ఆ రాశివారి ఆదాయానికి లోటుండదు.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 30, 2024): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ రోజు బాగా మెరుగుపడుతుంది. వృషభ రాశి వారు వృత్తి, వ్యాపారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మిథున రాశి వారి ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గౌరవమర్యాదలు వృద్ధి చెందుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగ జీవితం సజావుగా సాగిపోతుంది. ధనపరంగా ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు. ఇతరుల తగాదాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యానికి లోటుండదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చేపట్టిన పనుల్లో బాగా ఒత్తిడి ఉంటుంది. కొందరు బంధు మిత్రులతో కొద్దిగా వివాదాలుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు బాగానే ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగి ఇబ్బంది పడ తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకో వాలి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ప్రముఖులతో లాభదాయక పరిచయాలు విస్తృతం అవుతాయి. తల్లి తండ్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. కొందరు ఇష్టమైన బంధువులతో ఇంట్లో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాల్లో కొన్ని వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు అంచనాలకు మించి సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ది చెందుతాయి. డబ్బు తీసుకున్నవారి దగ్గర నుంచి రావలసిన ధనం సకాలంలో అందుతుంది. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. ఇంట్లో శుభ కార్యాలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రధాన సమస్యల్ని అధిగమిస్తారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలకు మంచి కంపెనీల నుంచి ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యానికి లోటుం డదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి సమస్యలుండే అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సోదరులతో స్థిరాస్తి సంబంధమైన వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. పిల్లల విషయంలో ఇబ్బందులు పడడం జరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపో తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఏ పని చేపట్టినా, ఏ ప్రయత్నం తలపెట్టినా వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. బంధుమిత్రుల వల్ల కొద్దిపాటి ఇబ్బందులుంటాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉన్నా ఆశించిన ఫలితాలుంటాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. ఆదాయానికి లోటుండదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాల్లో లాభాలకు సంబంధించిన మీ అంచనాలు నిజమవుతాయి. కుటుంబ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రయ త్నాలు, కొత్త ఆలోచనలు విజయవంతం అవుతాయి. ఉద్యోగ జీవితం నల్లేరు మీది బండిలా సాగి పోతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆదాయం అనేక విధాలుగా పెరుగుతుంది. దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి కూడా బయటపడతారు. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ముఖ్యమైన ప్రయత్నాల్లో అనుకోని విజయాలు సాధిస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. అవసరాలకు తగ్గట్టుగా డబ్బు అందు తుంది. వ్యాపార, ఉద్యోగాల్లో మీ అంచనాలు, ఆలోచనలు ఆశించిన ఫలితాలనిస్తాయి. పిల్లల చదు వుల విషయంలో శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. నిరుద్యోగు లకు దూర ప్రాంత కంపెనీల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. కొందరు దగ్గర బంధువులతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులన్నీసవ్యంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అధి కారులు, సహోద్యోగులతో సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

సొంత పనులకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. రుణ సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారంలో సన్నిహితుల సలహాలు కూడా తీసుకోవడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు అతిగా ఆధారపడే అవకాశం ఉంది. వ్యాపారాల్లో పురోగతి కొద్దిగా మందగిస్తుంది. చేపట్టిన పనులు కూడా నత్తనడక నడుస్తాయి. స్వల్ప అనారోగ్య సూచనలు న్నాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆస్తి వివాదం విషయంలో సోదరుల నుంచి చికాకులు ఎదురవుతాయి. ఆస్తి ఒప్పందం ఒకటి వాయిదా పడుతుంది. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో నూతన నిర్ణ యాలు లాభాలనిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో వీలైనంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగంలో అధికారుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ముఖ్యమైన పనులు, వ్యవహారాలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులు తమకు అందిన అవకాశాలు చేజారకుండా చూసు కోవాలి.

About amaravatinews

Check Also

రాశిఫలాలు 07 డిసెంబర్ 2024:ఈరోజు ధనిష్ట నక్షత్రంలో షష్ రాజయోగం వేళ తులా సహా ఈ 5 రాశులకు ధన లాభం..!

మేష రాశి : ఈ రాశి వారికి ఈరోజు తాము చేసే పనిలో మంచి ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఇది మీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *