వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 19, 2024): మేష రాశి వారు ఆర్థిక వ్యవహారాలలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగం హోదాతో పాటు పనిభారం ఎక్కువవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో కూడా అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా సాగిపోతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ వ్యవహా రాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగు తాయి. విశ్రాంతి లభించని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. ఇంటా బయటా బాధ్యతల ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇతరుల తగాదాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగం హోదాతో పాటు పనిభారం ఎక్కువవుతుంది. వృత్తి జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. వ్యాఫారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలు కొద్దిగా ఒత్తిడి కలిగి స్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు చేతికి అందు తుంది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ ప్రయత్నాల్లో రెండు మూడు శుభవార్తలు వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదురు తుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం ఆశించినంతగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహా రాల్లో తొందరపాటు పనికి రాదు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ప్రయా ణాల వల్ల బాగా లాభం ఉంటుంది. ఆహార, విహారాల్లో వీలైనంతగా జాగ్రత్తలు పాటించడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో అధికారులు మీ పనితీరు, బాధ్యతల నిర్వహణతో సంతృప్తి చెందుతారు. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. తోబుట్టువులతో ఆర్థిక సమస్యలు లేదా ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపా రాల్లో మరింత ఉత్సాహంగా పని చేసి ఆశించిన స్థాయిలో లాభాలు పెంచుకుంటారు. దైవ కార్యాలు, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో అధికా రుల అండదండలు లభిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు చాలావరకు అనుకూల ఫలితాలని స్తాయి. ఆదాయ మార్గాలు పెరగడానికి బాగా అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి కలుగుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండకపోవచ్చు. ఉద్యోగం కూడా సాఫీగా, హ్యాపీగా సాగిపో తుంది. సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థికంగా ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆదాయ వృద్ధికి అవకాశముంది. స్థాన చలనానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో వైద్యులను సంప్రదించాల్సి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో ముగు స్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థిక విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా వృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా కార్యసిద్ధి కలుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయ త్నాల్లో విజయం సాధిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లల్లో అత్యధిక లాభాలు గడించడం జరుగుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, వ్యాపారాలు ఆర్థికంగా బాగా కలిసి వస్తాయి. వృత్తి జీవితంలో కొద్దిపాటి మార్పులు చేసి లబ్ధి పొందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఉద్యోగంలో అధి కారులకు నమ్మకం బాగా పెరుగుతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాబడి బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆదాయ మార్గాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబంలో కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆరోగ్యానికి లోటు ఉండదు. చాలా కాలంగా పెండింగులో ఉన్న ముఖ్యమైన పనుల్ని మిత్రుల తోడ్పాటుతో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు చాలావరకు అనుకూ లంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. గృహ, వాహనాల ప్రయత్నాలు ఫలిస్తాయి. కొద్దిపాటి శ్రమ, తిప్పటలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు సమయం కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొం టారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. నిరుద్యోగు లకు మంచి ఆఫర్లు అందుతాయి. మీ సలహాలు, సూచనలు బంధుమిత్రులకు ఉపయోగపడ తాయి. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగ వాతావరణం ఉత్సా హకరంగా ఉంటుంది. కుటుంబ జీవితానికి సంబంధించి అనుకోకుండా కొన్ని శుభవార్తలు వింటారు.

About amaravatinews

Check Also

12రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో మీ సమర్థతను నిరూపించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు బాగా మెరుగైన స్థితిలో ఉంటాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *