ఆంధ్రప్రదేశ్‌పై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, వాతావరణశాఖ అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. నైరుతి , ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది. అయినా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ఇవాళ, శనివారం, ఆదివారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. ఇవాళ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నారు.బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడ్రోజులుగా తేలికపాటి నుంచి బలమైన వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో పులిచెర్ల, రొంపిచెర్ల,యాదమరి, బైరెడ్డిపల్లె, విజయపురం, సోమల, వెదురుకుప్పం, సదుం, నగరి, గంగాధరనెల్లూరు, వి.కోట, పాలసముద్రం, శ్రీ రంగరాజపురం, నిండ్ర, చిత్తూరు, చౌడేపల్లె, చిత్తూరు రూరల్‌, తవణంపల్లె, పెనుమూరులో వర్షాలు పడుతున్నాయి. చిత్తూరులో గురువారం ఉదయం నుంచి మబ్బులు కమ్మేసింది.. వానలు పడ్డాయి.

భారీ వర్షాల ప్రభావంతో వరికోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అధికారులు. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలి అన్నారు. అలాగే పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని.. ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా సపోర్టు అందించాలని కోరారు.

About amaravatinews

Check Also

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *