వారు ఏ ప్రయత్నం తలపెట్టినా సక్సెస్ అవుతారు.. 12రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (సెప్టెంబర్ 18, 2024): మేష రాశి వారికి ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృషభ రాశి వారికి పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం ఖాయమవుతుంది. ఆర్థిక పరిస్థితి పురోగ మన దిశగా సాగుతుంది. మిథున రాశి వారికి కుటుంబంలో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

కుటుంబ సభ్యుల నుంచి అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారపరంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. పిల్లల చదువుల మీద దృష్టి సారిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. పనులన్నీ వేగంగా, చురుకుగా పూర్తవుతాయి. ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ముఖ్యమైన వ్యవహారాలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. దాయాదులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన సహకారం అందుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం ఖాయమవుతుంది. ఆర్థిక పరిస్థితి పురోగ మన దిశగా సాగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కుటుంబంలో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగంలో పని భారం ఉన్నప్పటికీ ప్రతిఫలం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. దైవ సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొం టారు. పిల్లలు ఆశించిన విజయాలు సాధిస్తారు. స్థిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహకారం ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

కొందరు మిత్రుల మీద అతిగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అనుకున్న సమయానికి అను కున్న విధంగా పనులు పూర్తవుతాయి. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు అందు తాయి. ఇంటా బయటా పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో ప్రత్యేక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయం, ఆరో గ్యం నిలకడగా ఉంటాయి. వృథా ఖర్చుల్ని అదుపు చేయడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరు అందరికీ సంతృప్తి కలిగిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఇంటా బయటా పలుకుబడి పెరు గుతుంది. ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. వాహన యోగం పట్టే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ తేలికగా పూర్తవుతాయి. కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

అనారోగ్య సమస్యల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఊహించని ఆదాయ వృద్ధి కలుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభి స్తుంది. బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఇదివరకటి కంటే బాగా పుంజుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

చేపట్టిన పనులన్నీ నిదానంగా పూర్తవుతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. కుటుంబ వ్యవహారాలను ప్రత్యేక శ్రద్ధతో చక్కబెడ తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలుంటాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగు తాయి. రావలసిన డబ్బు చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుంది. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కష్టార్జితాన్ని మంచి నీళ్లలా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక వ్యవహారాల్లో ధైర్యంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. వ్యాపారాల్లో దూసుకుపోతారు. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. వివాదాలు, విభేదాల విషయంలో సోదరులతో రాజీపడతారు. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అయితే, అనవసర విషయాల మీద ఖర్చులు పెరుగు తాయి. ఇంటా బయటా పనిభారం పెరిగి విశ్రాంతి కరువవుతుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఆదాయం వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కొందరు బంధువులతో మాట పట్టింపులు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఆరోగ్య పరిస్థితికి ఇబ్బంది ఉండదు. అనవసర సహాయాలు పెట్టుకోవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఇంటా బయటా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. బంధువుల నుంచి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరిగి, ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా, నిలకడగా సాగిపోతాయి. పిల్లల చదువులు సంతృప్తికరంగా పురోగతి చెందుతాయి. వ్యక్తిగత సమస్యల్ని జాగ్రత్తగా పరిష్కరించుకుంటారు. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తవు తాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు, వ్యూహాలు ప్రవేశపెట్టి లబ్ధి పొందుతారు. ఇంటా బయటా వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది.

About amaravatinews

Check Also

12రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో మీ సమర్థతను నిరూపించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు బాగా మెరుగైన స్థితిలో ఉంటాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *