దూసుకొస్తున్న ‘దానా’.. ఏపీ సహా నాలుగు రాష్ట్రాలకు ముప్పు.. అలర్ట్ చేసిన ఐఎండీ

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా అనంతరం బుధవారం ఉదయానికి తుఫానుగా మారింది. ఇప్పటికే ఈ తుఫానుకు ‘దానా’ అనే పేరును ఐఎండీ సూచించగా… గురువారం తెల్లవారుజామున (అక్టోబరు 24) ఇది తీవ్ర తుఫానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ప్రస్తుతం ఒడిశాలోని పారాదీప్‌కు ఆగ్నేయంగా 670 కిలోమీటర్లు, పశ్చిమ్ బెంగాల్‌లోని సాగర్ ఐల్యాండ్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 720 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లోని ఖేపుపురకు దక్షిణ-ఆగ్నేయంగా 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రకృతమై ఉన్న ఈ తుఫాను గత ఆరు గంటలుగా గంటకు 3 కి.మీ. వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని తెలిపింది.

తదుపరి 12 తీవ్ర తుఫానుగా మారి పూరీ-సాగర్ ఐల్యాండ్ సమీపంలో శుక్రవారం ఉదయం (అక్టోబరు 25న) తీవ్ర తుఫానుగా తీరం దాటుతుందని చెప్పింది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తాయని తెలిపింది. తీరం దాటి తర్వాత అక్టోబరు 25న ఉదయం 11 గంటల సమయంలో తుఫానుగా బలహీనపడి.. క్రమంగా మరింత తీవ్రత తగ్గి వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు ముప్పు పొంచి ఉందన్న ఐఎండీ.. నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. ప్రస్తుత అంచనా ప్రకారం ఒడిశా, పశ్చిమబెంగాల్, స్థానిక పరిస్థితుల వల్ల గమనం మార్చుకుంటే తుఫాను బంగ్లాదేశ్‌ వైపు వెళ్లే సూచనలు ఉన్నాయి. ఒకవేళ ఈ విపత్తు రీకర్వ్‌ తీసుకుంటే భద్రక్‌ జిల్లాలోని ధమ్రా తీరం దాటుతుందన్న అంచనా. ఈ విపత్తు చేరువైన తరువాత దిశ మార్చుకొనే సూచనలు లేకపోలేదని విదేశీ మెట్‌ సంస్థలు పేర్కొన్నాయి.

About amaravatinews

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *