Blog Layout

హమ్మయ్య.. ఒక్క రోజే రెండు విమానాల్లో సాంకేతిక లోపం.. సేఫ్ ల్యాండింగ్

సోమవారం ఒక్కరోజే రెండు విమానాల్లో సాంకేతిక సమస్య ఏర్పడగా.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించారు. రెండు ఘటనల్లోనూ ప్రయాణీకులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి షిల్లాంగ్ బయలుదేరిన ఓ ప్రైవేటు విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. గగనతలంలో స్పైస్ జెట్ విమానం ఓ పక్షిని ఢీకొంది. దీంతో విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో పట్నా‌లోని జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని ఉదయం 8.52 గంటంలకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించారు. విమానంలోని ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారు. ప్రయాణీకులను షిల్లాంగ్‌కు పంపేందుకు …

Read More »

ఆంధ్రాలోని ఈ ప్రాంతాలకు ఉరుములతో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న భూమధ్య రేఖ ప్రాంతం, హిందూ మహాసముద్రం మీద ఉన్న అల్పపీడన ప్రాంతం, దాని అనుబంధ ఉవపరితల ఆవర్తనం సగటు సముద్రానికి 5.8 కిమీల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతున్నది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, వచ్చే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణం కొనసాగించి, ఆ తర్వాత డిసెంబర్ 11వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతం వద్ద ఉన్న శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరుతుంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ …

Read More »

ఏపీ రాజధాని పక్కనే బ్రహ్మ కైలాసం.! పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి..

పచ్చటి ప్రకృతి రమణీయతకు దగ్గరగా కైలాసాన్ని తలపించే ఈ క్షేత్రం.. బ్రహ్మకైలాసంగా ప్రసిద్ది చెందింది. బ్రహ్మలింగేశ్వరుడు కొలువైన శివలింగాలపురం కొండ చుట్టూ ఒక గుండ్రటి ఆకారంలో చుట్టూ కొండలు ఉన్నాయి. ఈ కొండ పైనుంచి ఎటు చూసినా వలయాకారంలో కొండలే కనిపిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఏదో ఒక కొత్త లోకంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరో విధంగా చెప్పాలంటే…మనం భూమి మీద కాకుండా మరో గ్రహంలో ఉన్నామా..? అన్న భ్రమలోకి వెళతాము. అందుకే దీన్ని బ్రహ్మ కైలాసంగా భావిస్తారు. ఎంతో ఘనమైన చారిత్రక నేపథ్యం ఉన్న …

Read More »

బెయిల్‌పై బయట ఉన్న జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఇక శాశ్వతంగా..

లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అభియోగాలు ఎదుర్కొంటున్నారు టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఇదే కేసులో జైలుకు వెళ్లి వచ్చారు జానీ. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న ఈ స్టార్ కొరియోగ్రాఫర్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది.గత కొన్ని రోజులుగా అటు పర్సనల్ లైఫ్ లోనూ, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లోనూ బాగా స్ట్రగుల్ అవుతున్నాడు స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. తన దగ్గర పనిచేసిన ఓ లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు జానీపై …

Read More »

రాజ్యసభ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ.. ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్య

ఇట్స్‌ అఫీషియల్‌. బీజేపీ నుంచి రాజ్యసభకు ఆర్‌.కృష్ణయ్య నామినేషన్‌ దాఖలు చేయబోతున్నారు. ఆయన పేరును బీజేపీ హైకమాండ్‌ ఖరారు చేసింది. ఆర్‌.కృష్ణయ్య అమరావతిలో రేపు నామినేషన్‌ దాఖలు చేస్తారు.మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్ధులను ప్రకటించింది. ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్య, హరియానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ పేర్లను ఖరారు చేసింది. బీసీ ఉద్యమ నేత కృష్ణయ్య ఇటీవల వైసీపీకి, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ ఆయనకు మరోసారి అవకాశం కల్పించింది. ఇక రాజ్యసభ …

Read More »

ఏం మనుషులురా బాబు.. దేవుడు కూడా భరించలేని బాధ.. కన్నీళ్లు పెట్టుకున్న ఆంజనేయస్వామి శిలా విగ్రహం!

స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతీ మందిర్‌లో రికార్డ్ చేయబడిందని సమాచారం. వీడియో వైరల్ కావడంతో ఈ అద్భుతాన్ని చూడటానికి భక్తులు పోటెత్తారు. ఈ వీడియో నిజమా లేదా నకిలీదా అని తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రజలలో తారాస్థాయికి చేరుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఈ ఆలయానికి చేరుకుని ఘటనను పరిశీలించారు.సోషల్ మీడియాలో ప్రతి నిత్యం అనేక వీడియో వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియోలు చాలా వరకు ప్రజల్ని ఆశ్చర్యపరిచేవిగా ఉంటాయి. వాటిలో కొన్ని మనల్ని షాక్‌కు గురిచేసేవిగా కూడా ఉంటాయి. ఇప్పుడు అలాంటి …

Read More »

IRCTC వెబ్‌సైట్‌ సేవలకు అంతరాయం.. రైల్వే ప్రయాణీకుల అవస్థలు

IRCTC ఆన్‌లైన్ ఈ-టికెట్ బుకింగ్ సేవలకు సోమవారం ఉదయం తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటకు పైగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐఆర్‌సీటీసీకి చెందిన వెబ్‌సైట్‌తో పాటు యాప్‌లో రైల్వే టిక్కెట్ల బుకింగ్ కుదరలేదు. టిక్కెట్ల క్యాన్సలేషన్ కూడా సాధ్యంకాలేదు. తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలోనే IRCTC వెబ్‌సైట్ నిలిచిపోయింది. దీంతో తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తున్న లక్షలాది మంది ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురైయ్యారు. వెబ్‌సైట్‌లో మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయని, అందువల్ల మరో 1 గంట వరకు …

Read More »

స్మశానం పక్కన ఆ కారులో వేగంగా వింత శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా

తాడేపల్లి స్మశాన వాటిక వద్ద సగం కాలిన కారు పార్క్ చేసి ఉంది. దానిపై గ్రీన్ మ్యాట్ కూడా కప్పి ఉంది. అయితే అప్పటి నుంచి ఆ కారు నుంచి వింత శబ్దాలు వస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. స్మశానవాటిక పక్కనే నివసించడం వారికి అలవాటు. స్మశానం పక్కనే ఉన్నా.. ఎప్పుడూ ఇంత ఆందోళనకు గురి కాలేదు. అయితే ఇప్పుడెందుకనుకుంటున్నారా..! సగం కాలిన కారును గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ వదిలిపెట్టి పోయినట్లు ప్రచారం జరిగింది. అదే సమయంలో వింత శబ్దాలు వచ్చినట్లు గుర్తించారు. దీంతో …

Read More »

క్యాన్సర్‌ని కూడా ఖతం చేసే శక్తివంతమైన పండు..! ప్రతిరోజు తింటే ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతం..

స‌పోటా పండు ఇష్టపడని వారంటూ ఉండరనే చెప్పాలి. భిన్నమైన తీపి రుచితో ఉండే ఈ పండులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు నిండివున్నాయి. ముఖ్యంగా ఐరన్‌, కాపర్‌, పొటాషియం, ఫైబర్‌ ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సపోటా మన దేశం పండు కాదని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇది స్పెయిన్‌కు చెందినది. ఈ చెట్లు మధ్య అమెరికాలో పుష్కలంగా కనిపిస్తాయి. స్పెయిన్ నుండి నావికులు ఈ పండు విత్తనాలను భారతదేశానికి తీసుకువచ్చి ఇక్కడ పెంచడం ప్రారంభించారని సమాచారం. చలికాలంలో సపోటా లాభాలు …

Read More »

తులసి ఆకులు తింటే ఈ రోగాలన్నీ మాయం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇలా చేస్తే..

మన ప్రకృతిలో ఉన్న అనేక మొక్కలు, వృక్షాలలో ఎన్నో ఔషధ గుణాలు నిండివున్నాయి. అందులో అతి ముఖ్యమైనది అత్యంత పవిత్రమైనది తులసి మొక్క. మన పూర్వీకుల కాలం నుంచి తులసిని అత్యంత పవిత్రమైనదిగా కొలుస్తూ వస్తున్నారు. పురాణాలలో కూడా తులసి మొక్కను విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. ఇలాంటి తులసిని నేడు ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తులసిలోని ఔషధ గుణాలు ఆరోగ్యంతోపాటు సౌందర్య పోషణలో కూడా మేలు చేస్తాయి. తులసిలోని కొమ్మలు, ఆకులు, విత్తనాలు, కాడలు, వేర్లు, వేర్ల దగ్గరి మట్టి కూడా …

Read More »