పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. ఇది మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారమనే చెప్పాలి. ఈ క్రమంలో చాలా మంది పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటి వారి కోసం ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అద్భుతమైన పాలసీ అందిస్తోంది. అదే ఎల్ఐసీ జీవన్ తరుణ్ ప్లాన్. ప్రస్తుతం ఈ పాలసీకి మంచి ఆదరణ లభిస్తోంది. ఎందుకంటే ఇందులో సేవింగ్స్ బెనిఫిట్స్‌తో పాటు బీమా కవరేజీ లభిస్తోంది. ఇందులో మనీ బ్యాంక్ ఉంటుంది. అయితే, ఈ పాలసీ సెప్టెంబర్ 30, 2024 వరకే అందుబాటులో ఉండనుంది. ఈ జీవన్ తరుణ్ పాలసీని సెప్టెంబర్ 30 తర్వాత ఉపసంహరించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఎల్ఐసీ జీవన్ తరుణ్ ప్లాన్ అనేది ఒక మనీ బ్యాక్ పాలసీ. భవిష్యత్తు అవసరాలు, పిల్లల ఉన్న చదువులు, పెళ్లిళ్ల కోసం ఉత్తమమైన పాలసీ. ఇది ఒక నాన్ లింక్డ్ పాలసీ. అంటే స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకులతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎల్ఐసీ లాభాల్లో పాలసీదారులకు బోనస్ లభిస్తుంది. అయితే ఇది లిమిటెడ్ ప్రీమియం పేమెంట్స్ పాలసీ. అంటే పాలసీ టెన్యూర్ కన్నా ఐదేళ్లు తక్కువగానే ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఈ పాలసీని 90 రోజుల నుంచి 12 ఏళ్ల వయసు లోపు పిల్లల పేరుపై కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కనీస సమ్ అష్యూర్డ్ రూ.75 వేలుగా ఉండగా.. గరిష్ఠ పరిమితి ఏమీ లేదు. మెచ్యూరిటీ సమయం 25 ఏళ్లుగా ఉంటుంది. 20 ఏళ్లు ప్రీమియం కట్టాలి. 25 సంవత్సరాల పాటు బీమా కవరేజీ లభిస్తుంది.
మీ పిల్లల పేరుపై ఈ పాలసీ కొనుగోలు చేస్తున్నప్పుడు మీ పిల్లల వయసు ఏడాది లోపే ఉంటే.. మీ పాలసీ టర్మ్ 24 ఏళ్లుగానే ఉంటుంది. అంటే మీరు 19 ఏళ్లు చెల్లిస్తే సరిపోతుంది. రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్ కి పాలసీ కొనుగోలు చేస్తే మీ నెలవారీ ప్రీమియం రూ.3,832 వరకు అవుతుంది. అంటే మీరు రోజుకు రూ.130 చెల్లించినట్లవుతుంది. ఒకేసారి చేతికి రూ.28 లక్షలు అందుకావాలంటే మీరు రోజుకు రూ.171 చెల్లించాలి. మీ పాప వయసు 2 ఏళ్లప్పుడు పాలసీ తీసుకుంటే 23 ఏళ్లు వచ్చే వరకు పాలసీ వర్తిస్తుంది. 18 సంవత్సరాల పాటు ప్రీమియం కట్టాలి. రూ.10 లక్షలకు తీసుకుంటే అప్పుడు మీకు రోజుకు రూ.171 కట్టాలి. అంటే మీ పెట్టుబడి రూ.10.89 లక్షలు అవుతుంది. మీ పాప లేదా బాబుకు 25 ఏళ్లు వచ్చే నాటికి చేతికి రూ.28.24 లక్షలు అందుతాయి.