యాదగిరిగుట్టపై భార్యతో కలిసి పాడి కౌశిక్ రెడ్డి ఫొటోషూట్.. నెట్టింట ఆసక్తికర చర్చ..!

తరచూ ఏదో ఓ వివాదంలో ఇరుక్కునే హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చీర గాజులు చూపిస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించగా.. ఆ తర్వాత శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో నువ్వెంత అంటే నువ్వెంతా అంటూ చేసుకున్న విమర్శలు దాడులకు దారి తీయటం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత సైలెంట్ అయిన పాడి కౌశిక్ రెడ్డి.. తాజాగా మరోసారి తెరపైకి వచ్చారు.

ఆదివారం (అక్టోబర్ 20న) రోజున తన సతీమణి శాలిని జన్మదినం సందర్భంగా.. ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ల వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో.. తన సతీమణితో ఉన్న ఫొటోలు, వీడియోలను పంచుకున్నారు. అయితే.. ఆ ఫొటోలు, వీడియోలు.. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాగిరిగుట్టపైన తీసుకున్నవి కావటమే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారగా.. వాటిపై చర్చ నడుస్తోంది.

కౌశిక్ రెడ్డి పంచుకున్న ఫొటోల్లో.. ఆలయ వీధుల్లో తన భార్యతో కలిసి ఉన్న ఫొటోలతో పాటుగా తన భార్య సింగిల్‌గా తీయించుకున్న ఫొటోలు కూడా ఉన్నాయి. ఫొటోలే కాకుండా.. వీడియోలు కూడా ఉండగా.. వాటికి మంచి మెలోడీ సాంగ్ పెట్టి రీల్స్ రూపంలో పోస్ట్ చేశారు. అయితే.. తన భార్య శాలినితో కలిసి యాదాగిరిగుట్టపైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. ఆలయ నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా ఫొటో షూట్ నిర్వహించుకున్నారంటూ నెట్టింట చర్చ మొదలైంది.

About amaravatinews

Check Also

అయ్యా..! యూరియా అంటే పట్టించుకోవట్లే.. కట్ చేస్తే ఇది సీన్..

వర్షాలు విస్తారంగా పడటంతో పంటలకు యూరియా డిమాండ్ పెరిగింది. కానీ సరఫరా సరిగ్గా జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *