హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. కాసేపట్లో భారీ వర్షం, జాగ్రత్తగా ఉండండి

హైదరాబాద్ నగరవాసులకు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. కాసేపట్లో నగరంలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత, లేదా రాత్రికి నగరంలో భారీ వర్షానికి ఛాన్స్ ఉందన్నారు. మధ్యాహ్నం వరకు వాతావరణం చాలా తేమగా ఉంటుంది. ఆ తర్వాత అకస్మాత్తుగా క్యుములోనింబస్ తుఫానులు వస్తాయని హెచ్చరిచారు. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.

ఉత్తర తెలంగాణలోనూ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 40కి.మీ మేర ఈదురుగాలులు వీస్తాయనిని.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని చెప్పారు.

కాగా, గురువారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొట్టింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా భారీ వర్షం నగరాన్ని అతాలకుతలం చేసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, దోమలగూడ, పంజాగుట్ట, అమీర్ పేట, సనత్ నగర్, ముషీరాబాద్, జీడీమెట్ల, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, షాపూర్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నాంపల్లి, కోఠి, తిరుమలగిరి, బాచుపల్లి, ప్రగతి నగర్, ఖైరతాబాద్, మారేడ్‌పల్లి, ప్యాట్నీ, బేగంపేట, చిలకలగూడ, మేడ్చల్, దుండిగల్, వనస్థలిపురం, చైతన్యపురి, ఎల్బీనగర్, గండిమైసమ్మ, మలక్ పేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచి, వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

ఇక ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదనీటితో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోని నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. దీంతో ఎగువ నుంచి వస్తున్న నీటిని అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. డ్యామ్ నాలుగు క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో రెండూ 79,528 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా… ప్రాజెక్టు పూర్తిగా నిండింది.

About amaravatinews

Check Also

రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు.. రాయితీపై ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు

తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో తీపి కబురు చెప్పింది. ఇప్పటికే రూ.2 లక్షల రైతు రుణ మాఫీ, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *