చూడటానికి తియ్యటి చాక్లెట్స్‌లా ఉన్నాయి.. ఓపెన్ చేసి చూస్తే గుండె ధడేల్..!

చూడటానికి తియ్యటి చాక్లెట్స్ లాగే ఉంటాయి.. రంగుల కాగితం చుట్టి, చూస్తే తినాలి అనిపించేంత అందంగా ఉంటాయి. కానీ, అవి బయట షాపుల్లో దొరికే చిన్న పిల్లలు తినే చాక్లెట్లు అనుకుంటే మీరు పొరబడినట్లే.. అచ్చంగా గంజాయి చాక్లెట్లు.. ఏకంగా 4 కేజీల, 957 గ్రాముల గాంజా చాక్లెట్స్ సీజ్ చేసి, అవి అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ప్రాంతంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం రైడ్స్ చేపట్టింది. ఇందులో భాగంగా గాంజా చాక్లెట్స్ విక్రయిస్తున్న వీరేంద్ర పాండే అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 4 కేజీల, 957 గ్రాముల గాంజా చాక్లెట్స్ సీజ్ చేశారు. నిందితుడు వీరేంద్ర పాండే బీహార్ రాష్ట్రం నుంచి ఈ గాంజా చాక్లెట్లను తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ నగరంలో గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా వీటిని చిన్నపిల్లల వరకు చేరకుండా ఉండేందుకు కట్టడి చేశామని తెలిపారు. ఆపై సీజ్ చేసిన ప్రాపర్టీని, నిందితుడిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.

About Kadam

Check Also

వంశీ కేసులో దర్యాప్తు ముమ్మురం చేసిన పోలీసులు

– లెక్కలన్నీ తేలుస్తాం…! అందరిని బయటకు తీస్తాం..! అంటూ వల్లభనేని వంశీ కేసులో దూసుకుపోతున్నారు పోలీసులు. ఓవైపు టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌… …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *