ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ఒక బీజేపీ భావిస్తుంటే.. ఇండియా కూటమి అనూహ్యంగా తమ అభ్యర్థిని బరిలోకి దించడంతో ఎన్నిక అనివార్యం అయ్యింది. దీంతో బీజేపీ మిగతా పార్టీలతో కలిసి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వైసీపీ అధినేత జగన్‌కు ఫోన్ చేసి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిని బలపర్చాలని కోరినట్టు తెలుస్తోంది. దీనిపై సానుకూలంగా స్పందించిన జగన్ ఇటీవలే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి తమ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. …
Read More »Blog Layout
ఏపీలో పెన్షన్ పాలిటిక్స్.. దివ్యాంగుల పెన్షన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు..!
ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ టాక్ పీక్స్‌కి చేరింది..! అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఫ్యాన్ పార్టీ లబోదిబోమంటుంటే.. కేవలం అనర్హులను మాత్రమే ఏరిపారేస్తామని అధికార పార్టీ కౌంటర్ ఎటాక్ చేస్తోంది. పెద్దఎత్తున దివ్యాంగుల పింఛన్లు తొలిగిస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో అధికారులతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో అడ్డదారిలో సదరం సర్టిఫికెట్లు తీసుకుని పెన్షన్ పొందుతున్నవారిపై ఇటీవల జరిపిన పున:పరిశీలన వివరాలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. ఏపీలో పెన్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి..! దివ్యాంగుల పెన్షన్ పక్కదారి …
Read More »దేశంలో అత్యంత పొడవైన రైల్వే నెట్ వర్క్ ఈ రాష్ట్రానిదే..! భారతీయ రైల్వేలో రారాజు.. ఎన్ని వేల కిలో మీటర్లంటే..
ఇక్కడ 150 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల ఐదు ప్రాచీన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అవి బ్రిటిష్ కాలంలో నిర్మించబడ్డాయి. వందల సంవత్సరాల తర్వాత కూడా వాటి అందం అంతే ఆకర్షనీయంగా ఉంటుంది. ఈ స్టేషన్లలో లక్నోలోని చార్‌బాగ్, కాన్పూర్ సెంట్రల్, గోరఖ్‌పూర్, ప్రయాగ్‌రాజ్ సెంట్రల్, ఆగ్రా ఫోర్ట్ రైల్వే స్టేషన్ కూడా ఉన్నాయి. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌గా గుర్తింపు పొందింది. 68,525 కి.మీ. పొడవైన రైలు నెట్‌వర్క్ దేశంలోని ప్రతి మూలలో విస్తరించి ఉంది. …
Read More »ట్రంప్‌కు చెక్..! చైనాకు ప్రధాని మోదీ.. ఆ ఘటన తర్వాత తొలిసారి టూర్..
ప్రధాని మోదీ చైనా పర్యటన ఖరారు అయ్యింది. ఈ నెల 31 నుంచి రెండు రోజుల పాటు ఆయన చైనాలో పర్యటించనున్నారు. షాంఘై సహకార సదస్సులో మోదీ పాల్గొననున్నారు. ఎస్‌సీవో సదస్సుకు రావాలని చైనా మోదీని ఆహ్వానించింది. ఈ ఆహ్వానం మేరకు ప్రధాని ఆ దేశంలో పర్యటించనున్నారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ టారీఫ్‌లు పెంచిన నేపథ్యంలో మోదీ చైనా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా గాల్వాన్ ఘటన తర్వాత ప్రధాని చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. 2019లో జరిగిన ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు మోదీ …
Read More »మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలా? అద్భుతమైన ట్రిక్!
సాధారణంగా కొన్ని సిలిండర్‌లో అప్పుడప్పుడు సిన్నగా గ్యాస్ లీక్ అవుతుంటుంది. గ్యాస్ రెగ్యులేటర్, పైపు, బర్నర్‌ను చెక్ చేసుకోవాలి. మీ స్టవ్‌లో గ్యాస్ లైన్ దెబ్బతిని వుంటే వంట చేయనప్పుడు కూడా గ్యాస్ వృధా అవుతుంది. బర్నర్: చాలా మంది వంట చేసేటప్పుడు బర్నర్‌ను మొత్తం పైకి తిప్పే అలవాటు ఉంటుంది. దీని వల్ల మీ ఎల్పీజీ గ్యాస్ త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఏదైనా వేడి చేయాలనుకున్నా, వంట చేయాలనుకున్నా పాత్ర కింది భాగంలో మంట ఉండేలా బర్నర్ ను తిప్పుకుంటే …
Read More »రాజకీయాలకు దూరంగా ఉన్నా విమర్శిస్తున్నారు.. అందుకే స్పందించను.. మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు..
నేను రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నా.. అయినా.. కొందరు నాపై అకారణంగా విమర్శలు చేస్తున్నారు .. ఆ విమర్శలకు నేను చేసిన మంచి పనులే జవాబు.. అంటూ మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌పై తాను మాట్లాడకపోయినా తాను చేసిన మంచి మాట్లాడుతుందని అగ్ర కథానాయకుడు చిరంజీవి చెప్పుకోచ్చారు.. ఫీనిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌కు మెగాస్టార్ చిరంజీవి, తేజా సజ్జా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాలకు …
Read More »అంతా దైవ మహత్యమే.. అకస్మాత్తుగా గుడి ముందు ప్రత్యక్షమైన దేవుడి విగ్రహాలు.. చిన్న కథ కాదు..
ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదకూరపాడు మండలం గారపాడులో స్థానికులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. అందరూ అంత సంతోషం వ్యక్తం చేసే సందర్భం ఏంటా అనుకుంటున్నారా..? పెద్ద కథే ఉంది.. దేవుడి గుడిలో మాయమైన విగ్రహాలు.. అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాయి.. ఎలా అనుకుంటున్నారా..? అయితే.. ఈ మొత్తం కథ తెలుసుకోండి. రెండు రోజుల క్రితం గ్రామంలోని మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో పూజలు చేసేందుకు ఎప్పటిలాగే పూజారి వచ్చారు. గుడిలోకి అడుగుపెట్టిన పూజారి ఆశ్చర్యపోయారు. గుడిలోని హుండీ పగల కొట్టి ఉండటంతో దొంగతనం జరిగిందని …
Read More »ఆంధ్రాలో వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో.. ఈ జిల్లాలకు కుండబోతే
రుణుడి ప్రతాపం షురూ అయ్యింది..! ఇక ఇప్పటి నుంచి వాతావరణంలో మార్పులు జరగబోతున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు రోజులు ఎలా ఉండబోతోంది.? ఏయే జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. రాయలసీమ, పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. నిన్నటి ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం , ఉత్తర తమిళనాడు తీరం వెంబడి సగటు సముద్ర మట్టానికి 3 .1 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నది. ఉత్తర కేరళ, …
Read More »చరిత్ర సృష్టించిన అమిత్ షా.. అత్యధిక కాలం పనిచేసిన హోంమంత్రిగా రికార్డు
హోంమంత్రి అమిత్ షా కొత్త రికార్డు సృష్టించారు. కేంద్ర హోంమంత్రిగా అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. 2,258 రోజులు హోంమంత్రిగా పనిచేసిన అమిత్ షా, బీజేపీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ రికార్డును బద్దలు కొట్టారు. అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన కేంద్ర హోంమంత్రిగా నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో రెండవసారి ఆయన మే 30, 2019న పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం (ఆగస్టు 5) జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) పార్లమెంటరీ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ …
Read More »దేశ పాలనకు గుండెకాయ.. కర్తవ్య భవన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కర్తవ్య భవన్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. కర్తవ్య భవన్ లోకి దశలవారిగా కేంద్ర మంత్రుల కార్యాలయాలను తరలిస్తారు. ప్రస్తుతం హోంశాఖతో పాటు విదేశాంగ శాఖ కార్యాలయాలను నార్త్ బ్లాక్ నుంచి కర్తవ్య భవన్ లోకి మార్చారు. కర్తవ్యభవన్‌లో మంత్రుల కార్యాలయాలను ప్రధాని మోదీ స్వయంగా పరిశీలించారు. భారతదేశ పాలనకు గుండెకాయలా నిలిచిన కొన్ని భవనాలు వాటి స్థితి మార్చుకుంటున్నాయి. ఈ మధ్యనే భారత ప్రభుత్వం కొత్తగా నిర్మించిన పార్లమెంట్ …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal