విశాఖ అంటేనే ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్.. సుందరమైన బీచ్ ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు చూడముచ్చటైన పర్యాటక ప్రాంతాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తూ ఉంటాయి. అందుకే ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ విశాఖ రావాలని కోరుకుంటూ ఉంటారు. అటువంటి వారి కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తుంది ఏపీ సర్కార్. చల్లని అద్దాల బస్సుల్లో విహరిస్తూ ప్రకృతి అందాలను వీక్షించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశాఖలో పర్యటించారు. విశాఖలో త్వరలోనే ప్రారంభంగానున్న …
Read More »Blog Layout
సరికొత్త రాజకీయ వ్యూహం.. మహిళకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు..? రేసులో ఆ ముగ్గురు..!
దేశవ్యాప్తంగా పుల్ స్వింగ్‌లో ఉంది కమలం పార్టీ..! వరుసబెట్టి విజయాలు సాధిస్తూ.. ఓ రేంజ్‌లో హవా కంటిన్యూ చేస్తోంది. మరి అలాంటి పార్టీకి కాబోయే కొత్త చీఫ్ ఎవరు..? అమిత్‌షా, రాజ్‌నాథ్, నడ్డా లాంటి అగ్రనేతల తర్వాత ఆ పీఠాన్ని ఎక్కబోయే నాయకుడెవరు..? అన్నదీ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా వినిపిస్తున్న ముగ్గురిలో ఎవరా బిగ్ లక్కీ హ్యాండ్..? హ్యాట్రిక్ విక్టరీతో అధికారంలోకి వచ్చిన కమలం పార్టీ అదే జోష్ కంటిన్యూ చేస్తోంది. ప్రత్యర్థులకందని వ్యూహాలతో అన్ని రాష్ట్రాల్లోనూ బలోపేతమవుతోంది. …
Read More »ఆ గిరిజనులపై డిప్యూటీ సీఎంకు ‘మధుర’మైన అభిమానం..! ఈ సారి ఏం పంపించారంటే..?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లా గిరిజన గ్రామాలకు మరో గిఫ్ట్ పంపారు. కురిడి గ్రామస్తులకు మామిడిపండ్లు అందించారు. రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకున్నారు. వారి కష్టాలను అర్థం చేసుకుని వెంటనే సహాయం చేయడం ప్రశంసనీయం. గ్రామస్తులు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన తండాలో జీవనం.. అమాయక ప్రజానీకం.. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వారిది. రెండు వందలకు పైగా గడపలున్న ఆ కుగ్రామం అమాయక ప్రజలకు నివాసం. అరకుకు అతి సమీపంలో ఉన్నప్పటికీ.. అభివృద్ధికి …
Read More »నిరుద్యోగులకు ఎగిరి గంతేసే న్యూస్.. త్వరలోనే 5 జాబ్ నోటిఫికేషన్లు వస్తున్నాయ్!
రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పరిధిలో దాదాపు 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ల (డిప్యూటీ ఈఓ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు 110 అధ్యాపకులు, 8 పీడీ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ పోస్టుల భర్తీకి త్వరలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇందుకు సంబంధించిన.. తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసేందుకు టీజీపీఎస్సీ సమాయాత్తమవుతోంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో దాదాపు 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ల (డిప్యూటీ ఈఓ) …
Read More »కథన సీమలో కొదమ సింహం.. మన ‘ఆకాష్’ వైపు బ్రెజిల్ చూపు..!
పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన తర్వాత, బ్రెజిల్ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, ఇతర భారతీయ రక్షణ సాంకేతికతలపై ఆసక్తిని వ్యక్తం చేసింది. బ్రెజిల్ ప్రభుత్వం యుద్ధభూమి సాంకేతికత, జలాంతర్గాములు, తీర రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను హతం చేసింది. ఉగ్రవాదలుపై దాడికి ప్రతిదాడిగా భారత్‌పై పాకిస్థాన్ దాడులకు …
Read More »ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల గడువు పెంపు.. ఎప్పటి వరకంటే?
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల గడువు జూన్ 30వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ గడువును పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యా శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల గడువు జూన్ 30వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ గడువును పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యా శాఖ డైరెక్టర్ …
Read More »ప్రశాంతంగా ముగిసిన మెగా డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలు.. ఫలితాలు ఎప్పుడో తెలుసా?
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23 రోజుల పాటు జూన్ 6 నుంచి జూలై 2 వరకు జరిగాయి. దాదాపు అన్ని కేంద్రాల్లో పరీక్షలు సజావుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవి కృష్ణా రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 92.90 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఇప్పటికే ఆన్సర్ కీలు కూడా విడుదలైనాయి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ ఆన్‌లైన్ రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 23 రోజుల పాటు జూన్ 6 నుంచి …
Read More »పేలిన రిఫ్రిజిరేటర్ .. మసిబొగ్గుగా మారిన నివాసం!
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సనత్‌నగర్ పీఎస్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్‌లో ఉన్న ఓ నివాసంలో గురువారం ఉదయం రిఫ్రిజియేటర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న సామగ్రి మొత్తం పూర్తిగా కాలిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంట్లో సిలిండర్ పేలడం, రిప్రిజియేటర్లు పేలి ప్రమాదాలు జరుగుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. తాజాగా మళ్లీ ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగు …
Read More »దలైలామాకు మాత్రమే ఆ హక్కుంది.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
దలైలామా వారసుడిని తమ అనుమతితోనే ఎంపిక చేయాలన్న చైనా ప్రకటనపై భారత్ స్పందించింది. దీనిపై డ్రాగన్ కంట్రీకి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇప్పటికే 15వ దలైలామా ఎంపికలో చైనా జోక్యం ఉండదని.. చైనా అవతల జన్మించిన వ్యక్తే తన వారసుడు అవుతాడని దలైలామా ప్రకటించారు. ఇప్పుడు భారత్ కూడా చైనాకు కౌంటర్ ఇవ్వడం ఆసక్తిగా మారింది. బౌద్ధ మత గురువు దలైలామా తన వారసుడి ఎంపిక ప్రక్రియపై చేసిన ప్రకటన చైనాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తన వారసుడిని ఎంపిక చేసే అధికారం గాడెన్ …
Read More »ఆఫ్ట్రాల్ ఏసీ టెక్నిషియన్ అనుకోకండి.. ఇంత పెద్ద టాలీవుడ్‌ను షేక్ చేశాడు
సినిమా రిలీజ్‌య్యే రోజే టెలిగ్రామ్ గ్రూపుల్లో లీక్ చేస్తున్న కిరణ్‌కుమార్‌ను హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 65కు పైగా సినిమాలను పైరసీ చేసిన అతడు, ఒక్కో సినిమాకు 300 డాలర్లు వసూలు చేసేవాడిగా తేలింది. క్రిప్టో కరెన్సీలో కమిషన్లు తీసుకుంటూ నెలకు లక్షలోపల సంపాదించేవాడని అధికారులు వెల్లడించారు. ఫిలిం ఛాంబర్ ఫిర్యాదుతో పట్టుబడ్డ కిరణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. తెలుగు చిత్రసీమను వణికిస్తున్న పైరసీ మాఫియాలో కీలక నిందితుడైన కిరణ్‌కుమార్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal