ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 29, 2024): మేష రాశి వారికి ఈ రోజు అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశ ముంది. వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. మిథున రాశి వారికి ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం మారే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి జీవితంలో ఉన్నవారికి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు వృద్ధి చెందుతాయి. పెట్టుబడులు పెంచ డానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశ ముంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి సంబంధమైన ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ ఆశించిన ఫలితం ఉంటుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో చాలా వరకు అనుకూల వాతావరణం ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఇరుగు పొరుగుతో సమస్యలుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. రావలసిన డబ్బును, బాకీలను వసూలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులతో సమస్యలు తగ్గి, ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. జీవిత భాగస్వామితో తొందరపాటు వైఖరి మంచిది కాదు. ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇతరుల వివాదాల్లో తలదూర్చి ఇబ్బంది పడతారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాల్లో చిన్నా చితకా సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగంలో అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. పిల్లలు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాలు సజావుగా, సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఒత్తిడి ఉండకపోవచ్చు. ఉద్యోగంలో కొద్దిగా పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. చేపట్టిన పనులు, వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాలలో సానుకూలతలు ఎక్కువగా ఉంటాయి. అధికారులను పనితీరుతో ఆకట్టు కుం టారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగు తుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. అదనపు ఆదాయ మార్గాలు అంచనాలకు మించిన ఫలితాలనిస్తాయి. కొందరు బంధుమిత్రులకు సహాయం చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో మంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుం టుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారంలో లాభాలపరంగా దూసుకుపోతారు. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన సమా చారం అందుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదు రుతుంది. కుటుంబంతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో కీలక మార్పులు చేపడతారు. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. సొంత పనుల మీద శ్రద్ద పెట్ట డం మంచిది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. జీవిత భాగస్వామికి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఇబ్బడిముబ్బడిగా రాబడి పెరుగుతుంది. ఉద్యో గంలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. నిరుద్యోగులు తప్పకుండా శుభవార్త వింటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల వల్ల లాభముంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సునా యాసంగా పూర్తవుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాలలో శ్రమాధిక్యత బాగా ఎక్కువగా ఉంటుంది. అవసరానికి డబ్బందక ఇబ్బంది పడతారు. వ్యాపారాల్లో కొద్దిగా ఆటుపోట్లు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. చేపట్టిన పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవ హారాల్లో బంధుమిత్రుల సహాయం లభిస్తుంది. ధనపరంగా ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయక పోవడం మంచిది. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యానికి లోటుం డదు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

రావాల్సిన డబ్బును, రాదనుకున్న సొమ్మును రాబట్టుకోవడంలో రోజంతా గడిచిపోతుంది. ప్రయ త్నాలన్నీ ఆశించిన ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన అవసరాలు చాలావరకు తీరిపోతాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ పెట్టడం మంచిది. కొందరు మిత్రులతో అపార్థాలు తలెత్తవచ్చు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవు తాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉచిత సహాయాలను తగ్గించుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో సానుకూలతలు బాగా పెరుగు తాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి, గృహ నిర్మాణ సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. తల్లితండ్రుల నుంచి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో ధన లాభం పొందుతారు. కుటుంబ సమస్యలను కొద్ది ప్రయ త్నంతో పరిష్కరించుకుంటారు. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. ఆహార, విహారాల్లో వీలైనంతగా జాగ్రత్తలు పాటించడం అవసరం. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు.

About amaravatinews

Check Also

12రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో మీ సమర్థతను నిరూపించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు బాగా మెరుగైన స్థితిలో ఉంటాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *