ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలలో చాలా ఘోరంగా ఓడిపోయారు.. అయినప్పటికీ కూడా తాను నేతలతో మాట్లాడి ప్రజలు 40% వరకు మన వైపే ఉన్నారు..
ఎవరు కూడా మనోధైర్యాన్ని కోల్పోకూడదు అంటూ ధైర్యాన్ని నింపే పనిలో ఉన్నారు..అలాగే కార్యకర్తల మీద జరుగుతున్న దాడుల పైన కూడా స్పందిస్తూ త్వరలోనే మరొకసారి యాత్రను చేయబడుతానని కూడా వెల్లడించారు. పార్లమెంటు కమిటీకి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంటులో పార్టీ తరఫున ఎవరు చూస్తారు అనే విషయాన్ని.. అయితే ఇదివరకు లాగా పార్టీరాజ్యసభ నాయకుడిగా విజయసాయిరెడ్డి కొనసాగుతారని తెలిపారు.
లోక్ సభ లోని నాయకుడిగా మిథున్రెడ్డి వ్యవహరిస్తారని. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైవి సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వహిస్తారని ప్రకటించారు. ఇదివరకు రాజ్యసభ ప్లస్ పార్లమెంటరీ.. వ్యవహారాలు రెండు కూడా విజయసాయిరెడ్డి చూసేవారు. ఈ మధ్యన తన మేనమామ అయినటువంటి వై వి సుబ్బారెడ్డి కి రాజ్యసభ ఇవ్వడం.. ఒక ఎత్తు అయితే ఆరేళ్లపాటు ఉంటుంది. ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా బాధ్యతలు అప్పగించారు. అలాగే రాబోయే రోజుల్లో పార్లమెంటరీ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవాలి.. ఈ సీట్లతోనే కేంద్రంలో బార్గాయిని చేయవలసి ఉంటుంది.
అందుకోసం ఆ పని అప్పచెప్పినట్టు అయితే.. ఒకరకంగా చెప్పాలి అంటే ఈ విషయంలో విజయ్ సాయి రెడ్డిని పక్కన పెట్టారని కూడా చెప్పవచ్చు. ఎన్నో ఏళ్లుగా పార్టీ పెట్టినప్పటి నుంచి విజయ సాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటూ ఆయన అడుగులలోనే అడుగులు వేస్తూ ఉండేవారు.. బాధ్యతలు అన్నీ కూడా ఎక్కువ అవ్వడంతా నేతలు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉండడం గుర్తించిన జగన్ మోహన్ రెడ్డి ఇలా పలు రకాల వాటిని నేతలకు సైతం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా వైసిపి నేతలను కూడా అలర్ట్ గా ఉండాలని సూచనలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి.