IRCTC : రైల్వే సూపర్‌ యాప్‌ వచ్చేస్తోంది..?

IRCTC : భారతీయ రైల్వే (Indian Railway) రోజు రోజుకూ టెక్నాలజీ వినియోగంలో దూసుకుపోతోంది. ఐఆర్‌సీటీసీ ప్రస్తుతం ప్రతి ఒక్కరు వినియోగిస్తున్న యాప్‌. రైళ్లలో ప్రయాణం చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ ఐఆర్‌సీటీసీని ఉపయోగిస్తున్నారు. అలాగే.. టికెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత పీఎన్ఆర్ స్టేటస్, రైలు లైవ్ స్టేటస్‌ తెలుసుకొనేందుకు వేర్వేరు యాప్‌లు, వెబ్‌సైట్‌లు వినియోగించాలి. ఈ కష్టాలకు చెక్ పెడుతూ ఐఆర్‌సీటీసీ ఓ కొత్త సూపర్ యాప్‌ (IRCTC Super APP) ను తీసుకొస్తోంది. ఈ యాప్ ద్వారా అన్ని రకాల రైల్వే సేవలు ఒకేచోట అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

రైల్వేశాఖకు సంబంధించి ఇకపై ఈ యాప్‌లోనే టికెట్స్‌ బుకింగ్‌ (Train Tickets Booking), పీఎన్‌ఆర్‌ స్టేటస్‌ (PNR Status Check), ట్రైన్‌ ట్రాకింగ్‌ (Train Tracking) చేసేందుకు వీలుంటుంది. అంతేకాదు రైలు ప్రయాణంలో ఫుడ్ ఆర్డర్ (Order Food) చేసుకునేందుకు కూడా ఈ యాప్ ఉపయోగపడుతుందట. ఇక.. ప్లాట్‌ఫారమ్‌ టికెట్ నుంచి జనరల్‌ టికెట్‌ వరకు ఆన్‌లైన్‌ మోడ్‌లో కొనుగోలు చేసే వీలుంటుంది. డిసెంబర్ చివరి నాటికి ఈ సూపర్ యాప్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

About amaravatinews

Check Also

ఆర్‌ఆర్‌బీ రైల్వే టీచర్‌ ఉద్యోగాలు.. మరో వారంలోనే రాత పరీక్షలు షురూ!

వివిధ రైల్వే రీజియన్లలో మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీస్‌ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ రాత పరీక్షలు త్వరలోనే జరగనున్నాయి. ఈ పరీక్షలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *