ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రోజు సెలవు ఇచ్చింది. కనుమ పండుగను కూడా సాధారణ సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీలోని బ్యాంకు ఉద్యోగులకు ఒక రోజు సెలవు ఇచ్చారు. సంక్రాంతి పండుగ రోజు మాత్రమే సెలవు ఇచ్చారు. డిసెంబర్‌లో విడుదల చేసిన 2025 ప్రభుత్వ సెలవుల జాబితాలో.. ఏపీలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు జనవరి 14 మాత్రమే సెలవు ఇచ్చారు, అయితే జనవరి 15న అంటే కనుమ రోజు …
Read More »సంక్రాంతి పండగవేళ సీఎం చంద్రబాబు ఆగ్రహం.. సొంత గ్రామంలో సీరియస్
Chandrababu: సంక్రాంతి పండగ సందర్భంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆయన కుటుంబ సభ్యులు మొత్తం తమ సొంత గ్రామం అయిన తిరుపతి జిల్లా నారావారిపల్లెకు చేరుకున్నారు. 3 రోజుల పాటు అక్కడే ఉండనున్న చంద్రబాబు కుటుంబం.. నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారావారిపల్లెలో ఏర్పాటు చేసిన వివిధ పోటీలు, ఉత్సవాలు చూసేందుకు సీఎం కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నారావారిపల్లెలో 33కేవీ సెమీ …
Read More »నేడే అయ్యప్ప మకరజ్యోతి దర్శనం.. శబరిమలకు పోటెత్తిన భక్తులు
Sabarimala: అయ్యప్ప స్వామి వార్షిక ఉత్సవాల్లో కీలక ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. శబరిమలలోని కందమల శిఖరంపై అయ్యప్ప మకరజ్యోతి దర్శనం ఇచ్చేందుకు సమయం ఆసన్నం అయింది. ఏటా మకర సంక్రాంతి రోజున శబరిమలలో కనిపించే ఈ మకరజ్యోతిని కళ్లారా చూసేందుకు వేలాది మంది అయ్యప్ప భక్తులు.. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి.. శబరి కొండకు చేరుకుంటారు. ఈ క్రమంలోనే ఇవాళ శబరిమలలో కనిపించే మకరజ్యోతిని చూసేందుకు అక్కడ ఉన్నవారే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. టీవీలు, సోషల్ మీడియాల్లో …
Read More »సంక్రాంతికి వస్తున్నాం ట్విట్టర్ రివ్యూ.. బుల్లి రాజే హైలెట్
సంక్రాంతికి వస్తున్నాం అంటూ అనిల్ రావిపూడి, వెంకటేష్ గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రమోషన్స్, ఆ హంగామా అందరికీ తెలిసిందే. ఇక వద్దురా బాబు.. వదిలేయండి.. కచ్చితంగా సినిమా చూస్తాం.. మీ ప్రమోషన్స్ చూడలేకపోతోన్నాం అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టే దాక పరిస్థితి వచ్చింది. అయితే అనిల్ రావిపూడి మీద ఓ ముద్ర ఉంది. పాత కథనే అటు తిప్పి ఇటు తిప్పి ఏదో ఒక కామెడీ ట్రాక్ పెట్టించి ఆడియెన్స్ ఎంగేజ్ చేస్తుంటాడన్న మార్క్ అయితే ఉంది. అందుకే ఎంత ట్రోలింగ్ జరిగినా …
Read More »శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను అల్లు అర్జున్ పరామర్శించాడు. మంగళవారం ఉదయం పూట కిమ్స్ హాస్పిటల్‌కు బన్నీ వెళ్లాడు. బన్నీతో పాటుగా దిల్ రాజు కూడా హాస్పిటల్‌కు వెళ్లాడు. శ్రీతేజ్‌తో పాటుగా రేవతి భర్తను కూడా బన్నీ పరామర్శించాడు. ఈ మేరకు పోలీసులకు ముందే సమాచారం ఇచ్చి, పర్మిషన్ తీసుకుని బన్నీ వెళ్లినట్టుగా తెలుస్తోంది. గత నెలలో సంధ్య థియేటర్ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. పుష్ప 2 ప్రీమియర్ షోలో భాగంగా సంధ్య థియేటర్‌కు బన్నీ వెళ్లడం, అక్కడ …
Read More »ఆర్టీసీ బస్సులో అనుమానంగా కనిపించిన బాక్స్.. తీసి చూస్తే కళ్లు జిగేల్, కళ్లుచెదిరేలా!
నిత్యం లక్షలాదిమంది జనాలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. అయితే కొందరు మాత్రం హడావిడిలో డబ్బులు, బంగారం వంటి వాటిని అక్కడే వదిలేసి బస్సును దిగిపోతుంటారు. ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్లు వాటిని గుర్తించి జాగ్రత్త చేస్తున్నారు.. ఉన్నతాధికారులతో కలిసి తిరిగి వాటిని పోగొట్టుకున్నవారికి ఇచ్చేసి తమ నిజాయితీని చాటుకుంటున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో ఓ ఆర్టీసీ మహిళా కండక్టర్ నిజాయితీ చాటుకున్నారు. ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు పోగొట్టుకున్న బంగారు గొలుసును తిరిగి అందించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ నెల 4వ తేదీన …
Read More »అవి అబద్ధమైతే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటా.. కవిత సంచలన ఛాలెంజ్
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు, సవాళ్లు ప్రతిసవాళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. సంచలన ఛాలెంజ్ విసిరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అడుగడుగునా బీసీలకు అన్యాయం చేశాయని ఆరోపించిన కవిత.. ఈ రెండు జాతీయ పార్టీలు బీసీలకు చేసిన ద్రోహంపై తాను చెప్పిన విషయాల్లో ఏ ఒక్కటి అవాస్తవం అని తేల్చినా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కవిత ఛాలెంజ్ చేశారు. దేశంలో బీసీలకు ఎవరైనా న్యాయం చేశారంటే …
Read More »ఆ జిల్లాకు సూపర్ న్యూస్.. రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్.. 4 వేల ఎకరాలు లీజుకు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయి. టీడీపీ కూటమి సర్కారు చర్యల కారణంగా.. పలు కీలక ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారుతోంది. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా కనిగిరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు కోసం కనిగిరిలో 4000 ఎకరాల బంజరు భూమిని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు లీజుకు ఇవ్వనున్నారు. గురువారం జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నాలుగు వేల ఎకరాల్లో ప్రభుత్వ భూమికి ఎకరాకు ఏడాదికి 15 వేలు …
Read More »lottery king: ఒకప్పుడు కూలీ, ఇప్పుడు లాటరీ కింగ్.. ఏటా రూ.15వేల కోట్ల టర్నోవర్.. ఈడీ దర్యాప్తులో సంచలనం
Lottery king: లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్.. వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ అధికారుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ఎలక్షన్ బాండ్ల సమాచారం బయటికి వచ్చి సమయంలో లాటరీ కింగ్ శాంటియాగో మార్టినే పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. వివిధ పార్టీలకు ఎన్నికల బాండ్ల రూపంలో ఈ లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్.. ఏకంగా 5 ఏళ్లలోనే రూ.1300 కోట్లు వివిధ రాజకీయ పార్టీలకు అందించాడు. ఇదంతా లాటరీ బిజినెస్‌తో సంపాదించిందే కావడం గమనార్హం. అయితే లాటరీ బిజినెస్‌లో మోసాలకు …
Read More »మరోసారి హస్తినకు సీఎం రేవంత్.. ఈసారి ఫ్యామిలీతో, ఢిల్లీ టూ జైపూర్.. 3 రోజులు అక్కడే..!
Revanth Reddy 3 Days Delhi Tour: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈసారి ఒంటరిగా కాకుండా.. కుటుంబ సమేతంగా హస్తినకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. మొదట ఢిల్లీకి వెళ్లి.. అటు నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లనున్నారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడే ఉండనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపారు. కాగా.. ఈరోజు (డిసెంబర్ 10న) సాయంత్రమే శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి పయనం కానున్నారు. అక్కడి నుంచి జైపూర్‌కు వెళ్లనున్నారు. …
Read More »