గంగ ఒడికి గణనాథుడు

  • హైదరాబాద్‌లో మహా నిమజ్జనం ప్రశాంతం
  • ఈసారి పూర్తిగా నీళ్లలో ఖైరతాబాద్‌ గణేశుడు
  • 25 అడుగుల లోతు.. 35 అడుగుల వెడల్పుతో వారం రోజులుగా పూడిక తీయడంతోనే
  • రూ.30.01 లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డూ
  • పలుచోట్ల రూ.10 లక్షలు దాటిన వేలం
  • నిమజ్జనం తీరుపై పొన్నం ఏరియల్‌ వ్యూ
  • ఎన్‌టీఆర్‌ మార్గ్‌కు సీఎం.. ఏర్పాట్ల పరిశీలన
  • పారిశుధ్య కార్మికులు, క్రేన్‌ ఆపరేటర్లతో మాట
  • నిమజ్జనంపై ప్రభుత్వ వ్యవస్థల పనితీరు భేష్‌..
  • రేవంత్‌ పర్యవేక్షణ అభినందనీయం: రాజాసింగ్‌

‘గణేశ్‌ మహరాజ్‌ కీ జై’.. ‘గణపతి బొప్పా మోరియా.. అగ్లే బరస్‌ తూ జల్దీ ఆ’ అంటూ మేళతాళాలు, నృత్యాల మధ్య ఉప్పొంగిన భక్తి భావంతో కూడిన నినాదాలతో పెద్ద సంఖ్యలో భక్తులు గణనాథుడికి వీడ్కోలు పలికారు. మంగళవారం హైదరాబాద్‌లో మహా నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌: ‘గణేశ్‌ మహరాజ్‌ కీ జై’.. ‘గణపతి బొప్పా మోరియా.. అగ్లే బరస్‌ తూ జల్దీ ఆ’ అంటూ మేళతాళాలు, నృత్యాల మధ్య ఉప్పొంగిన భక్తిభావంతో కూడిన నినాదాలతో పెద్ద సంఖ్య లో భక్తులు గణనాథుడికి వీడ్కోలు పలికారు. మంగళవారం హైదరాబాద్‌లో మహా నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. హుస్సేన్‌సాగర్‌, సరూర్‌నగర్‌, ఐడీఎల్‌ చెరువు సహా 73 చోట్ల నిమజ్జనం కోసం క్రేన్లు, ఇతర ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య శిభిరాలు అందుబాటులో ఉంచారు.

గ్రేటర్‌ పరిధిలో 35 వేల మందితో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. వర్షం లేకపోవడంతో భక్తులు పెద్ద సంఖ్యలో శోభాయత్రలో పాల్గొన్నారు. ట్యాంక్‌బండ్‌, ఎన్‌టీఆర్‌ మార్గ్‌ పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. మహా నిమజ్జనంలో ప్రధాన ఆకర్షణ ఖైరతాబాద్‌ గణేషుడిదే! 70 అడుగుల శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి మధ్యాహ్నం 1:40 గంటలకు హుస్సేన్‌సాగర్‌లో గంగమ్మ ఒడికి చేరాడు. ఉదయం 6:32 గంటలకు మొదలైన శోభాయాత్రలో వేలమంది భక్తులు పాల్గొన్నారు. 350 టన్నుల బాహుబలి క్రేన్‌తో 13 నిమిషాల్లోనే నిమజ్జన ప్రక్రియ పూర్తి చేశారు. మునుపైతే.. నిమజ్జనం చేశాక కూడా ఖైరతాబాద్‌ గణేషుడు నీళ్ల మీదే కనిపించేవాడు. అయితే వారం రోజులుగా 25 అడుగుల లోతు.. 35 అడుగుల వెడల్పుతో ప్రత్యేకంగా పూడిక తీయడంతో మహా గణపయ్య సంపూర్ణంగా గంగ ఒడికి చేరాడు! బాలాపూర్‌ గణపతి శోభాయాత్ర ఉదయం 11:20కి ప్రారంభమైంది.

About amaravatinews

Check Also

తేజ్‌ నేను ఎవరితో మాట్లాడలేదురా.. నా కొడుకును మంచిగా చూసుకో.. ఇల్లాలు బలవన్మరణం

కేశవపట్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా తాడికల్‌కు చెందిన 27ఏళ్ల గొట్టె శ్రావ్య రాజన్న సిరిసిల్ల జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *