గుర్రపు స్వారీకి సై అంటున్న యువత.. బెజవాడలో పెరుగుతున్న ఆదరణ!

రాజరికపు కుటుంబంలో గుర్రపు స్వారి రాని వారంటు ఉండరు. రాజులు నడయాడిన నేల గుర్రాలకు తెలుసంటారు. రాజులు గుర్రపు స్వారీ చేసుకుంటూ ఒక మార్గంలో వెళ్తే, మరలా అదే మార్గంలో గుర్రం తనంతట తానే వస్తుందట. అంతటి జ్ఞానం గుర్రానికి ఉందని పెద్దలు అంటున్నారు. రాజరికపు కాలంలో సుదూర ప్రయాణాలకు గుర్రాలు ఒక్కటే శరణ్యంగా ఉండేది. గత కొంతకాలంగా తగ్గిపోయిన గుర్వపు స్వారీలకు విశాఖలో మళ్లీ ఆధరణ పెరుగుతోంది.

గుర్రపు స్వారీలు ఒక ఉల్లాసం గుర్రాలపై స్వారీ చేయడం భలే సరదాగా ఉంటుందని రైడర్స్ అంటున్నారు. ఇందుకోసం నిష్ణాతుల సమక్షంలో రైడర్స్ శిక్షణ తీసుకొంటున్నారు. పరుగు పందాల మాదిరిగానే, గుర్రాల స్వారీ పోటీలు జరుగుతున్నాయి. విజయవాడలో గుర్రపు స్వారీలకు స్కూల్ కరస్పాండెంట్ కోర్స్‌తో శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 6 నుండి 10 గంటల వరకు గుర్రంపై శిక్షణ ఇస్తున్నారు. గత మూడు సంవత్సరాల నుండి ఇక్కడ గుర్రపు స్వారీలకు శిక్షణ కొనసాగుతుంది. రోజుకి అరగంట, ఇరవై రోజులు మాత్రమే శిక్షణ ఉంది. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీరధారుడ్యానికి ఎంతగానో ఉపయోగపడుతాయి. అందులో భాగంగా గుర్రపు స్వారీ కూడా మానసిక ఉల్లాసానికి, శరీరధారుడ్యానికి ఎంతగానో ఉపయోగ పడుతుందనీ శిక్షణ నిపుణులు అంటున్నారు.

ప్రపంచంలో గొప్ప వ్యాయామం గుర్రపు స్వారీ మాత్రమే అని గుర్రపు స్వారీ శిక్షణ నిపుణులు చెపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సారిగా గుర్రపు రైడ్ శిక్షణ ఇక్కడ ఇస్తున్నామని. చిన్న, పెద్ద, ఆడ, మగ అనే తేడా లేకుండా గుర్రపు స్వారీ నేర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకొంటే, మనసు పెట్టి 20 రోజులలో గుర్రపు స్వారీ నేర్చుకోవచ్చంటున్నారు. గుర్రాలను ఒక చోట ఉంచే ప్రదేశాన్ని టేబుల్స్ అంటారు. గుర్రాలకు ఆలనా పాలన ఇందులోనే జరుగుతుందిని తెలిపారు.

About Kadam

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *