ఇషా అంబానీ తన అందం కోసం ఎలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ వినియోగిస్తారోనని చాలా మంది ఆరా తీస్తారు. కానీ, కొంతమంది అమ్మాయిల మాదిరిగా ఇషా మేకప్ వేసుకోరట. లక్షలు ఖర్చు చేసే బ్యూటీప్రొడక్ట్స్ కూడా వినియోగించరట.. చర్మ సంరక్షణ కోసం ఇంటి చిట్కాలను పాటిస్తారట..! ఇంతకీ ఇషా అందాల రహస్యం ఏంటో చూద్దాం రండి. ఇషా అంబానీ.. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల కూతురు. కుటుంబ వ్యవహారాలను కూడా ఇషా చూసుకుంటుంది. ఆమె అందం, వ్యాపార చతురత అందరినీ ఆకట్టుకుంటాయి. ఇషా అంబానీ తన చర్మ సంరక్షణ కోసం ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే మిలియనీర్ అయినప్పటికీ, ఆమె తన చర్మ సంరక్షణ కోసం హోం రెమిడీస్‌నే ఫాలో అవుతారట. తాను ఎలాంటి మాయిశ్చరైజర్ లేదా ఫేస్ వాష్ ఉపయోగించనని ఇషా అంబానీ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇషా.. తన చర్మం మెరిసిపోయేలా ఉండేందుకు సహజసిద్ధమైన ఉత్పత్తులను మాత్రమే నమ్ముతానని, వాటినే ఉపయోగిస్తానని చెప్పారు. ప్రత్యేక ఈవెంట్ సమయాల్లో ఇషా.. స్మోకీ లుక్‌లో కనిపించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంది. దాని కోసం కొద్దిగా మేకప్ వేసుకుంటారట.. ఈ రకమైన మేకప్ ఆమె అందాన్ని పెంచుతుంది. ఆమె మేకప్‌లో హైలైటర్‌ను ఇష్టపడుతారు. ఇది బుగ్గలకు మెరుపునిస్తుంది.
Check Also
మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోయిందా..? ఈ ట్రిక్స్‌తో వేగంగా పెంచుకోండి..!
Credit Score: బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి రుణాలు కావాలంటే ముందుగా చూసేది క్రెడిట్ స్కోర్. ఇది బాగుంటేనే రుణాలు …