వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త..12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 11, 2024): మేష రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. మిథున రాశి వారికి ఆదాయం పెరిగినప్పటికీ అందుకు తగ్గట్టుగా కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయ పరిస్థితి చాలావరకు అనుకూలంగానే ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు, ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని ఆర్థిక వ్యవహారాలను పూర్తి చేయడం జరుగుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా కొద్ది పాటి లాభం పొందుతారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి అడుగువేయాలి. ఆర్థిక ప్రయత్నాలన్నీ బాగా కలసి వస్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయం పెరిగినప్పటికీ అందుకు తగ్గట్టుగా కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగి పోతాయి. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. ఆస్తి వివాదంలో ఆచితూచి వ్యవహ రిం చాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతంగా నెరవేరు తుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికర లాభాలనిస్తాయి. ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు బాగా నచ్చుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక సమస్యల ఒత్తిడి నుంచి పూర్తిగా బయటపడతారు. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాల మీద దృష్టి పెడతారు. ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు ఉపయోగపడతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదంలో రాజీమార్గం అనుసరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

సొంత ఇంటి కోసం ప్రయత్నాలు సాగిస్తారు. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. తలపెట్టిన పనులు, వ్యవహారా లన్నీ కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరుగు తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగు తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అదనపు ఆదాయ మార్గాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఇంటా బయటా శారీరక, మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చు. అనేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. కొన్ని ముఖ్యమైన పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. కొన్ని ముఖ్యమైన పనుల్ని, వ్యవహారాల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తి సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమ స్యలకు పరిష్కారం లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవ కాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయ వంతంగా పూర్తవుతాయి. వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. రావలసిన సొమ్మును, బాకీలను వసూలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. దైవ కార్యాలు, సేవా కార్యక్రమాల్లో పాలొంటారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయానికి లోటుండదు కానీ, ఇంటా బయటా ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివా దం పరిష్కార దిశగా సాగుతుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్ర దర్శనం చేసు కుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది. కొందరు బంధుమిత్రుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆర్థిక లావాదేవీల జోలికి పోకపోవడం శ్రేయస్కరం. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాలలో మీకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు గతం కంటే ఇప్పుడు బాగా మెరుగ్గా ఉంటాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరుగు తుంది. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

About amaravatinews

Check Also

12రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో మీ సమర్థతను నిరూపించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు బాగా మెరుగైన స్థితిలో ఉంటాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *