Blog Layout

బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను వెనక్కి పంపిన కేంద్రం.. నెక్స్ట్ ఏం జరగనుంది..

బనకచర్ల ప్రాజెక్ట్‌తో తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందంటూ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖకు చేసిన ఫిర్యాదుల ప్రభావం కనిపిస్తోంది. పోలవరం – బనకచర్ల ప్రాజెక్ట్‌కు ప్రస్తుత దశలో పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్ట్‌పై పలు సందేహాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్ట్‌కు ఇప్పుడే అనుమతులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌పై ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర …

Read More »

అమెరికా వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు.. సీఎం చంద్రబాబు వార్నింగ్‌‌తో సీన్ రివర్స్.. అసలేం జరిగిందంటే..

తానా, ఆటా సంబరాల్లో మునిగి తేలదామని టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరు చలో అమెరికా అన్నారు. ఇంతలోనే సీఎం చంద్రబాబు ఇచ్చిన ఝలక్‌తో వాళ్లు తిరుగు టపా కట్టారు. చిల్‌ అవుదామని వెళ్లినవాళ్లకు గుండె ఝల్లుమంది. ఇంతకీ వాళ్లకు చంద్రబాబు ఇచ్చిన వార్నింగ్‌ ఏంటి?.. అమెరికాలో తానా, ఆటా, నాటా సంబరాలు షురు కాబోతున్నాయి. వాటిలో ఆటాపాటాతో సందడి చేయడానికి దాదాపు 15మంది టీడీపీ ఎమ్మెల్యేలు అమెరికాకు వెళ్లారు. మడిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలని, పొలిటికల్‌ ప్రెజర్‌ కుక్కర్‌లో నుంచి బయటపడి, చిల్‌ అవుదామని చలో …

Read More »

అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో యూజీ, పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. కోర్సుల వారీగా ఫీజుల ఇవే

హైదరాబాద్‌లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ.. 2025-26 విద్యా సంత్సరానికి సంబంధించి యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 13వ తేదీలోను అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద బీఏ, బీకామ్‌, బీఎస్సీ వంటి యూజీ కోర్సుల్లో, ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్‌సీ, బీఎల్‌ఐఎస్‌సీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ మీడియంలలో ప్రవేశాలు …

Read More »

పాలిసెట్‌ కౌన్సెలింగ్‌కు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. విద్యార్ధులకు హెల్ప్‌లైన్‌ నంబర్లు జారీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ సోమవారం (జూన్‌ 30) నుంచి ప్రారంభమైంది. నిజానికి పాలీసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ జూన్ 20వ తేదీ నుంచే ప్రారంభంకావల్సి ఉంది. అయితే కళాశాలలకు అనుమతుల జారీలో జాప్యం జరగడంతో ఈ ప్రక్రియను వాయిదా వేశారు. దీంతో మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 20 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్‌ జూన్‌ 30కి వాయిదా పడింది. ఈ మేరకు సాంకేతి …

Read More »

గుర్రపు స్వారీకి సై అంటున్న యువత.. బెజవాడలో పెరుగుతున్న ఆదరణ!

రాజరికపు కుటుంబంలో గుర్రపు స్వారి రాని వారంటు ఉండరు. రాజులు నడయాడిన నేల గుర్రాలకు తెలుసంటారు. రాజులు గుర్రపు స్వారీ చేసుకుంటూ ఒక మార్గంలో వెళ్తే, మరలా అదే మార్గంలో గుర్రం తనంతట తానే వస్తుందట. అంతటి జ్ఞానం గుర్రానికి ఉందని పెద్దలు అంటున్నారు. రాజరికపు కాలంలో సుదూర ప్రయాణాలకు గుర్రాలు ఒక్కటే శరణ్యంగా ఉండేది. గత కొంతకాలంగా తగ్గిపోయిన గుర్వపు స్వారీలకు విశాఖలో మళ్లీ ఆధరణ పెరుగుతోంది.గుర్రపు స్వారీలు ఒక ఉల్లాసం గుర్రాలపై స్వారీ చేయడం భలే సరదాగా ఉంటుందని రైడర్స్ అంటున్నారు. …

Read More »

రైల్వే అభ్యర్ధులకు అలర్ట్‌.. ఆర్‌ఆర్‌బీ లోకో పైలట్‌ రాత పరీక్ష షెడ్యూల్‌ వచ్చేసింది!

దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష తేదీలను నోటిఫికేషన్‌లో బోర్డు పేర్కొనలేదు. తాజాగా ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం ఆర్‌ఆర్‌బీ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పరీక్ష జులై 15వ తేదీన ఆన్‌లైన్‌ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో …

Read More »

ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం.. బీజేపీకి రాజీనామా!

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీలో చాలా లోసుగులున్నాయని, కొంతమంది పార్టీని ఎదగకుండా చేస్తున్నారని ఆయన రోపించారు. ‘నేను రిజైన్ లెటర్ కిషన్ రెడ్డికి ఇచ్చాను. ఈ లెటర్ స్పీకర్ కు పంపించమని చెప్పానని ఆయన తెలిపారు. నాకు మద్దతుకు వచ్చిన వారిని బెదిరించారని ఆయన ఆరోపించారు. నాకు ముగ్గురు కౌన్సిల్ …

Read More »

ఆరోగ్య శాఖలో ఒకేసారి రెండు జాబ్‌ నోటిఫికేషన్లు.. నిరుద్యోగులకు పండగే!

రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం రెండు రకాల నోటిఫికేషన్లను మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, స్పీచ్‌ పాథాలజిస్టు పోస్టులతోపాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు..తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం రెండు రకాల నోటిఫికేషన్లను మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, స్పీచ్‌ పాథాలజిస్టు …

Read More »

అబ్బా పండగే.. వలలో చిక్కింది చూసి ఆశ్చర్యపోయిన జాలరి.

విశాఖ సముద్రతీరంలో మత్స్యకారుల శ్రమ ఫలించింది. వలల నిండుగా రొయ్యలు, చేపలు, అరుదైన లాబ్‌స్టర్లు చిక్కాయి. ఈ సీజన్‌ ప్రారంభంలోనే పుష్కలంగా మత్స్య సంపద లభించడంతో మత్స్యకారులు ఆనందంగా ముంచెమడుతున్నారు. 500 కిలోల వరకు రొయ్యలతో సహా, ఒక్కోటి కిలో బరువున్న లాబ్‌స్టర్లు భారీ ధర పలుకుతున్నాయి.విశాఖ తీరంలో మత్స్యకారుల పంట పండుతోంది. వేటకు వెళ్లిన మత్స్యకారుల శ్రమ ఫలిస్తుంది. వలల నిండా చేపలు, రొయ్యలు, లాబ్‌స్టర్లు చిక్కుతున్నాయి. దీంతో మత్స్యకారులకు సిరులు కురిపిస్తోంది. ట్యూనా, పఫర్ ఫిష్, పండుగప్ప, రిబ్బన్ ఫిష్, వివిధ …

Read More »

అమరావతిని దక్షిణాసియాలోనే తొలి క్యాంటమ్ వ్యాలీగా మారుస్తాం.. ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలే మా టార్గెట్- మంత్రి లోకేష్

సీఎం చంద్రబాబు సాంకేతిక విప్లవం రెండో చాప్టర్ క్యాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని, ప్రజారాజధాని అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్యాంటమ్ వ్యాలీగా మారుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా వచ్చే ఐదేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో నిర్వహించిన అమరావతి క్యాంటమ్ వ్యాలీ వర్క్ షాప్‌లో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ వర్క్ షాప్ నకు …

Read More »