నాకున్న ఢిల్లీ సోర్స్‌తో చెబుతున్నా.. రేవంత్ చేయబోయేది ఇదే: కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావటం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో చిట్ చాట్‌గా మాట్లాడిన ఆయన.. కేసీఆర్‌కు గవర్నర్ పదవి, కేటీఆర్‌కు సెంట్రల్ మినిస్టర్, కవితకు బెయిల్ ఇవ్వటంతో పాటు రాజ్యసభ సీటు కూడా ఇస్తారని.. హరీష్ రావుకు అసెంబ్లీలో అపొజిషన్ లీడర్ పదవి కట్టెబట్టనున్నట్లు ఆయన కామెంట్లు చేశారు. రేవంత్ చేసిన ఈ కామెంట్లపై తాజాగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

తమ పార్టీ బీజేపీలో విలీనం కావటం కాదని.. సీఎం రేవంతే బీజేపీలో చేరబోతున్నారని కీలక కామెంట్స్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో రేవంత్ టచ్‌లో ఉన్నట్లు చెప్పారు. బీజేపీలో మొదలైన తన ప్రస్థానం అక్కడే ముగుస్తుందని మోదీతో రేవంత్ చెప్పారన్నారు. తనకున్న ఢిల్లీ సోర్స్ ద్వారా వారి మధ్య సంభాషణ తనకు తెలిసిందన్నారు. ఇది నిజమా? కాదా? అనేది రేవంత్ స్పష్టం చేయాలన్నారు. ‘ప్రధాని నరేంద్ర మోదీని రేవంత్ రెడ్డి ఒక్క మాట అనడానికి కూడా భయపడుతున్నారు. ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి చనిపోయే ముందు బీజేపీ జెండా కప్పుకునే చనిపోతానని చెప్పినట్లు సమాచారం. ఇది నిజమా కాదా! అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి. మాకు కేంద్ర మంత్రి పదవులు కూడా రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తున్నారు. అసలు వాస్తవం ఏంటంటే.. ఆయనే బీజేపీలో చేరబోతున్నారు.’ అని కేటీఆర్ కామంట్స్ చేశారు.

ఇక రైతు రుణమాఫీ డొల్లగా తేలిపోయిందని కేటీఆర్ అన్నారు. రుణమాఫీ వివరాల సేకరణ ఈ నెల 20 నుంచి చేపడతామన్నారు. జిల్లా కలెక్టర్ల నుంచి సీఎం వరకు అందరికీ రుణమాఫీ కాని రైతుల వివరాలు అందజేస్తామన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యక్ష పోరాటం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాల నుంచి కూడా వివరాలు సేకరిస్తామన్నారు. అటెన్షన్ డైవర్షన్ కోసం మా ఎమ్మెల్యే హరీష్ రావు కార్యాలయంపై దాడి చేశారన్నారు. 973 పీఏసీఎస్‌లలో తమ చైర్మన్లు, డైరెక్టర్లు ఉన్నారన్నారు. వారి నుంచి వివరాలు సేకరించనున్నట్లు వెల్లడించారు. సుమారు 50 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉండగా.. కేవలం 22 లక్షల రైతులకే పరిమితం చేశారన్నారు. కేవలం 40 శాతం మాత్రమే రుణమాఫీ అయ్యిందన్నారు.

ఇటీవల మహిళలపై తాను యథాపలంగా చేసిన కామెంట్లకు గాను.. మహిళా కమిషన్ నుంచి నోటీస్ వచ్చిందన్నారు. మహిళా కమిషన్ ముందుకు 24న ఉదయం 11 గంటలకు వెళ్లనున్నట్లు చెప్పారు. చట్టాన్ని తాను గౌరవిస్తానని.. 8 నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరిగిన దాడులు, బాధితుల వివరాలు అన్నీ తీసుకొని కమిషన్ ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. ఏం చర్యలు తీసుకున్నారో వారినే అడుగుతానని కేటీఆర్ స్పష్టం చేశారు.

About amaravatinews

Check Also

Radhika Merchant: పేరు మార్చుకున్న అంబానీ చిన్న కోడలు.. పెళ్లి తర్వాత కీలక నిర్ణయం!

Radhika Merchant: రిలయన్స్ ఇండిస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కోడలు రాధికా మర్చంట్ తన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *