ఏపీ మద్యం షాపుల లాటరీలో చిత్ర, విచిత్రాలు జరిగాయి.. కొంతమంది అత్యాశతో ఎక్కువ షాపులకు లాటరీ వేస్తే దరిద్రం వెంటాడింది. కొందరు 100 సంఖ్యలో దరఖాస్తులు వేస్తే.. ఒక్క షాపు కూడా రాని పరిస్థితి. కొందరు సరదాగా దరఖాస్తులు వేయగా.. వారికి షాపులు దక్కడం విశేషం. విజయవాడకు చెందిన ఓ బార్ యజమాని.. తన టీమ్‌తో కలిసి ఏకంగా 480 దరఖాస్తులు వేయగా 11 షాపులు మాత్రమే వచ్చాయి. విజయవాడకు చెందిన మరో మద్యం వ్యాపారి 360 దరఖాస్తులు వేయగా 5 షాపులు దక్కాయి. అమరావతికి చెందిన మరో వ్యక్తి కొందరితో కలిసి 172 దరఖాస్తులు వేయగా 2 షాపులు దక్కాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఓ ముఖ్య నేత స్నేహితుడు 112 దరఖాస్తులు వేయగా.. రెండు షాపులు వచ్చాయి.
విశాఖపట్నం జిల్లాలో నోయిడాకు చెందిన కొంతమంది వ్యాపారులు 250 దరఖాస్తులు చేయగా.. 15 షాపులు దక్కించుకున్నారు. విశాఖ జిల్లాకు చెందిన ఓ మద్యం వ్యాపారి తన సిండికేట్‌తో కలిపి 168 దరఖాస్తులు వేయగా 11 షాషులు దక్కాయి. కాకినాడ జిల్లాలో కొందరు వ్యాపారులు 100 షాపులకు దరఖాస్తులు చేస్తే 4 దక్కాయి. విజయనగరం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 40 దరఖాస్తులు వేయగా.. ఒక్క షాపు కూడా దక్కలేదు. సంతబొమ్మాళికి చెందిన టీడీపీ అనుచరులు బృందం 134 దరఖాస్తులు వేయగా.. 6 షాపులు వచ్చాయి. మరో టీమ్ 61 దరఖాస్తులు వేయగా 3 దుకాణాలు లభించాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఇద్దరు మద్యం వ్యాపారులు కలిసి 250 దరఖాస్తులు చేయగా వారికి కేవలం 4 షాపులే వచ్చాయి.
కర్నూలు జిల్లాలో మహిళలను 9 షాపులు దక్కాయి.. ఇద్దరు మహిళలకు రెండు చొప్పున షాపులు దక్కాయి. వీరిలో ఒకరు తెలంగాణకి చెందిన సుగాలి లక్ష్మిదేవి కాగా.. తెలంగాణకి చెందిన వారికి 8 షాపులు దక్కాయి. కర్నూలుకు చెంది ఓ ముఖ్య మాజీ ప్రజాప్రతినిధి అనుచరులు 60 మంది 246 దరఖాస్తులు చేస్తే ఒక్క దుకాణం కూడా రాలేదు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లక్కీడ్రాలో షాపులు దక్కించుకున్న వారితో మిగిలిన దరఖాస్తుదారులు సిండికేట్ అయ్యారు. కలెక్టరేట్ ప్రాంగణంలోనే లాబీయింగ్‌లు చేశారు. అలాగే వైఎస్సార్‌సీపీతో పాటుగా ఇతర పార్టీ నేతలకు షాపులు దక్కాయి. జిల్లాలో ఐదు మద్యం షాపులను మహిళలకు వచ్చాయి.
Amaravati News Navyandhra First Digital News Portal