ఆ రాశి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు.. 12రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

Today Horoscope (November 18, 2024): ధనాదాయం విషయంలో మేష రాశి వారు ఈ రోజు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వచ్చే అవకాశముంది. వృషభ రాశి వారికి వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం కావొచ్చు. మిథున రాశి వారు ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ధనాదాయం విషయంలో ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ఒక ప్రణాళిక ప్రకారం వ్యక్తిగత, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది. వ్యాపారంలో కొన్ని మార్పులు చేపట్టి లబ్ధి పొందు తారు. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక విషయాల్లో తొందరపాటుతనం పనికిరాదు. సర్వత్రా గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగాఉండాలి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరు సంతృప్తికరంగా ఉంటుంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారంలో లాభాలు నిలకడగా సాగుతాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కొద్దిగా ఆశాభంగం కలిగిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆదాయానికి లోటుండదు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగంలో అనుకూలతలు, ఆదరాభిమానాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో పని భారం తప్పకపోవచ్చు. ఒకటి రెండు సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఉన్నా ఫలితం ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగు తాయి. కొందరు మిత్రుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉండవచ్చు. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆదాయ మార్గాల మీద శ్రద్ధ పెంచాల్సిన అవ సరం ఉంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ప్రశాంతంగా సాగిపో తుంది. వృత్తి జీవితంలో మంచి గుర్తింపు లభించడంతో పాటు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు విస్తరించే అవకాశం ఉంది. అవసర సమయాల్లో మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో మీ పని తీరు అధికారులకు సంతృప్తి కలిగిస్తుంది. ఉద్యోగం మారడానికి ప్రస్తుతానికి ప్రయత్నాలు చేయకపో వడం మంచిది. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభి స్తుంది. కొందరు బంధువులకు అండగా నిలబడతారు. ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయ మార్గాలు ఉత్సాహాన్ని కలిగి స్తాయి. ముఖ్యమైన పనుల్ని వేగంగా పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరుగుతుంది. బంధువులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన ఆదరణ లభిస్తుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, హుషారుగా సాగిపో తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వ్యక్తిగత విషయాలు బంధుమిత్రులతో చర్చించకపోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం శ్రేయస్కరం. చేపట్టిన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో సకాలంలో బాధ్యతలను నిర్వర్తి స్తారు. అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త గుర్తింపును పొందుతారు. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఎటు వంటి ప్రయత్నమైనా నెరవేరుతుంది. ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు సంతృప్తి కలిగి స్తుంది. అవసరాలకు తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతుంది. ఆహార విహారాల్లోనే కాక, ప్రయాణాల్లో కూడా జాగ్రత్తలు పాటించడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

నిరుద్యోగులకు రకరకాల సంస్థల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. బంధువర్గంలో వివాహ సంబంధం నిశ్చయం అయ్యే సూచనలున్నాయి. నిరర్ధక వ్యవహారాలకు దూరంగా ఉండడం శ్రేయ స్కరం. అదనపు ఆదాయ మార్గాల వల్ల శ్రమ పెరిగినా ఆశించిన ఫలితం ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరుతాయి. వృత్తి, వ్యాపారాలపై శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆస్తి వ్యవహారాల్లో పెద్దలతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఎవ రికీ ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలు కూడా ఉన్నాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. చేప ట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో ఆదరణకు, పోత్సాహానికి లోటుండదు.

About amaravatinews

Check Also

12రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో మీ సమర్థతను నిరూపించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు బాగా మెరుగైన స్థితిలో ఉంటాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *