ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సారి డిఫరెంట్‌గా ఫుల్ ఖుషీగా.. నవ్వుతూ.. హుషారుగా.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వివిధ అంశాలపై ప్రసంగించిన చంద్రబాబు.. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీపై కన్నెర్ర చేశారు. జగన్ టార్గెట్‌గా పలు ఇంట్రిస్టింగ్ కామెంట్స్, వార్నింగ్‌లు ఇచ్చారు. ప్రధానంగా.. వైసీపీ ప్రతిపక్ష హోదా అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా ఎప్పుడిస్తారో.. ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసుకోవాలని మాజీ సీఎం జగన్‌కు సూచించారు. …
Read More »Blog Layout
నిరుద్యోగులకు అలర్ట్.. ఎస్సెస్సీ సీజీఎల్ రాత పరీక్షల కొత్త తేదీలు వచ్చేశాయ్! పూర్తి షెడ్యూల్ ఇదే
వివిధ ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద 14,582 గ్రూప్ B, గ్రూప్ C పోస్టులను భర్తీ చేయనుంది. అయితే తాజాగా టైర్ 1 రాత పరీక్షకు.. దేశంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ …
Read More »ఏటి ఇది.. అసలు ఏటిది.. పొద్దున్నే లేచి చూసేసరికి ఇంటి ముంగిట..
విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలో వరుసగా జరుగుతున్న చేతబడి ఘటనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల రంగరాయపురం, జమ్మాదేవిపేట గ్రామాల్లో చోటుచేసుకున్న సంఘటనలు స్థానికులను కలవరపెడుతున్నాయి. రంగరాయపురంలో ఓ ఇంటి ముందు భయానక దృశ్యం కనిపించింది. ఇంటి ముందు ముగ్గులు వేసి, మనిషి ఆకారంలో ఉన్న బొమ్మను తయారు చేసి, మధ్యలో నిమ్మకాయలు ఉంచి వాటిపై పసుపు, కుంకుమ రాసి భయానక పూజలు జరిగి కనిపించాయి. ఈ దృశ్యం చూసిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ పని ఎవరు చేశారు అన్న అనుమానాలు …
Read More »తిరుమల నడకదారిలో ఇనుప కంచె ఏర్పాటు చేయండి.. హైకోర్టు సంచలన ఆదేశాలు
అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే నడక దారిలో శ్రీవారి భక్తులను వన్యమృగాల దాడుల నుంచి కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-WII, అటవీ శాఖ, TTD అధికారుల సంయుక్త కమిటీ చేసిన సిఫార్సులను నవంబరులోగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని TTD ఈవోకి హైకోర్టు స్పష్టం చేసింది. సిఫార్సులను ఏ మేరకు అమలు చేశారో తేల్చే బాధ్యతను సంయుక్త కమిటీకి అప్పగిస్తామని చెప్పింది. మరోవైపు చిరుత దాడిలో మరణించిన చిన్నారి తల్లిదండ్రులకు మరో 15 …
Read More »రానున్న 24 గంటల్లో కుండపోత వాన.. ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఒడిశా వైపు కదులుతుందని పేర్కొంది. బికనేర్ నుంచి అల్పపీడనం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో.. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఒడిశా వైపు కదులుతుందని పేర్కొంది. బికనేర్ నుంచి అల్పపీడనం వరకు రుతుపవన …
Read More »ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. కేరళ, రాజస్థాన్, చార్ ధామ్, అండమాన్ వెళ్లేందుకు స్పెషల్ టూర్ ప్యాకేజీ.. వివరాల్లోకి వెళ్తే.
దసరా సెలవుల నేపధ్యంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం నుంచి కేరళ, రాజస్థాన్, చార్ ధామ్, అండమాన్ అండ్ నికోబార్ దీవులకు విమాన ప్యాకేజీ పర్యటనలను ప్రకటించింది. ఈ విషయంపై గురువారం IRCTC/BBS జాయింట్ జనరల్ మేనేజర్ క్రాంతి పి. సావర్కర్ మాట్లాడుతూ.. టూర్ ప్యాకేజీ గురించి అనేక విషయాలు చెప్పారు. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ఇచ్చే సదుపాయాలను.. సేవలను తెలిపారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎకానమీ-క్లాస్ విమాన టిక్కెట్లు, …
Read More »మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మాస్ రియాక్షన్..
ఎవరో వెనక నేనెందుకు ఉంటాను.. నేను ఎవరి వెనుక ఉండను.. ఉంటే ముందే ఉంటాను.. ప్రజలు తిరస్కరించిన వాళ్ల వెనుక నేనెందుకు ఉంటాను.. నాకు అంత సమయంలేదు.. మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. అంటూ కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. గతంలో వేరేవాళ్లను ఎదగనీయనివాళ్లు.. ఇప్పుడు పంచాయితీలు పెట్టుకుంటున్నారు.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటారు.. ఒకరిపై ఒకరు యాసిడ్ దాడులు చేసుకుంటున్నారు.. బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ.. అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గొప్ప …
Read More »ఆర్‌ఆర్‌బీ రైల్వే టీచర్ ఉద్యోగాలు.. మరో వారంలోనే రాత పరీక్షలు షురూ!
వివిధ రైల్వే రీజియన్లలో మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీస్ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ రాత పరీక్షలు త్వరలోనే జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల.. దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీస్ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ రాత పరీక్షలు త్వరలోనే జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి సిటీ …
Read More »టీటీడీకి ఎలక్ట్రిక్ బస్సు విరాళం.. ధర ఎంతో తెలుసా?
ఆపదమొక్కుల వాడు, కోరిన కోరికలు తీర్చే వెంకన్న స్వామికి భక్తులు నిత్యం విరాళాలు అందజేస్తూ ఉంటారు. కొందరు బంగారు నగలు విరాళంగా సమర్పించుకుంటే మరికొందరు డబ్బును విరాళంగా ఇస్తుంటారు. తాజాగా చెన్నైకి చెందిన స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సీఈవో గణేష్ మణి, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వెంకటరమణ్ తిరుమల తిరుపతి దేవస్తానానికి ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా ఇచ్చారు. బుధవారం కంపెనీ పతినిధులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సీఈవో గణేష్. అనంతరం రూ.1.33 కోట్ల విలువైన విద్యుత్ బస్సును …
Read More »మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్
గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌లో 2 రోజులు మద్యం షాపులు, బార్లు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. భక్తుల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టార్ హోటల్స్, లైసెన్స్డ్ క్లబ్‌లకు మాత్రం మినహాయింపు ఉంది. నగరంతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా ఆంక్షలు అమలవుతున్నాయి. గణేశ్ నిమజ్జనాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 6 గంటల …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal