బీ అలర్ట్.. భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. అమెరికన్లకు అగ్రరాజ్యం హెచ్చరిక

భారత్‌లోని కొన్ని ప్రాంతాలకు వెళ్లే విషయంలో పునరాలోచించుకోవాలని తమ పౌరులకు అమెరికా ట్రావెల్ అడ్వైజరీ జారీచేసింది. భారత ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌, భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని జమ్మూ కశ్మీర్, పంజాబ్‌తో పాటు మావోయిస్టులు ప్రాబల్యం ఉన్న మధ్య, తూర్పు ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది. భారత్‌లో పెరుగుతోన్న నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అమెరికన్లను హెచ్చరించింది. పాకిస్థాన్ సరిహద్దుల్లోని 10 కి.మీల పరిధిలో కాల్పులు జరిగే అవకాశం ఉన్నందున అటువైపు వెళ్లొద్దని హెచ్చరికలు చేసింది. అలాగే, తూర్పు లడఖ్, లేహ్‌ మినహా జమ్మూ కశ్మీర్‌లోని మరే ప్రదేశాల్లో పర్యటించొద్దని,అక్కడ ఉగ్రవాదం, అశాంతి నెలకొందని తెలిపింది.

తీవ్రవాదం, హింసాత్మక ఘటనల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటనకు వెళ్లే విషయమై పునరాలోచించాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది. భారత్‌ను లెవెల్ 2 జాబితాలో చేర్చిన అమెరికా.. జమ్మూ కశ్మీర్, మణిపూర్, పాక్ సరిహద్దులు, మధ్య, తూర్పు భారత్ వంటి వంటి కొన్ని ప్రాంతాలను మాత్రం ముప్పు ఎక్కువగా ఉండే లెవెల్ 4లో చేర్చింది.

భారత్‌ అధికారుల సమాచారం ప్రకారం.. పలు పర్యాటక ప్రాంతాలు, ఇతర చోట్ల అత్యాచారాలు, లైంగిక వేధింపులు వంటి హింసాత్మక నేరాలు వేగంగా పెరుగుతున్నాయని పేర్కొంది. పర్యాటక ప్రదేశాలు, రవాణా కేంద్రాలు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ సంస్థలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటారని హెచ్చరించింది. ‘భారత్‌-పాక్‌ మధ్య నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి హింసాత్మక ఘటనలు సాధారణం.. కశ్మీర్‌ లోయలోని పర్యాటక ప్రాంతాలైన శ్రీనగర్‌, గుల్‌మార్గ్‌, పహల్గామ్‌లలో ఇవి చోటుచేసుకుంటాయి… అందువల్ల ఎల్వోసీ వెంబడి కొన్ని ప్రాంతాల సందర్శనకు విదేశీ పర్యాటకులను భారత ప్రభుత్వం కూడా అనుమతించదు.. సరిహద్దు వెంబడి ఇరు దేశాల సైనిక బలగాలు మోహరించి ఉంటాయి’ అిని తెలిపింది.

‘‘తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ మీదుగా బెంగాల్‌ వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో మావోయిస్ట్‌ గ్రూప్‌లు చురుగ్గా ఉంటాయి.. ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తర్ ప్రదేశ్ బిహార్‌, బెంగాల్‌, ఒడిశాలలో ప్రభుత్వ అధికారులపై దాడులు జరుగుతున్నాయి.. ఒడిశా నైరుతీ ప్రాంతంలోనూ ఈ ప్రభావం ఉంది.. భద్రతా బలగాలు, ప్రభుత్వ అధికారులపై నక్సల్స్ దాడులు చేస్తున్నారు.. ఈ ముప్పు తీవ్రత కారణంగా అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు ఆ రాష్ట్రాల్లోని ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.. ఆయా రాష్ట్రాల రాజధానులకు వెళ్తే మాత్రం అనుమతి అవసరం లేదు…. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ తూర్పు ప్రాంతానికి వెళ్లడానికి అనుమతి మాత్రం తప్పనిసరి’’ అని అమెరికా తన ట్రావెల్ అడ్వైజరీలో పేర్కొంది.

జాతుల మధ్య వైరంతో ఈశాన్య ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలిపింది. మణిపూర్‌లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రజా రవాణా, మార్కెట్లపై బాంబు దాడులు జరుగుతున్నాయని.. అసోం, నాగాలాండ్‌ ,అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరం, సిక్కిం, త్రిపురలో ఇటువంటి ఘటనలు జరిగాయని వివరించింది.

About amaravatinews

Check Also

భారీ భద్రతా వైఫల్యం.. బ్రిటన్‌ రాజసౌధంలోకి చొరబడ్డ ముసుగు దొంగలు.. !

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే బ్రిటన్‌ రాజ భవనంలోకి ముసుగు దొంగలు చొరబడటం కలకలం రేపుతోంది. కింగ్ ఛార్లెస్‌ (King …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *