ఐటీ కంపెనీ కీలక ప్రకటన.. హైదరాబాద్ హైటెక్‌సిటీలో కొత్త ఆఫీస్ ప్రారంభం.. నియామకాలు షురూ!

Hyderabad New IT Office: తెలంగాణలోని హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి కంపెనీలు ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎల్ అండ్ టీ, కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీ సహా దిగ్గజ టెక్, ఐటీ సంస్థలు ఇక్కడ ఉన్నాయని చెప్పొచ్చు. ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ సంస్థలు కూడా హైదరాబాద్‌లో కొలువై ఉన్నాయి. దేశీయంగా కూడా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఇలా చాలా కంపెనీలే ఉన్నాయి. ఇక ఐటీ అంటే ముందుగా గుర్తొచ్చేది హైటెక్ సిటీ, గచ్చిబౌలి. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఐటీ సంస్థలు ఉన్నాయి. ఇంకా ఇటీవల కొత్త కొత్త ఆఫీసులు కూడా తెరుచుకుంటున్నాయి. మొన్నటికి మొన్న ప్రపంచస్థాయి ఐటీ కంపెనీ కాగ్నిజెంట్.. కోకాపేటలో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ నూతన ప్రాంగణం ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఇదే క్రమంలో మరో ఐటీ కంపెనీ హైదరాబాద్‌కు విస్తరించింది. ఐటీ సంస్థ ఎహెడ్.. ఇక్కడ కొత్త ఆఫీస్ ప్రారంభించింది. హైటెక్ సిటీలోని RMZ Nexity లో ఆ కార్యాలయం తెరిచింది. కిందటేడాది గురుగ్రామ్‌లో ఏర్పాటు చేసిన డెలివరీ ఆఫీసులో 400 మంది పనిచేస్తుండగా.. ఇప్పుడు దానిని విస్తరించే క్రమంలోనే కొత్త ఆఫీసును హైదరాబాద్ నగరంలో తెరిచినట్లు పేర్కొంది.

గురుగ్రామ్‌లో ఉద్యోగుల సంఖ్యను ఇప్పుడు 750 కి పెంచుకోవాలని చూస్తుండటంతో పాటుగా.. 2025 కల్లా హైదరాబాద్ కార్యాలయంలో కూడా దాదాపు 500 మంది ఉద్యోగుల నియామకం పూర్తి చేయనున్నట్లు ఎహెడ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ గ్రోవర్ తెలిపారు. ఇక హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టడంపై ఉత్సాహంగా ఉన్నామని.. టెక్ కంపెనీలకు అనుకూల వాతావరణం, అద్భుత నైపుణ్యాలు గల ఉద్యోగులు ఇక్కడ లభిస్తారని పేర్కొన్నారు.

కాగ్నిజెంట్‌కు ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఆఫీసులు ఉండగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కోకాపేటలో మరో సంస్థ తెరిచింది. రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థ కాగ్నిజెంట్ అని సీఎం తెలిపారు. మరోవైపు.. ఫ్యూచర్ సిటీలో కూడా కాగ్నిజెంట్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని.. యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఇక కాగ్నిజెంట్ 2002లో హైదరాబాద్‌లో అడుగుపెట్టిందని.. అప్పుడు 189 మందితో ఆఫీస్ ప్రారంభించగా ఇప్పుడు 57 వేల మంది ఉద్యోగులు ఉన్నారని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. కాగ్నిజెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా 3.50 లక్షలకుపైగా ఉద్యోగులు ఉండగా.. సగానికిపైగా భారత్‌లోనే ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల కాగ్నిజెంట్‌లో ఫ్రెషర్ల జీతాలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి.

About amaravatinews

Check Also

రెవ్వెన్యూ శాఖలోకి మళ్లీ జేఆర్వోలు.. అన్ని గ్రామాల్లో 10,911 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో దాదాపు 2 వేల వరకు ‘జూనియర్‌ రెవెన్యూ అధికారి (జేఆర్‌ఓ)’ పోస్టులను ప్రభుత్వం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *