విదేశంలో మెట్రో రైళ్లు నడపనున్న హైదరాబాద్ మహిళా లోకో పైలట్ ఇందిర.. హ్యాట్సాఫ్

హైదరాబాద్‌కు చెందిన 33 ఏళ్ల మహిళ ఇందిరా ఈగలపాటి.. సౌది అరేబియా రాజధాని రియాద్‌లో సత్తా చాటనున్నారు. రియాద్‌లో త్వరలో ప్రారంభం కానున్న మెట్రో రైళ్లను నడపనున్నారు. రియాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటి ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌ను 2025 జనవరిలో ప్రారంభించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రపంచంలోనే అత్యుత్తమ మెట్రో రైలు వ్యవస్థల్లో ఒకటిగా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం చెబుతోంది. లోకో పైలట్ ఇందిరా ఈగలపాటి.. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో పనిచేశారు. మెట్రో రైళ్లను నడపడం, స్టేషన్ల ఆపరేటింగ్‌లో ఆమెకు విశేష అనుభవం ఉంది.

ఇందిర నైపుణ్యాలను గుర్తించి రియాద్ మెట్రో ప్రాజెక్ట్‌ కోసం ఆమెను ఎంపిక చేశారు. భారత్ నుంచి ఆమెతో పాటు మరో ఇద్దరు ఈ ప్రాజెక్టు కోసం ఎంపికయ్యారు. రియాద్ మెట్రో ప్రాజెక్టు కోసం ఐదేళ్లుగా ఇందిర.. అక్కడ ఐదేళ్లుగా శిక్షణ పొందారు. మెట్రో రైలు లోకో పైలట్, స్టేషన్ ఆపరేషన్స్ మాస్టర్‌గా తన పాత్ర కోసం సిద్ధమయ్యారు.

రియాద్ మెట్రో ప్రాజెక్టు కోసం ఇందిర 2019లో అక్కడికి వెళ్లారు. అయితే, ఆమె అక్కడికి వెళ్లిన కొన్ని రోజులకే కోవిడ్-19 సంక్షోభం వచ్చింది. పాండమిక్ సమయంలో ఆమె శిక్షణ నెమ్మదించింది. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగింది. ఇప్పుడు రియాద్ మెట్రో ప్రాజెక్ట్ తుది దశకు చేరుకుంది. ఇందిర ఇప్పటికే ట్రయల్ రైళ్లను నడుపుతున్నారు. అధికారికంగా నడిపేందుకు ముహూర్తం కోసం ఎదరుచూస్తున్నారు.

About amaravatinews

Check Also

75వ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రధాని మోదీకి, దేశవిదేశాల నుంచి శుభాకాంక్షల వెల్లువ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. దేశవిదేశాలకు చెందిన ప్రతి ఒక్కరూ ప్రధాని మోదీకి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *