మహిళల కోసం కేంద్రం స్కీమ్.. గతేడాదే తెచ్చింది.. అంతలోనే షాకింగ్ ప్రకటన.. ఇక కష్టమే!

 మహిళా ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు.. వారిలో ఆర్థిక సాధికారత పెంపొందించేందుకు.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్.. మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం (MSSC). ఇది వన్ టైమ్ ఇన్వె‌స్ట్‌మెంట్ స్కీమ్. అంటే ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో భాగంగానే దీనిని లాంఛ్ చేసింది. కేవలం మహిళలకు మాత్రమే ఇందులో చేరేందుకు అనుమతి ఉంటుంది. 2023 బడ్జెట్ సమయంలో తీసుకురాగా.. రెండేళ్ల వరకు గడువు విధించింది. అంటే 2025 మార్చి వరకు ఈ స్కీంలో చేరేందుకు అవకాశం కల్పించింది. అయితే ఈ పథకానికి మంచి డిమాండ్ నేపథ్యంలో.. చాలా మంది అకౌంట్లు తెరిచారు. ఈ క్రమంలో మరోసారి పథకం గడువు పొడిగిస్తుందని అనుకున్నప్పటికీ.. ఆ అంచనాలు నిజమయ్యేలా కనిపించట్లేదు. దీనిని ప్రభుత్వం పొడగించబోదని తెలుస్తోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం… స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ కోసం నిధుల్ని గణనీయంగా తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ప్రజల్ని ఇతర పెట్టుబడి సాధనాలైన మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ‌వైపు ఆకర్షితుల్ని చేసేందుకు.. వారి ప్రాధాన్యతల్ని మళ్లించే దిశగా ఇలా చేయనున్నట్లు ప్రముఖ ఆంగ్ల మీడియాల్లో వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం దీంట్లో రెండేళ్ల కాల వ్యవధికి 7.50 శాతం చొప్పున స్థిర వడ్డీ అందిస్తుంది. ఇక పరిస్థితుల్ని బట్టి ఈ వడ్డీ రేటు తగ్గించే అవకాశాలు ఉంటాయి. దీంతో మరింత తగ్గుతుందన్న అంచనాతో డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నారు. అందుకే.. 2025లో గడువు ముగిసే అక్కడితో క్లోజ్ చేస్తుందని.. మళ్లీ గడువు పొడిగించే అవకాశాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. కేంద్రం ఇదే దిశగా ఆలోచిస్తుందని అంటున్నారు.

ఈ పథకం గురించి చూస్తే దీంట్లో కనీసం రూ. 1000 డిపాజిట్ చేయాలి. గరిష్టంగా రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. 100 మల్టిపుల్స్‌లో డబ్బులు డిపాజిట్ చేయొచ్చు. ఇక ఒక అకౌంట్ కింద ఒకే డిపాజిట్ చేయాలి. అయితే 3 నెలల గ్యాప్ పాటిస్తూ.. ఎన్ని అకౌంట్లు అయినా తెరిచేందుకు వీలుంటుంది. ఇక్కడ ఎలాంటి పరిమితి లేదు. ప్రతి త్రైమాసికానికి వడ్డీ లెక్కించి జమ చేస్తారు. మెచ్యూరిటీకి వడ్డీ సహా అసలు కలిపి వస్తుంది.

ముందస్తుగా విత్‌డ్రా చేసుకోవాలంటే వడ్డీ రేటు తగ్గుతుందని చెప్పొచ్చు. ఏడాది తర్వాత 40 శాతం వరకు పెట్టుబడి నుంచి వెనక్కి తీసుకోవచ్చు. పాక్షికంగా మెచ్యూరిటీకి ముందు ఒకేసారి డబ్బులు తీసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో.. అకౌంట్ హోల్డర్ చనిపోయినా.. ప్రాణాంతక వ్యాధి బారిన పడినా ఇలాంటి సందర్భాల్లో అకౌంట్ ముందుగా క్లోజ్ చేస్కునేందుకు అనుమతి ఉంటుంది.

About amaravatinews

Check Also

PF ఖాతా ఉన్నవారికి అలర్ట్.. యాక్టివ్ UAN లేకుంటే ఆ సేవలు బంద్.. చెక్ చేసుకోండి!

PF Account: ఎప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సంస్థ అక్టోబర్ 1, 2014 నుంచి యూనివర్సల్ అకౌంట్ నంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *