద్యా కాలేజీలపై కన్నెర్ర చేసింది. ర్యాగింగ్‌ నిరోధక చర్యలు పాటించని దాదాపు 18 మెడికల్‌ కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ …

Read More »

పదో తరగరతి ప్రశ్నపత్రాలపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రణ.. లీకులకు కళ్లెం పడేనా?

రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. మరో వైపు అధికారులు కూడా పరీక్షల నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈసారి పదో తరగతి పశ్నాపత్రాలు లీకేజీలకు తావులేకుండా పకడ్భందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం తొలిసారి ప్రశ్నాపత్రాలపై విద్యాశాఖ క్యూఆర్‌ కోడ్‌ ముద్రించనుంది..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మర్చి 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో విద్యార్ధులు ముమ్మరంగా …

Read More »