FD Rates: దేశంలోని టాప్ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించినట్లు తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. కొత్త వడ్డీ రేట్లను జులై 30వ తేదీ నుంచే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ప్రత్యేక టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు పై జనరల్ కస్టమర్లతో పాటు సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది. వడ్డీ రేట్ల సవరణ తర్వాత గరిష్ఠంగా 7.75 శాతం మేర వడ్డీ అందిస్తోంది. మరి ప్రస్తుతం ఈ బ్యాంకులో లేటెస్ట్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఐసీఐసీఐ బ్యాంక్ లేటెస్ట్ ఎఫ్‌డీ రేట్లు..
- 7 రోజుల నుంచి 29 రోజుల టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రస్తుతం జనరల్ కస్టమర్లకు 3 శాతం వడ్డీ ఇస్తోంది.
- 30 రోజుల నుంచి 45 రోజుల టైమ్ డిపాజిట్లకు 3.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
- 46 రోజుల నుంచి 60 రోజుల డిపాజిట్లకు 4.25 శాతం, 61 రోజుల నుంచి 90 రోజుల డిపాజిట్లకు 4.50 శాతం వడ్డీ అందిస్తోంది.
- 91 రోజుల నుంచి 184 రోజులకు 4.75 శాతం, 185 రోజుల నుంచి 270 రోజులకు 5.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
- 271 రోజుల నుంచి ఏడాదిలోపు టర్మ్ డిపాజిట్లపై 6 శాతం వడ్డీ అందిస్తోంది.
- 1 ఏడాది నుంచి 15 నెలలలోపు డిపాజిట్లకు 6.70 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
- 15 నెలల నుంచి 18 నెలలలోపు టర్మ్ డిపాజిట్లకు అత్యధికంగా 7.20 శాతం వడ్డీ అందిస్తోంది. ఇదే టెన్యూర్‌పై సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం మేర వడ్డీ అందిస్తోంది.
- ఇక 18 నెలల నుంచి 2 ఏళ్లలోపు డిపాజిట్లపై 7.20 శాతం వడ్డీ ఇస్తుండగా సీనియర్లకు 7.70 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
- 2 ఏళ్ల ఒక రోజు నుంచి 5 ఏళ్లలోపు డిపాజిట్లకు 7 శాతం వడ్డీ అందిస్తోంది.
- 5 ఏల్ల నుంచి 10 ఏళ్లలోపు డిపాజిట్లకు 6.90 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
- 5 ఏళ్ల టెన్యూర్ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా జనరల్ కస్టమర్లకు 7 శాతం వడ్డీ అందిస్తోంది.
పైన పేర్కొన్న టెన్యూర్లలో 15 నెలల నుంచి 18 నెలలలోపు మెచ్యూరిటీ టెన్యూర్ డిపాజిట్లపై గరిష్ఠ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది. అలాగే జనరల్ కస్టమర్లతో పోలిస్తే 60 ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు వడ్డీ ఇస్తోంది. అయితే, 15 నెలల నుంచి 18 నెలలోపు డిపాజిట్లుపై 55 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తుండడం గమనార్హం.