మంత్రి కొండా సురేఖ తనను సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తలు ట్రోలింగ్ చేస్తున్నారని తెగ బాధపడ్డారు. ఈ క్రమంలో కేటీఆర్ గురించి చెప్పాలనే ఉద్దేశంలో.. సమంత, అక్కినేని ఫ్యామిలీల మీద బుదర జల్లింది. సమంత, అక్కినేని ఫ్యామిలీను కేటీఆర్ వాడుకున్నాడని, బెదిరించాడని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడేసింది కొండా సురేఖ. దీంతో అక్కినేని ఫ్యామిలీ, సమంత తీవ్రస్థాయిలో మండపడింది. ఓ మంత్రి అయి ఉండి ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారు.. ఎలాంటి ఆధారాలు లేకుండా మీడియా ముందు ఇలా బాధ్యతాయుతంగా ఎలా వ్యవహరిస్తారని మండి పడ్డారు.
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చాలా నీచంగా ఉన్నాయని వెంటనే వెనక్కి తీసుకోవాలని నాగ్ డిమాండ్ చేశాడు. అమల సైతం ట్వీట్ వేస్తూ.. ఏకంగా రాహుల్ గాంధీని నిలదీసింది. మీ పార్టీలోని మహిళా నాయకురాలు ఎలా మాట్లాడుతున్నారో చూడండి అన్నట్టుగా ట్వీట్ వేసింది. ఓ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అమల వేసిన ట్వీట్ మీద అఖిల్ కూడా రియాక్ట్ అయ్యాడు. అమ్మా.. నువ్వు చెప్పిన ప్రతీ మాట నిజమే.. నీకు నేను తోడుంటా.. నువ్వు ఇలాంటి నీచమైన వాటి గురించి మాట్లాడాల్సి వచ్చింది.. సారీ.. కానీ మనకు ఇది తప్పదు.. అలాంటి వాళ్లని కట్టడి చేయాలంటే మాట్లాడాల్సిందే అని అఖిల్ అన్నాడు.
ఇలాంటి నీచమైన మాటలు ఎవరో ఒకరు ఫేమ్ కోసం మాట్లాడి ఉంటారని అనుకున్నా.. ఇలాంటి నీచమైన భాషను ఎవ్వరూ వాడరు.. కానీ కొండా సురేఖలో ఇంకా విలువలున్నాయని అనుకుంటున్నా.. ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు ఇలాంటి నిరాధారమైన వాటిని ఎలా చెబుతారు అంటూ కుష్బూ నిలదీసింది. నా సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తుల మీద మీరు ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేయగలిగారు.. ఇకపై మేం అంతా నోర్మూసుకుని ఉండే పరిస్థితి లేదు.. మీరు ఆమెకు కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ కుష్బూ ఫైర్ అయింది.
ఇక ఈ విషయం మీద ఎన్టీఆర్ స్పందిస్తూ.. ఓ వ్యక్తి పర్సనల్ జీవితాన్ని ఇలా రాజకీయాల్లోకి లాగడం, వాడుకోవడం చాలా నీచం.. ఎంతో దిగజారుడుతనం అనిపిస్తోంది.. మీలా ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం తగదు.. ఎదుటి వారి ప్రైవసీకి గౌరవం ఇవ్వాలి.. మీరు ఇలా మా ఇండస్ట్రీలోని వ్యక్తుల గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా చెప్పడం మాకు ఎంతో బాధగా ఉంది.. మీరు ఇలా ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే.. మేం ఇకపై ఖాళీగా, సైలెంట్‌గా ఉండం అంటూ వార్నింగ్ ఇచ్చాడు.
రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడి తప్పించుకోవచ్చు అని అనుకుంటున్నారు.. ఇది చాలా దారుణం.. నీచం.. ఎంతో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి బేస్ లెస్ వాటిని ఎలా చెబుతారు.. ఇది ఒక యాక్టర్ గురించి సంబంధించింది కాదు.. మా సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది.. దీన్ని అందరూ ఖండించాల్సిందే అని నాని ఫైర్ అయ్యాడు. ఆల్రెడీ కొండా వ్యాఖ్యలపై సమంత, నాగచైతన్య స్పందించారు. మా విడాకుల విషయం మా వ్యక్తితం, పరస్పర అంగీకారం అని.. ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయకండన్నట్టుగా కొండా మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.