Blog Layout

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తర్వాతే ఈఏపీ సెట్‌ 2025 పరీక్ష.. వెనక్కి తగ్గిన ఉన్నత విద్యామండలి?

తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్‌ 2025) పరీక్షను ఈసారి కాస్త ముందుగానే జరపాలని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే ఈఏపీ సెట్‌ 2025 నిర్వహించనున్నట్లు గతంలో తెల్పింది కూడా. కానీ ఈ ఆలోచన కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు. ఈఏపీ సెట్‌ను ముందుకు జరపటం అసాధ్యమని పరీక్ష నిర్వహణ కన్సల్టెన్సీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)కి తెల్పినట్లు సమాచారం. ఏప్రిల్‌ నెలలో జరగనున్న …

Read More »

ములుగు జిల్లాలో ఎస్సై రుద్రారపు హరీష్‌ ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌

ములుగు జిల్లాలో ఎస్సై రుద్రారపు హరీష్‌ ఆత్మహత్యలో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. హరీష్ ఆత్మహత్య ఘటనలో యువతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  ఏడు నెలల కిందట హరీష్‌కు ఓ యువతి అనుకోకుండా ఫోన్ చేయగా, మాటామాటా కలిసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు. హైదరాబాద్లో చదువుకునే ఆమె వారంలో రెండు రోజులు వాజేడుకు వచ్చి ఉండి వెళ్లేది.. కొంతకాలానికి యువతి బ్యాగ్రౌండ్ వెరిఫై చేయగా.. తను వేరే వాళ్లతో చనవుగా ఉన్నట్లు హరీష్ గుర్తించాడు. దీంతో తన ప్రవర్తన నచ్చక దూరంపెట్టాడు ఎస్సై. ఆపై …

Read More »

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌.. అదుపులోకి తీసుకున్న బంజారా హిల్స్ పోలీసులు

తమ ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడానికి బుధవారం(డిసెంబర్ 4) బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు కౌశిక్‌ వెళ్లారు. అయితే, తనకు పని ఉందంటూ ఇన్‌స్పెక్టర్ వెళ్లిపోయారు. తన ఫిర్యాదు తీసుకోవాలని ఇన్‌స్పెక్టర్ వెంటపడ్డారు MLA కౌశిక్ రెడ్డి. పైగా ఇన్‌స్పెక్టర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో విధులకు ఆటంకం కలిగించారంటూ ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు బంజారాహిల్స్ పోలీసులు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కొండాపూర్‌లోని ఆయన నివాసం …

Read More »

ఒరేయ్ మీరు విద్యార్థులా.. ఉన్మాదులా..? టీచర్‌ను క్లాస్ రూమ్‌లోనే..

.జీవితంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా.. వారి ఎదుగుదలలో గురువుల పాత్ర ఎనలేనిది.. విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో గురువులు విద్యార్థులను జ్ఞాన మార్గం వైపు నడిపిస్తారు. శిక్షణతో మెరుగులద్ది ఉన్నత స్థాయికి చేర్చిన మహోన్నతమైన వ్యక్తులుగా ఉపాధ్యాయులు చిరస్థాయిగా నిలుస్తారు.. అందుకే.. గురువులు, శిష్యుల మధ్య బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు.. అయితే.. ఒకప్పుడు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడానికి వస్తున్నారంటే అంటే పిల్లలు మౌనంగా కూర్చొని ఉండిపోయేవారు.. పిన్ డ్రాప్ సైలెన్స్‌గా ఉండేవారు.. చీమ చిటుక్కుమన్న …

Read More »

వార్నీ ఎంతకు తెగించార్రా సామీ..! దాని కోసం ఏకంగా పిల్లాడినే ఎత్తుకెళ్లారు..!

గంజాయి కోసం ఏకంగా ఓ బాలుడిని కిడ్నాప్‌ చేశారు నిందితులు. కానీ పోలీసుల ఎంట్రీతో సీన్‌ రివర్స్‌ అయింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ కేసు.అది సుందర అరకులోనే ప్రాంతం.. అక్కడకు పలనాడు నుంచి ఓ వ్యక్తి వచ్చాడు.. వస్తు పోతూ ఉన్న సమయంలో స్థానిక యువకులతో పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత అతని స్నేహితులను తీసుకొచ్చి వారిని పరిచయం చేయించాడు. ఇక గంజాయి కోసం బేరసారాలు జరిగాయి. కొంత నగదు కూడా చేతులు మారింది. కట్ చేస్తే ఓ బాలుడిని కిడ్నాప్ చేసి.. …

Read More »

ఆ విద్యార్ధులకు సంక్రాంతి సెలవులు 3 రోజులే.. విద్యాశాఖ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. టెన్త్‌ పరీక్షలు మార్చి 15 నుంచి ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో పదో తరగతి విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు 100 రోజుల ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) సిలబస్‌ అమల్లోకి వచ్చాక తొలిసారి పదో తరగతి పరీక్షలు విద్యార్ధులు రాయనున్నారు. విద్యార్ధులను సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను …

Read More »

ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు.. ఏడాది ఏడాదికి పెరిగే నంది.. కలియుగాంతానికి చిహ్నం..

భారతదేశంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలలో కొన్ని సంఘటనలు నమ్మలేని నిజాలుగా సైన్ కు సవాల్ గా మిగిలిపోతున్నాయి. అనేక ఆలయాలు వాటి రహస్యాలు, అద్భుత మైన శిల్పకళా సంపదతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అలా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మిస్టరీ శివాలయం ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ ఆలయంలోని నందీశ్వరుడు విగ్రహం నిరంతరం పెరుగుతూనే ఉంటుదని. ఈ విగ్రహం పరిమాణం పెరగడంలోని రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేకపోయారు. అంతే కాదు ఈ విగ్రహం పరిమాణం పెరగడంపై …

Read More »

భూకంపాల విషయంలో తెలుగురాష్ట్రాలు సేఫేనా..? మరింత పెరిగిన భయాలు

తెలంగాణకు భూకంపాల భయాలేం లేవు.. మనది దక్కన్‌ పీఠభూమి.. సముద్రానికి ఎత్తులో ఉంటుంది.. నిర్భయంగా ఉండొచ్చని చెబుతుంటారు కొందరు. ఎవరు చెప్పారసలు తెలంగాణ భూకంపాల జోన్‌లో లేదని? దేశవ్యాప్తంగా భూకంపాలు వచ్చే ఛాన్స్‌ ఉందంటూ వాటిని నాలుగు జోన్లుగా విభజించారు. కావాలంటే ఆ లిస్ట్‌ ఒక్కసారి చెక్‌ చేసుకోవచ్చు. అందులో తెలంగాణలోని ఏరియాలు కూడా ఉంటాయి. మెయిన్‌గా హైదరాబాద్‌ ఉంటుంది. సో, హైదరాబాద్‌కు కూడా భూకంపం ముప్పు ఉంది. ఒక్క తెలంగాణ గురించే ఎందుకు చెప్పుకోవాలి? విజయవాడ, మచిలీపట్నం, నెల్లూరు, కర్నూలు.. ఇవన్నీ భూకంపాల …

Read More »

నిరుద్యోగులకు అలర్ట్‌.. సీఏపీఎఫ్‌ బలగాల్లో లక్షకుపైగా ఉద్యోగాలు: కేంద్రం వెల్లడి

కేంద్ర సాయుధ బలగాలు (CAPF), అస్సాం రైఫిల్స్‌ (AR)లో లక్షకు పైనే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. గత ఐదేళ్లలో దాదాపు 71,231 పోస్టులు భర్తీ చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో బుధవారం వెల్లడించారు. ఖాళీగా ఉన్న సీఏపీఎఫ్‌, ఏఆర్‌ ఉద్యోగాల్లో చాలా వరకు పదవీ విరమణ, రాజీనామాలు, పదోన్నతులు, మరణాలు, కొత్త బెటాలియన్‌ ఏర్పాటు, కొత్త పోస్టులను సృష్టించడం వంటి వాటివల్ల ఏర్పడినట్లు తెలిపారు. విభాగాల వారీగా ఖాళీలు పరిశీలిస్తే.. అక్టోబర్‌ 30 నాటికి …

Read More »

సోషల్ మీడియాలో అలా పోస్ట్ చేస్తే ఇక ఉక్కుపాదమే.. 28,000 URLలను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం

భారత ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో 28000 పైగా URLలను రికార్డు స్థాయిలో బ్లాక్ చేసింది. 2024లో జాతీయ భద్రతకు విఘాతం కలిగించే విధంగా ఉన్న సోషల్ మీడియా పోస్టులన్నింటిని కేంద్రం బ్లాక్ చేసింది. ఈ URLలలో ఖలిస్తాన్ అనుకూల వేర్పాటువాద ఉద్యమాలకు సంబంధించిన కంటెంట్, ద్వేషపూరిత ప్రసంగాలు, మోసం, జాతీయ భద్రత, ప్రజా శాంతిభద్రతలకు ముప్పుగా భావించే అంశాలు ఉన్నాయని పేర్కొంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69A ప్రకారం ఈ యూఆర్ఎల్ లను బ్లాక్ చేయడం జరిగింది.. ఇది దేశానికి హానికరంగా …

Read More »