amaravatinews
September 11, 2024 ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి
207
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే హైవేపై.. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మినీలారీ బోల్తాపడటంతో ఏడుగురు చనిపోయారు.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి జీడిపిక్కల లోడుతో మినీలారీ బయల్దేరింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్ల సమీపంలో.. ఆరిపాటిదిబ్బలు-చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో మినీ లారీ అదుపుతప్పి పంటబోదెలోకి వాహనం దూసుకువెళ్లి తిరగబడింది. ఈ ప్రమాదంలో.. సమిశ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన …
Read More »
amaravatinews
September 11, 2024 అమరావతి, ఆంధ్రప్రదేశ్
199
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రుల పేషీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రుల పేషీల్లోకి కొత్తగా సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, సోషల్ మీడియా అసిస్టెంట్లను తీసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీడీసీ) ప్రకటన విడుదల చేసింది. 24 మంది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌లను, 24 మంది సోషల్ మీడియా అసిస్టెంట్లను నియమించబోతున్నట్లు తెలిపారు. వీరిని అవుట్సోర్సింగ్/తాత్కాలిక విధానంలో మంత్రులు పేషీల్లోకి తీసుకుంటారు. ప్రభుత్వం సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌కి విద్యార్హతను బీఈ/బీటెక్‌గా నిర్ణయించింది.. వీరికి నెలకు రూ.50 వేల జీతం ఇస్తారు. …
Read More »
amaravatinews
September 11, 2024 ఆంధ్రప్రదేశ్, కృష్ణా
217
ఏపీని వర్షాలు, వరదలు వణికించాయి.. విజయవాడతో పాటూ మరికొన్ని జిల్లాలపై ప్రభావం కనిపించింది. ప్రధానంగా విజయవాడను వరదలు ముంచెత్తాయి.. ఇళ్లన్నీ నీటమునిగాయి. ఇలా వర్షాలు, వరదలతో నష్టపోయిన విజయవాడ ప్రజలకు ఊరటనిచ్చే దిశగా ఏపీప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ మేరకు నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేకంగా ప్యాకేజీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఈ ప్యాకేజీని అందజేసే దిశగా అడుగులు వేస్తోంది. విజయవాడలో బాగా నీట మునిగిన ఇళ్లకు రూ. 25 వేలు.. అలాగే …
Read More »
amaravatinews
September 6, 2024 ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం
223
ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. విశాఖపట్నం విమానాశ్రయంలో నూతన సేవలు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ విమానాశ్రయం నుంచి నిత్యం ఎంతోమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్టు కార్యకలాపాలను మరింత సులభతరం చేసేందుకు కేంద్రం విశాఖపట్నం విమానాశ్రయంలో డిజి యాత్ర సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. శుక్రవారం కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సేవలను ప్రారంభించారు. విశాఖపట్నంతో పాటుగా రాంచీ, భువనేశ్వర్, ఇండోర్, రాయ్‌పూర్, పట్నా, గోవా, కోయబత్తూరు సహా 9 చోట్ల డిజి యాత్ర సేవలను అందుబాటులోకి తెచ్చారు. …
Read More »
amaravatinews
September 6, 2024 ఆంధ్రప్రదేశ్
171
2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. వైనాట్ 175 అంటూ ఎన్నికల బరిలో నిలిచిన వైసీపీ.. కేవలం 11 సీట్లకే పరిమితమైంది. కొన్ని జిల్లాలలో వైసీపీ ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇక ఎన్నికల తర్వాత కూడా పలువురు ముఖ్యనేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటికీ చాలా మంది పార్టీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్మిర్మాణం చేసి.. పార్టీ …
Read More »
amaravatinews
September 6, 2024 జాతీయం
195
పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. ఇది మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారమనే చెప్పాలి. ఈ క్రమంలో చాలా మంది పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటి వారి కోసం ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అద్భుతమైన పాలసీ అందిస్తోంది. అదే ఎల్ఐసీ జీవన్ తరుణ్ ప్లాన్. ప్రస్తుతం ఈ పాలసీకి మంచి ఆదరణ లభిస్తోంది. ఎందుకంటే ఇందులో సేవింగ్స్ బెనిఫిట్స్‌తో పాటు బీమా కవరేజీ లభిస్తోంది. ఇందులో మనీ బ్యాంక్ …
Read More »
amaravatinews
September 6, 2024 Jobs
195
RRB NTPC Notification 2024 : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) గ్రాడ్యుయేట్ పోస్టులు (లెవల్ 5, 6 పోస్టులు), అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల (లెవల్ 2, 3) కోసం RRB NTPC 2024 షార్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 11,558 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారతీయ రైల్వేలలో వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల(NTPC) పోస్టుల కోసం మొత్తం 11,558 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు 8113 ఉన్నాయి. అలాగే.. అండర్ గ్రాడ్యుయేట్ …
Read More »
amaravatinews
September 6, 2024 క్రైమ్
189
కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందనే ప్రచారాన్ని సీబీఐ తోసిపుచ్చింది. ఈ కేసులో సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడని అందుబాటులో ఉన్న సాక్ష్యాలను బట్టి నిర్దారణకు వచ్చింది. అత్యంత పాశవికంగా వైద్యురాలిపై అత్యాచారం చేసి, హత్యచేశాడని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కేసు విచారణ ‘చివరి దశ’లో ఉందని, త్వరలోనే అభియోగాలు నమోదుచేస్తామని తెలిపాయి. ఈ ఘోరమైన నేరం విషయంలో పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై రాజకీయ ప్రత్యర్థులు, ప్రజా …
Read More »
amaravatinews
September 6, 2024 ఆంధ్రప్రదేశ్, గుంటూరు
200
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లండన్ ప్రయాణం వాయిదా పడింది. ఆయనకు పాస్‌పోర్ట్ కష్టాలు ఎదురయ్యాయి.. మొన్నటి వరకు సీఎం హోదాలో ఉన్న డిప్లోమాటిక్ పాస్‌పోర్ట్ రద్దుయ్యింది.. దీంతో ఆయన జనరల్ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.. ఈ వ్యవహారంపై జగన్ విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణ జరిపి.. ఏడాదికి పాస్‌పోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పుపై జగన్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఐదేళ్ల పాటూ …
Read More »
amaravatinews
September 6, 2024 ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి
198
ఏలూరు జిల్లాలో వైఎస్సార్సీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాకు చెందిన ముఖ్య నేతలు వరుసగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. మాజీ మంత్రి ఆళ్ల నాని, ఏలూరు కార్పొరేషన్ ఛైర్మన్, కార్పొరేటర్లు వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. వీరిలో ఏలూరు కార్పొరేషన్ ఛైర్మన్, కార్పొరేటర్లు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా వైఎస్సార్సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు పార్టీకి రాజీనామా చేశారు. …
Read More »