ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. అల్పపీడన ప్రభావంతో ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడగా.. ఈ ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం రెండురోజుల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు దగ్గరగా వెళుతుందని భావిస్తున్నారు. ఈ అల్పపీడన ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది వాతావరణశాఖ.

ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల,అనంతపురం, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు.

మరోవైపు శుక్ర, శని, ఆదివారాల్లో ఉత్తరకోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఆదివారం వరకు సముద్రం అలజడిగా ఉంటుందని.. అలాగే గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. సెప్టెంబరులో ఒకటి లేదా రెండు అల్పపీడనాలు ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

ఏపీలో కొద్దిరోజులుగా విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతుంగా.. మరికొన్ని జిల్లాల్లోల మాత్రం ఎండలు, ఉక్కపోతలతో జనాలు అల్లాడిపోతున్నారు. అయితే అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అంచనాతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. బుధవారం కూడా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి.. కొన్ని చోట్ల ఏకంగా పిడుగులు పడ్డాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు ఎండగా ఉండి.. ఆ తర్వాత వానలు కురిశాయి.

About amaravatinews

Check Also

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *