మరోసారి ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో నిరససలు ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్నాయి. ఆందోళనలతో ఇంఫాల్ లోయ అట్టుడుకుతోంది. రాజకీయ నాయకుల నివాసాలను నిరసనకారులు లక్ష్యంగా చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకుంది. ఏకంగా సీఎం వ్యక్తిగత నివాసానికి నిప్పంటించే ప్రయత్నం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు, పలువురు బీజేపీ నేతల ఇళ్లపై ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు. వీరిలో మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అల్లుడు రాజ్‌కుమార్ సింగ్ నివాసం కూడా ఉంది. శనివారం సాయంత్రం బీరేన్ సింగ్ ఇంటిపైనా దాడికి యత్నించడంతో …
Read More »TimeLine Layout
November, 2024
-
17 November
Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (నవంబర్ 17 నుంచి 23, 2024 వరకు): శుభ గ్రహాల అనుకూలత వల్ల మేస రాశి వారికి ఈ వారం ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): శుభ …
Read More » -
17 November
ఏపీలో వారందరికీ శుభవార్త.. ఉచితంగా ట్రైనింగ్.. ప్రతినెలా రూ.1500..
డీఎస్సీ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి ఉచితంగా శిక్షణ అందిస్తోంది. ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వటంతో పాటుగా స్టైఫండ్ కూడా అందివ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న బీసీ స్టడీ సర్కిళ్లలో డీఎస్సీ కోసం ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. ఉచిత శిక్షణ శనివారం నుంచి ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 జిల్లా కేంద్రాల్లోని బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇస్తోంది. మరోవైపు బీసీ స్టడీ సర్కిళ్లలో డీఎస్సీ ఉచిత కోచింగ్ …
Read More » -
17 November
కస్తూరి శంకర్ అరెస్ట్..హైదరాబాద్‌లో పోలీసులకు దొరికిపోయిన నటి
తెలుగు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి శంకర్ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డారు. నవంబర్ 3వ తేదీ నుంచి పరారీలో ఉన్న కస్తూరిని.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను ప్రత్యేక వాహనాల్లో చెన్నైకి తరలిస్తున్నారు. ఈ నెల 3వ తేదీన చెన్నైలో జరిగిన ఓ బ్రాహ్మణ సమాజం సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేయటం ఒక్కసారిగా దుమారం రేపింది. 300 ఏళ్ల కిందట …
Read More » -
17 November
Nikhil Kavya Love Story: నువ్వేకావాలి.. పిచ్చిలేస్తే లేపుకెళ్తా.. కావ్య గురించి చెప్తూ గుండెల్ని పిండేసిన నిఖిల్
బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్ మొదలుకాగానే నాగార్జున శుక్రవారం రాత్రి ఏం జరిగిందో చూద్దామంటూ మన టీవీ ప్లే చేశారు. అందులో హౌస్‌మేట్స్ అందరూ తమ ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చారు. ఒక్కొక్కరూ తమ స్టోరీ గురించి తమ మాటల్లో చెప్పారు. అయితే నిఖిల్ స్టోరీ మాత్రం విన్నవాళ్లందరికీ కన్నీళ్లు తెప్పించేసింది. అసలు అక్కడున్న హౌస్‌మేట్స్ కూడా నిఖిల్ లవర్ మళ్లీ తన దగ్గరికి రావాలంటూ కోరుకున్నారు. అసలు నిఖిల్ ఏం చెప్పాడో చూద్దాం. తనే నా భార్య “నాకు తనే ఆ ఒక్కరు అని …
Read More » -
16 November
AP New Airports: ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు.. నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్ వాసులకు శుభవార్త. ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. నూతన విమానాశ్రయాల ఏర్పాటు దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో 6 కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఫీజిబిలిటీ స్టడీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1.92 కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆరు విమానాశ్రయాల అభివృద్ధికి సంబంధించి ఫీజబులిటీ స్టడీ కోసం నిధులు విడుదల చేస్తామని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి …
Read More » -
16 November
Chandrababu Brother: చంద్రబాబు కుటుంబంలో తీవ్ర విషాదం.. సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. చంద్రబాబు నాయుడు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూ్ర్తి నాయుడు (72) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు.. నవంబర్ 14వ తేదీ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు నారా రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. నారా రామ్మూర్తి నాయుడుకు భార్య ఇందిర, ఇద్దరు కుమారులు …
Read More » -
16 November
UP Fire Accident: నర్సు తప్పిదానికి బూడిదైన 10 మంది పిల్లలు.. ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాదంలో సంచలన విషయాలు
UP Fire Accident: ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదానికి ఓ నర్స్ నిర్లక్ష్యమే కారణమని ప్రత్యక్ష సాక్షి ఒకరు పేర్కొనడం సంచలనం రేపుతోంది. మెడికల్ కాలేజీలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్-ఐసీయూలో మంటలు వ్యాపించి 10 మంది శిశువులు సజీవదహనం అయిన ఘటన ప్రస్తుతం దేశం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని అధికారులు, అంతా ప్రాథమికంగా భావించగా.. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడం పెను …
Read More » -
16 November
బోరున ఏడ్చిన భారత అభిమాని.. సారీ చెప్పిన సంజూ శాంసన్, వీడియో వైరల్
దక్షిణాఫ్రికాతో చివరి టీ20 మ్యాచ్‌లో 135 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్, తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 283/1 పరుగులు చేసింది. అనంతరం ఆతిథ్య సౌతాఫ్రికాను 148 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ మ్యాచులో సంజూ శాంసన్, తిలక్ వర్మ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో సంజూ శాంసన్ బాదిన ఓ సిక్సర్.. మైదానంలో మ్యాచ్ చూస్తున్న …
Read More » -
16 November
అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్‌న్యూస్.. శబరిమలకు స్పెషల్ ట్రైన్లు, వివరాలివే..
తెలంగాణ నుంచి చాలా మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్తుంటారు. కార్తీక మాసంలో అయ్యప్ప దీక్షలు చేపడతారు. 41 రోజుల పాటు కఠినమైన నియమాలు ఆచరిస్తూ నిత్యం అయ్యప్పను పూజిస్తారు. శబరిమల వెళ్లి అయ్యప్పను దర్శించుకుంటారు. కొందరు ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేటు ట్రావెల్స్, సొంత వాహనాల్లో స్వామి దర్శనానికి వెళ్తుంటారు. అయితే అది కొంత ఖర్చుతో కూడుకున్నది. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే తీపి కబురు చెప్పింది. శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ట్రైన్లను నడిపించనున్నట్లు సౌత్ సెంట్రల్ …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal