దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన లాటరీ ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఇందుకు సంబంధించి విద్యార్ధుల ఎంపిక జాబితా తాజాగా విడుదలైంది. మార్చి 7 నుంచి 21వరకు ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులు మీ పిల్లలు ఎంపిక జాబితా తెలుసుకొనేందుకు కేవీ సంఘటన్ అధికారిక వెబ్‌సైట్‌ను దరఖాస్తు చేసిన సమయంలో వినియోగించిన మొబైల్ నంబర్/ఈ-మెయిల్‌కు వచ్చిన లాగిన్ కోడ్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. అనంతరం వెంటనే స్ర్కీన్‌పై మీ దరఖాస్తు స్టేటస్ కనిపిస్తుంది.
ఫలితాల్లో మీ పిల్లల పేర్ల ఉంటే.. దరఖాస్తు చేసేటప్పుడు మీరు ఎంచుకున్న మూడు పాఠశాలల్లో కేటగిరీ వారీగా మీ దరఖాస్తు లాటరీ నంబర్ కనబడుతుంది. అలాగే వెయిటింగ్ లిస్ట్ నంబర్లు కూడా స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి. మీ పిల్లల పేర్లు ఉంటే కేంద్రీయ విద్యాలయ సంఘటన్(KVS) మార్గదర్శకాలకు అనుగుణంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం ప్రవేశాలు కల్పిస్తారు. ఫైనల్ అడ్మిషన్ స్టేటస్‌ను మీరు దరఖాస్తు చేసిన పాఠశాలల్లో నేరుగా తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా విద్యార్ధుల తల్లిదండ్రులకు కేవీ సంఘటన్ హెచ్చరికలు జారీ చేసింది. నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది.