చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది. ఇంటిబయట ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి మాయమాటలు చెప్పిన అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పక్కా ఆధారాలతో నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో అతడిని కఠిన శిక్ష విధించింది.
దేశంలో ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఓ చోట మహిళలు, ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ, పొక్సో వంటి చట్టాలను సైతం కామాంధులు లెక్క చేయడం లేదు. అత్యాచారం చేస్తే ఉరిశిక్ష పడుతుందనే భయం ఉంటేనే ఇవి ఆగేలా కనిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఖమ్మం జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. అభం శుభం తెలియని చిన్నారిపై కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పొలీసులు అరెస్ట్ చేసి నిందితుకి కఠిన శిక్ష పడేలా చేశారు. వాదనల తర్వాత న్యాయస్థానం అతడికి 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పుపై బాధిత కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. అతడికి 20 ఏళ్లు కాదు జీవితాంతం జైల్లోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మాతండాలో నాలుగేళ్ళ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలుశిక్ష, 2 లక్షల జరిమానా విధిస్తూ ఖమ్మం జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి ఉమాదేవి తీర్పు ఇచ్చారు. ధర్మా తండాకు చెందిన బానోతు రాములు అనే వ్యక్తి 2023 ఆగస్టులో ఇంటి బయట ఆడుకుంటున్న నాలుగేండ్ల బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కూసుమంచి పోలీసులు నిందితుడు రాములుపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. అనంతరం ఎంక్వైరీ రిపోర్ట్‌ను కోర్టులో దాఖలు చేశారు. వాదోపవాదాల అనంతరం నిందితుడు రాములుకు 20ఏళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. బాధిత కుటుంబానికి 5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించారు. నిందితుడికి శిక్షపడేలా వ్యవహరించిన పోలీసులను ఖమ్మం సీపీ సునీల్ దత్ అభినందించారు.