తిరుపతి లడ్డూ పై కార్తీ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఫైర్.. హీరో రియాక్షన్ ఇదే..

తాజాగా నిన్న హైదరాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరో కార్తీతోపాటు అరవింద్ స్వామి, మూవీ టీమ్ పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో లడ్డూ కావాలా నాయనా.. ఇంకో లడ్డూ కావాలా నాయనా అంటూ యాంకర్ ప్రశ్నించగా.. దీనిపై కార్తీ చాకచక్యంగా స్పందించాడు. “ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు. ఆ టాపిక్ చాలా సెన్సిటివ్. మనకు వద్దు” అంటూ సమాధానం చెప్పాడు.

కోలీవుడ్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ సత్యం సుందరం. ఇందులో అరవింద్ స్వామి కీలకపాత్రలో నటిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. సెప్టెంబర్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా కొద్ది రోజులుగా వరుస ప్రమోషన్లలో పాల్గొంటుంది చిత్రయూనిట్. అయితే తాజాగా నిన్న హైదరాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరో కార్తీతోపాటు అరవింద్ స్వామి, మూవీ టీమ్ పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో లడ్డూ కావాలా నాయనా.. ఇంకో లడ్డూ కావాలా నాయనా అంటూ యాంకర్ ప్రశ్నించగా.. దీనిపై కార్తీ చాకచక్యంగా స్పందించాడు. “ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు. ఆ టాపిక్ చాలా సెన్సిటివ్. మనకు వద్దు” అంటూ సమాధానం చెప్పాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అయితే కొన్ని రోజులుగా తిరుమల లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకుని కార్తీ ఇలా మాట్లాడి ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్తీ మాటలపై సీరియస్ అయ్యారు. ‘కొందరు లడ్డూ మీద జోకులు వేస్తున్నారు. నిన్న ఒక సినిమా ఫంక్షన్ చూశాను. లడ్డూ టాపిక్ చాలా సెన్సిటివ్ అని అన్నారు. లడ్డూ టాపిక్ సెన్సిటివ్ కాదు.. దయచేసి ఎవరూ అలా అనొద్దు ‘ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

About amaravatinews

Check Also

బ్రదరూ.! బీ కేర్‌ఫుల్.. 90 రోజుల్లో పెండింగ్ చలాన్లు కట్టకపోతే ఇకపై వెహికల్స్ సీజ్

ఇప్పటికే పలు రోడ్డు ప్రమాదాలు విషయంలో హెల్మెట్స్ పెట్టుకోకపోవడమే కారణం కావడంతో సీరియస్ అయిన హైకోర్టు.. పోలీసులకు కీలక ఆదేశాలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *