బోనాల జాతరకు వేళాయెరా..! ఈ ఉత్సవాలు ఏ రోజున ఎక్కడ జరగనున్నాయంటే..

బోనాల పండుగ ఇది హైదరాబాద్ పండుగ ఆషాడమాసం అనగానే హైదరాబాద్ బోనాల గుర్తుకొస్తాయి ఈ బోనాల పండుగ నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను ముమ్మరం చేస్తుంది. ప్రతి ఏడాది బోనాల జాతర ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. నెలరోజుల పాటు జరిగేటటువంటి ఈ బోనాలకు లక్షలాదిమంది భక్తులు ఆయా ప్రాంతాల్లో బోనాలు సమర్పించుకొని మొక్కులను చెల్లించుకుంటారు

ఆషాడ జాతర వచ్చేస్తుంది. అమ్మవారిని తమ ఇంటి బిడ్డగా భావించి అత్త ఇంటి నుంచి పుట్టింటికి తీసుకువచ్చి ఎంతో అందంగా అలంకరించి ధూప నైవేద్యాలతో సారే తో తిరిగి అత్తింటి వారికి పంపించేటటువంటి సాంప్రదాయమే ఈ బోనాల పండుగ. అంతేకాకుండా వర్షాలు పడేటటువంటి ప్రారంభం. దీంతో  పంటలు బాగా పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునేటటువంటి పండుగ కూడా.. అలాంటి బోనాల పండుగ అతి దగ్గరలోనే ఉంది.

ఆషాడ మాసంలోని తొలి ఆదివారం లేదా తొలి గురువారం గోల్కొండ లోని జగదాంబిక ఆలయంలో నిర్వహించే ఉత్సవాలతో బోనాలు మొదలవుతాయి. అప్పటి నుంచి నెల రోజుల పాటు జరిగేటటువంటి ఈ పండుగ ఎన్నో విశేషాలతో కొనసాగుతుంది. ఈ ఏడాది జూన్ 26 నుంచి జూలై 26 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. జూన్ 26న గోల్కొండ బోనాలు ఉత్సవాలతో ప్రారంభమవుతాయి. జూన్ 29న విజయవాడ కనకదుర్గమ్మకు బోనం సమర్పిస్తారు. జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉంటుంది. ఆ తర్వాత రోజు జులై 14న రంగం భవిష్యవాణి..  జులై 20న భాగ్యనగర లాల్ దర్వాజా బోనాల జాతర ఉంటుంది. జులై 21న ఉమ్మడి దేవాలయాల ఘట్టాల ఊరేగింపు నిర్వహించనున్నారు. 24న బోనాల ఉత్సవాల ముగింపు కార్యక్రమాలు ఉంటాయి.

నెల రోజులు పాటు జరిగేటటువంటి బోనాలలో భక్తులు రద్దీ నెలకొంటుంది. దేశ విదేశాల నుంచి బోనాల జాతరను చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. ఈ విధంగా ఆషాడ మాసం అనగానే హైదరాబాదులో జరిగే బోనాలు జాతరే గుర్తుకొస్తుంది. ఈసారి ఈ బోనాల జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు కూడా సన్నద్ధమవుతున్నారు.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *