వృథా ఖర్చుల విషయంలో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (సెప్టెంబర్ 30, 2024): మేష రాశి వారికి ఈ రోజు బంధుమిత్రులతో స్వల్పంగా వివాదాలు కలిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. మిథున రాశికి చెందిన ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. ఉద్యోగులకు స్థాన చలనాలు తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులతో స్వల్పంగా వివాదాలు కలిగే అవకాశం ఉంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు చాలావరకు ఫలిస్తాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అదనపు ఆదాయం విషయంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది.
  2. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): చిన్ననాటి మిత్రులతో విహార యాత్ర చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. జీవిత భాగస్వామితో దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వ్యాపారులకు లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటారు. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమై ఊరట చెందుతారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. కార్యకలాపాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగు తాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా, సామాన్యంగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా మంచి కంపెనీల నుంచి శుభవార్తలు అందుతాయి.
  5. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): బంధువులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయ డం మంచిది కాదు. అదనపు ఆదాయం కోసం కాస్తంత ఎక్కువగా కష్టపడతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు సంబంధించిన అవకాశాలు పెరుగు తాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరగడం వల్ల విశ్రాంతి కరువవుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజ యాలు లభిస్తాయి. బంధువర్గంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
  6. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలు, కార్యక్ర మాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యో గుల ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. బంధుమిత్రుల నుంచి రావలసిన సొమ్మును వసూలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని లాభాలు పొందుతారు. ఉద్యోగంలో అధి కారులకు మీ పనితీరు సంతృప్తి కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది.
  7. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): తల్లితండ్రుల సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వ్యాపారాలో జోరందుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా కార్యసిద్ధి ఉంటుంది. ముఖ్యంగా ఆదాయ, ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా అనుకూల ఫలితాలనిస్తుంది. కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  8. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు, వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అన్ని రంగాల వారికి ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో ముఖ్యమైన శుభవార్తలు వింటారు.
  9. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలుంటాయి. సోదరులతో రాజీమార్గంలో ఆస్తి వివాదాన్ని పరిష్క రించుకునే ప్రయత్నం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యో గంలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. ఆధ్మా త్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితం సజావుగా సాగిపోతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
  10. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యుల కోసం వస్త్రాభర ణాలు కొనుగోలు చేస్తారు. అనుకున్న పనుల్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. మిత్రులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ఆశించిన శుభవార్త వింటారు.
  11. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదం నుంచి తెలివిగా బయట పడతారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఉద్యోగాల్లో తగిన గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక ధన లాభం పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సవ్యంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఒడిదుడుకులకు లోనవుతుంది. రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. ఆర్థిక విషయాల్లో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం, ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
  12. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అంది అవసరాలు తీరిపోతాయి. ప్రయాణాల్లో కూడా ఆశించిన ప్రయోజనాలు సిద్దిస్తాయి. కొన్ని వృథా ఖర్చులు తప్పకపోవచ్చు. మీ పనితీరుతో అధికారులు తృప్తిపడతారు. సహోద్యోగులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారాలు నిదానంగా కొనసాగుతాయి. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో నిరుద్యోగులు తప్పకుండా శుభవార్త వింటారు.

About amaravatinews

Check Also

12రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో మీ సమర్థతను నిరూపించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు బాగా మెరుగైన స్థితిలో ఉంటాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *